E-Paper
Advertisement

విమానాన్ని హైజాక్ చేయలేదట.. పైలెట్ల లొల్లి వల్లే దారి తప్పిందట.. ఎంత టెన్షన్ పెట్టారో!

విమానాన్ని హైజాక్ చేయలేదట.. పైలెట్ల లొల్లి వల్లే దారి తప్పిందట.. ఎంత టెన్షన్ పెట్టారో!
Advertisement

Flydubai Flight Hijack Scare: దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో (FZ1073) ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఈ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేశారంటూ తొలుత పెద్ద ఎత్తున ప్రచారం మెుదలైంది. దీంతో ఇజ్రాయెల్ తన యుద్ధ విమానాలను సైతం రంగంలోకి దిపింది. ఈ క్రమంలోనే విమానం కంట్రోల్ ను లాక్కునేందుకు కాక్ పీట్ లో ఎవరో ప్రయత్నించారన్న ప్రచారం సైతం ఊపందుకుంది. ఈ ఉత్కంఠ కొనసాగుతున్న క్రమంలోనే అసలు విమానం హైజాక్ కాలేదన్న విషయం బయటపడింది. పైలెట్ల మధ్య తలెత్తిన ఘర్షణే ఈ గందరగోళానికి దారితీసిందని వెల్లడైంది. పైలెట్లతో పాటు సుమారు 180 మంది ప్రయాణికులు సేఫ్ గా ల్యాండ్ అవ్వడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

అసలేం జరిగిందంటే?

అంతర్జాతీయ కథనాల ప్రకారం.. కాక్‌పిట్‌లో పైలట్, కో-పైలట్ మధ్య ఉన్నపళంగా తీవ్రమైన గొడవ జరిగింది. ఈ క్రమంలో కో-పైలట్.. పైలట్‌పై చాకుతో దాడి చేసి, విమానం నియంత్రణను తన చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. కాగా ఆ విమానంలోనే సాధారణ దుస్తుల్లో ప్రయాణిస్తున్న మరొక పైలట్ల బృందం సమయస్ఫూర్తితో వ్యవహరించి, విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేసింది.

హాస్పిటల్‌లో పైలట్లు.. క్షేమంగా ప్రయాణికులు

Advertisement

ఈ దాడి ఘటనలో పైలట్, కో-పైలట్ ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారని వారిని చికిత్స నిమిత్తం తబూక్ విమానాశ్రయం నుంచి స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు నిర్వాహకులు తెలిపారు. అదృష్టవశాత్తూ విమానంలో ఉన్న 180 మంది ప్రయాణికులతో పాటు ఇతర సిబ్బంది అందరూ క్షేమంగానే ఉన్నారని వెల్లడించారు.

ఇజ్రాయెల్ యుద్ద విమానాల అలర్ట్

ఫ్లైట్‌రాడార్ 24 గణాంకాల ప్రకారం.. విమానం అత్యవసర సిగ్నల్ పంపడానికి కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే దాదాపు 17,400 అడుగుల కిందకు పడిపోయింది. కాసేపటికే విమానాన్ని హైజాక్ చేసినట్లు సూచించే సాంకేతిక కోడ్ (Squawk 7500) పంపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఇజ్రాయెల్ వైమానిక దళం తమ ఫైటర్ జెట్లను రంగంలోకి దించింది. విమానం ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ వైపు వెళ్లకుండా.. జోర్డాన్ వైమానిక సరిహద్దుల గుండా సౌదీ అరేబియా వైపు మళ్లినట్లు రూట్ మ్యాప్ ద్వారా స్పష్టమైంది.

Advertisement

Also Read: జియో దుమ్మురేపే ఆఫర్.. రూ.299కే 4G స్మార్ట్ ఫోన్.. 6 నెలల పాటు ఫ్రీ కాల్స్, డేటా!

పరిస్థితి అదుపులోనే ఉంది: నెతన్యాహు

ఈ ఘటనపై ఇస్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఇజ్రాయెల్ శత్రువులు దాడికి తెగబడే అవకాశాలు ఉన్నాయని ముందే హెచ్చరించిన నెతన్యాహు.. దేశానికి హాని తలపెట్టాలని చూస్తే ఎంతటివారినైనా వదిలేది లేదని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.

Also Read: సముద్రంలోకి 16 వేల గ్యాలన్ల పింక్ ద్రవం.. తర్వాత జరిగింది చూసి.. యావత్ ప్రపంచమే షాక్!

Tags

Related News

దేశంలోనే పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్ ఇదే.. చిన్నది ఎక్కడుందో తెలుసా?

రైళ్లు కావు.. కదిలే రాజభవనాలు.. భారత్‌ లోని ఈ ట్రైన్లు చూస్తే ఆశ్చర్యపోతారు!

1979లో దీవిలోకి 30 ముంగిసలు.. కట్ చేస్తే ప్రభుత్వానికే చుక్కలు.. 45 ఏళ్లలో ఊహించని విధ్వంసం!

వాటర్ ఫాల్స్ కాదు బ్లడ్ ఫాల్స్.. రక్తం ప్రవహించే ఈ ప్రదేశం ఎక్కడుందంటే?

టికెట్ల నుంచి రైళ్ల మెయింటెనెన్స్ వరకు.. ఈ స్టేషన్‌లో పనిచేసేది అంతా మహిళలే!

మానవులు ఏలియన్స్ తో మాట్లాడవచ్చా? భవిష్యత్ లోనైనా సాధ్యమేనా?

సూర్యాపేటకు రైలు కూత.. దశాబ్దాల కలకు కీలక అడుగులు!

Big Stories

Advertisement
×