Shahid Afridi On Dhurandhar: దేశంలో ప్రస్తుతం ‘ధురంధర్’ 2 ( Dhurandhar 2)సినిమా గురించే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ‘ధురంధర్’ మొదటి పార్ట్ విడుదలై బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక మొన్న ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాక్షన్ మూవీ ‘ధురంధర్’ 2 గట్టిగానే కలెక్షన్స్ రాబడుతోంది. పాకిస్తాన్ అరాచకాలను అరికట్టేందుకు ఏజెంట్ గా హీరో రణవీర్ సింగ్ మారి, ఉగ్రవాదులను ఎలా మట్టుపెట్టాడు ? అన్నదే స్టోరీ. దేశభక్తి అలాగే భద్రత గురించి ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. అయితే ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ ‘ధురంధర్’ 2 పాకిస్తాన్ ప్రజలను ఇప్పుడు వణికిస్తోంది. దీనిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రీది ( Shahid Afridi ) కూడా స్పందించినట్లు ఓ పోస్టు వైరల్ గా మారింది. ధురంధర్ సినిమా ( Dhurandhar ) చూసిన తర్వాత పాకిస్తాన్ దేశంలో ఎవడిని నమ్మలేని పరిస్థితి ఉందని షాహిద్ ఆఫ్రీది వ్యాఖ్యానించినట్లు ఓ పోస్టు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ధురంధర్ , ధురంధర్ 2 రెండు సినిమాలు రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ధురంధర్ 2 హవా కొనసాగుతోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రణవీర్ సింగ్ హీరోగా చేశారు. అంతేకాదు ఈ సినిమాలో గూఢచారిగా మారి పాకిస్తాన్ లోకి ఎంట్రీ ఇస్తాడు హీరో రణ వీర్ సింగ్. ఆ తర్వాత పాకిస్తాన్ రహస్యాలను ఇండియాకు చేరవేర్చి, అక్కడి ఉగ్రవాదులకు చుక్కలు చూపిస్తాడు. బిచ్చగాడి లాగా కూడా ఈ సినిమాలో కనిపిస్తాడు హీరో రణవీర్ సింగ్. ఈ నేపథ్యంలోనే ఈ ధురంధర్ సినిమా ప్రభావం ప్రస్తుతం పాకిస్తాన్ లో కనిపిస్తోంది. బిచ్చగాడిని కూడా నమ్మే పరిస్థితి లేదని షాహిద్ ఆఫ్రీది ( Shahid Afridi ) లాంటి వాళ్లు చెబుతున్నారు.
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది కూడా బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ధురంధర్ 2 సినిమా చూసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా చూసిన తర్వాత షాహిద్ ఆఫ్రీది చాలా వింతగా స్పందించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ కూడా వైరల్ అవుతోంది. ధురంధర్ సినిమా చూసిన తర్వాత పాకిస్తాన్ లో ఇక ఎవరినీ నమ్మలేమని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది. తాను ఎవరితో మాట్లాడినా కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నానని తెలిపారు. ఎందుకంటే వాళ్లు భారతీయ ఏజెంట్స్ అయి ఉండవచ్చని షాహిద్ ఆఫ్రీది పేర్కొన్నట్లు పోస్టు వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సర్కార్ అలర్ట్ కావాలని, పాకిస్తాన్ రోడ్లపై భిక్షాటన చేసుకునే వాళ్లను కూడా అరెస్టు చేసి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అందులో భారతీయ ఏజెంట్లు ఉండే ఛాన్స్ ఉంటుందని… అందుకే బిచ్చగాళ్లను కూడా వదలకండని ప్రభుత్వాన్ని కోరారు షాహిద్ ఆఫ్రీది. దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది. అయితే నిజంగానే షాహిద్ ఆఫ్రీది ఈ సినిమాపై స్పందించాడా ? కావాలని కొంతమంది ప్రచారం చేస్తున్నారా ? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read: Tanveer Ahmed: ఐపీఎల్ జోలికి వెళ్లొద్దు రా..వెంటనే PSL షెడ్యూల్ మార్చండి, లేకపోతే సంకనాకి పోతాం
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==