BigTV English

OTT Movie : ‘స్క్విడ్ గేమ్’ లాంటి రియాలిటీ గేమ్… 2,000 మందితో బీస్ట్ గేమ్స్… మోస్ట్ కాంట్రవర్షియల్ కొరియన్ సిరీస్

OTT Movie : ‘స్క్విడ్ గేమ్’ లాంటి రియాలిటీ గేమ్… 2,000 మందితో బీస్ట్ గేమ్స్… మోస్ట్ కాంట్రవర్షియల్ కొరియన్ సిరీస్

OTT Movie : కొరియన్ డ్రామాలు ఇంట్రెస్టింగ్ కథలతో, యాక్షన్, ఎమోషనల్ డ్రామాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకర్షిస్తాయి. కానీ మీరు ఒక సరికొత్త రియాలిటీ షో ఉండే కొరియన్ సిరీస్ కోసం చూస్తున్నారా? అది భారీ స్కేల్, ఊహించని ఛాలెంజెస్, కల్లో కూడా చూడనంత డబ్బు, బహుమతులతో నిండి ఉంటే ఎలా ఉంటుంది ? అచ్చం అలాంటి వెబ్ సిరీసే ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఈ సిరీస్ ఏ ఓటీటీలో ఉంది? స్టోరీ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…


అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కొరియన్ సిరీస్ యూట్యూబ్ స్టార్ Mr.Beast (జిమ్మీ డొనాల్డ్‌సన్) సృష్టించిన ఒక రియాలిటీ కాంపిటీషన్ ఉండే వెబ్ సిరీస్. 1,000 మంది కంటెస్టెంట్స్‌ 5 మిలియన్ డాలర్ల బహుమతి కోసం పోటీ పడాల్సి ఉంటుంది. ఈ షో కొరియన్ సిరీస్ Squid Game నుండి స్ఫూర్తి పొందినప్పటికీ… దీని భారీ స్కేల్, మిస్టర్ బీస్ట్ యూనిక్ స్టైల్ దీనిని ఒక అద్భుతమైన థ్రిల్లర్ సిరీస్ గా మార్చాయి.


ఈ సిరీస్ పేరు Beast Games. 10 ఎపిసోడ్‌ల ఈ సిరీస్ ను టైలర్ కాన్‌క్లిన్, సీన్ క్లిట్జ్‌నర్, మాక్ హాప్కిన్స్‌తో కలిసి మిస్టర్ బీస్ట్ (జిమ్మీ డొనాల్డ్‌సన్) సృష్టించారు. 2024 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ లో… జిమ్మీ డొనాల్డ్‌సన్ (హోస్ట్), నోలన్ హాన్సెన్, కార్ల్ జాకబ్స్, చాండ్లర్ హాలో నటించారు. ఈ షో 50 మిలియన్ల వ్యూస్‌తో ప్రైమ్ వీడియోలో అత్యధికంగా చూసిన అన్‌స్క్రిప్టెడ్ సిరీస్‌గా నిలిచింది. అలాగే ఈ షోపై కేసు కూడా నమోదైంది.

స్టోరీలోకి వెళ్తే

ఇదొక రియాలిటీ కాంపిటీషన్ షో. ఇందులో 2,000 మంది కంటెస్టెంట్స్ మొదట లాస్ వేగాస్‌లోని అల్లెజియంట్ స్టేడియంలో పోటీ పడతారు. అక్కడ నుండి 1,000 మంది ఎంపికై, టొరంటోలోని డౌన్స్‌వ్యూ పార్క్ స్టూడియోస్‌లో “బీస్ట్ సిటీ”లో ఛాలెంజెస్‌లో పాల్గొంటారు. ఈ షో 5 మిలియన్ డాలర్ల బహుమతి కోసం ఫిజికల్, మెంటల్, సోషల్ ఛాలెంజెస్‌తో నిండి ఉంటుంది. ఇది టీవీ హిస్టరీలో అతిపెద్ద బహుమతి అని చెప్పొచ్చు.

షో మొదటి రౌండ్‌లో 2,000 మంది కంటెస్టెంట్స్ సింపుల్ గేమ్స్ ఆడగా, చివరికి 1,000 మంది సెలెక్ట్ అవుతారు. ఇందులో ఒక ఛాలెంజ్‌లో $1 మిలియన్ డబ్బును షేర్ చేసుకుని స్వచ్ఛందంగా బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ ఫేజ్ లో 243 మంది ఎలిమినేట్ అవుతారు. మిగిలిన ఛాలెంజెస్‌లో బ్లాక్ స్టాకింగ్ గేమ్స్, ట్రివియా, ఫిజికల్ టాస్క్‌లు ఉంటాయి. ఇలా చివరి వరకు ఆడి గెలిచినోడే విన్నర్. మరి ఆ విన్నర్ ఎవరో తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే.

Read Also : 20 ఏళ్ల క్రితం హత్య… ఇంకా వీడని మిస్టరీ… సైకో కిల్లర్ రచ్చ రచ్చ చేసే క్రైమ్ కథ

Related News

OTT Movie : 28 హోటల్స్ ఫాంటసీ… బిజినెస్ మీటింగుకెళ్లి ఇదెక్కడి దిక్కుమాలిన యాపారం? మస్త్ మసాలా సీన్స్

OTT Movie : ప్రతీ రాత్రి ఒకరిని చంపే డెడ్లీ డెత్ గేమ్… కంటికి కన్పించకుండా నరకం చూపించే మాఫియా… ఒక్కో సీన్ కు గూస్బంప్స్

OTT Movie : చంపడానికే ఓటింగ్… చిన్న పిల్ల అని కూడా చూడకుండా దారుణం… చిన్న కథ కాదు భయ్యా

OTT Movie : డేటింగ్ యాప్ పేరుతో అమ్మాయి అరాచకం… తెలియకుండానే సైకో కిల్లర్ ఉచ్చులో… లాస్ట్ లో మతిపోగోట్టే ట్విస్ట్

OTT Movie : తలలు నరికి ఎత్తుకెళ్ళే సీరియల్ కిల్లర్… డెడ్లీ వయొలెన్స్… పోలీసులకే చెమటలు పట్టించే కేసు

Big Stories

×