E-Paper
Advertisement

ఓటీటీలో ఈవారం సందడి చేయనున్న కొత్త కొరియన్ డ్రామాలు

ఓటీటీలో ఈవారం సందడి చేయనున్న కొత్త కొరియన్ డ్రామాలు
Advertisement

Korean series on OTT : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కే డ్రామా మేనియా ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన దేశంలో కూడా కొరియన్ వెబ్ సిరీస్‌లకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ప్రముఖ ఓటీటీ సంస్థలు కూడా వరుసగా కొరియన్ కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి రొమాన్స్, థ్రిల్లర్, హారర్ ఎమోషనల్ డ్రామాలతో కూడిన సరికొత్త సిరీస్‌లు సిద్ధమయ్యాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

1. ది స్కేర్‌క్రో (The Scarecrow)

ఇది ఒక మిస్టరీ హారర్ థ్రిల్లర్. ఒక మారుమూల గ్రామంలో జరిగే వింత సంఘటనల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఊరిలో హఠాత్తుగా మనుషులు మాయమవడం, ఆ ప్రాంతంలోని పొలాల్లో ఉండే దిష్టిబొమ్మలు ప్రాణం పోసుకుని తిరగడం వంటి గగుర్పొడిచే సీన్లు ఇందులో హైలైట్. April 20 నుంచి ఇది వికి (Viki), నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలలో అందుబాటులో ఉంది.

2. సోల్డ్ అవుట్ ఆన్ యూ (Sold Out on You)

Advertisement

ఒక సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమెన్, ఒక మామూలు వ్యక్తి మధ్య జరిగే రొమాంటిక్ కామెడీ డ్రామా ఇది. ప్రేమలో మోసపోయిన హీరోయిన్, తన జీవితాన్ని మళ్ళీ ఎలా గాడిలో పెట్టుకుందనేది ఇందులో సరదాగా చూపిస్తారు. యూత్ కు ఈ సిరీస్ బాగా నచ్చుతుంది. ఇది వికీ (Viki), నెట్ ఫ్లిక్స్ (Netflix)లో April 22 నుండి అందుబాటులో ఉంది.

3. ఇఫ్ విషెస్ కుడ్ కిల్ (If Wishes Could Kill)

ఇదొక డార్క్ ఫాంటసీ థ్రిల్లర్. మనం కోరుకునే కోరికలు నిజమైతే బాగుంటుంది అనుకుంటాం, కానీ ఆ కోరికలే ప్రాణాలు తీసేంత ప్రమాదకరంగా మారితే ఎలా ఉంటుందనేదే ఈ సినిమా ప్లాట్. విభిన్నమైన కథాంశంతో సాగే ఈ డ్రామా ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుంది. April 24 నుంచి ఇది Netflixలో అందుబాటులో ఉంది.

4. ఫైలింగ్ ఫర్ లవ్ (Filing for Love)

Advertisement

ఆఫీస్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రొమాంటిక్ డ్రామా ఇది. ఒకే ఆఫీసులో పనిచేస్తూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునే ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఎలా పుట్టింది అనేది చాలా క్యూట్‌గా చూపించారు ఇందులో. కామెడీ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి ఈ సిరీస్ లో . ఇది April 25 నుంచి Viki ఓటీటీలో అందుబాటులో ఉంటుంది.

5. యూమీస్ సెల్స్ 3 (Yumi’s Cells 3)

కొరియన్ డ్రామా ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సిరీస్ ఇది. యూమీ అనే యువతి మెదడులో ఉండే ‘సెల్స్’ (కణాలు) ఆమె భావోద్వేగాలను ఎలా నియంత్రిస్తాయి అనేది ఇందులో యానిమేషన్ మరియు లైవ్ యాక్షన్ కలయికతో చూపిస్తారు. ఈ మూడవ సీజన్‌లో యూమీ జీవితంలో వచ్చే కొత్త మార్పులు చూడబోతున్నాం. April 20 నుంచి ఇది వికీ (Viki) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

6. పెర్ల్ ఇన్ రెడ్ (Pearl in Red)

ఇది ఒక హిస్టారికల్ పీరియడ్ డ్రామా. పాతకాలపు కొరియా నేపథ్యం, అక్కడి రాజభవనాల్లో జరిగే కుట్రలు, ప్రేమకథలతో ఈ సిరీస్ గ్రాండ్‌గా తెరకెక్కింది. అద్భుతమైన సెట్స్, కాస్ట్యూమ్స్ ఈ డ్రామాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇది హులు (Hulu), నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది

7. వి ఆర్ ఆల్ ట్రయింగ్ హియర్ (We Are All Trying Here)

నేటి యువత ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, కెరీర్ సమస్యలు, రిలేషన్ షిప్స్ గురించి కళ్ళకు కట్టినట్లు చూపించే స్లైస్ ఆఫ్ లైఫ్ డ్రామా ఇది. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో సాధించడానికి పడే తపనను ఇందులో ఎమోషనల్ గా చూపించారు.
దీనిని నెట్‌ఫ్లిక్స్ లో చూడవచ్చు.

Read Also : థియేటర్లలో చరిత్ర సృష్టించిన సైన్స్ ఫిక్షన్ సినిమాలు… వీటిలో మీరెన్ని చూసారు ?

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×