E-Paper
Advertisement

ఎర్ర దారం కడితే పరీక్షల్లో పాస్… కానీ ప్రాణాలు మాత్రం గాల్లో

ఎర్ర దారం కడితే పరీక్షల్లో పాస్… కానీ ప్రాణాలు మాత్రం గాల్లో
Advertisement

Horror Thriller Movie OTT : దెయ్యం సినిమాలకు ఓటీటీలో క్రేజ్ ఎక్కువే. వీటిని థియేటర్లలో కంటే ఇంట్లోనే చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆడియన్స్. ఇప్పుడు మనం ఒక థాయ్ హారర్ సినిమా గురించే చెప్పుకోబోతున్నాం. ఇది మన ఊర్లో చెప్పుకునే దెయ్యం కథలకి అల్ట్రా మోడ్రన్ వెర్షన్ లాంటి సినిమా. సిటీ నడిబొడ్డున ఉన్న ఒక కోచింగ్ సెంటర్ లో దెయ్యంతో పది మంది స్టూడెంట్స్ గ్యాంగ్ చేసే రచ్చ, ఆ తర్వాత ఆ దెయ్యం వీళ్ళని ఎలా ఆటాడుకుందనేదే ఈ మూవీ. ఇది కేవలం దెయ్యం సినిమా మాత్రమే కాదు, ఒక మంచి టీనేజ్ డ్రామా కూడా.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ థాయ్ టీనేజ్ హారర్ సినిమా పేరు ‘సియామ్ స్క్వేర్’ (Siam Square). పైరాచ్ ఖుమ్వాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐసయా హోసువాన్, ప్లోయ్ సోర్నారిన్, థానబోర్డీ జైయెన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2017 మార్చి 30న థాయ్‌ థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమా షూటింగ్ అంతా బ్యాంకాక్‌లో అత్యంత రద్దీగా ఉండే సియామ్ స్క్వేర్ ప్రాంతంలోనే జరిగింది. ఆ ఏరియా పగటిపూట స్టూడెంట్స్‌తో కళకళలాడుతుంటే, రాత్రిపూట మాత్రం చాలా నిశ్శబ్దంగా, భయంకరంగా ఉంటుంది. దర్శకుడు ఆ వాతావరణాన్ని వాడుకుని, అక్కడ నిజంగానే ఏదో దెయ్యం ఉందనే ఫీలింగ్‌ని ప్రేక్షకుల్లో కలిగించడంలో సక్సెస్ అయ్యాడు. అందుకే థాయ్‌లాండ్‌లో ఈ సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో నటించిన ప్లోయ్ సోర్నారిన్ తన నటనకు గానూ థాయ్‌లాండ్ ఆస్కార్‌గా పిలవబడే ‘సుపన్నహాంగ్’ అవార్డును కూడా గెలుచుకుంది. ప్రస్తుతం ఇది Mubi, Prime Videoలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

బ్యాంకాక్‌లో సియామ్ స్క్వేర్ అనే ఒక పెద్ద ఏరియా ఉంటుంది. అక్కడ ఫుల్లుగా కోచింగ్ సెంటర్లు ఉంటాయి. అయితే అక్కడ ఒక పాత కథ ప్రచారంలో ఉంటుంది. ఎగ్జామ్స్‌లో పాస్ అవ్వాలంటే ఒక పాత కుర్చీకి ఎర్రటి దారం కట్టాలని, అలా చేస్తే అక్కడ చనిపోయిన ఒక అమ్మాయి దెయ్యం హెల్ప్ చేస్తుందని నమ్ముతారు. దీంతో కొంతమంది ఫ్రెండ్స్ గ్యాంగ్ గా కలిసి ఏం జరుగుతుందో చూద్దామని ఆ పాడుబడ్డ సెంటర్లోకి దూరి ఎర్రటి దారం కడతారు. ఆ టైమ్‌లో కరెంట్ పోయి, ఆత్మ బయటికి వస్తుంది.

ఆ తర్వాతే అసలు సీన్ మొదలవుతుంది. ఆ దెయ్యం ఒక్కొక్కడి చేతికి ఎర్రటి దారం కట్టేసి, ఇక నీ పని అయిపోయిందన్నట్లు మార్క్ పెడుతుంది. ఆ గ్యాంగ్‌లోని ఒక్కొక్కరిని ఆ దెయ్యం టార్గెట్ చేసి వేటాడుతుంటే, వాళ్లకి ప్రాణాలు అరచేతిలోకి వస్తాయి. అసలు ఆ అమ్మాయి దెయ్యం ఎందుకు అయ్యింది? దానికి ఆ కోచింగ్ సెంటర్‌కి ఉన్న లింక్ ఏంటి? ఆ దెయ్యం నుండి వీళ్ళు తప్పించుకున్నారా ? చివరకు ఎవరు మిగిలారు? అనే విషయాలతో ఈ క్లైమాక్స్ ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటుంది.

Advertisement

Read Also : బుర్ర హీటెక్కించే థ్రిల్లర్ సినిమాలు… వీటి క్లైమాక్స్ మీ ఊహకు కూడా అందదు

Tags

Related News

3024 కోట్లు కొల్లగొట్టిన హర్రర్ థ్రిల్లర్… ఓటీటీలోకి తెలుగులో వచ్చేసిన వణికించే వైరల్ హిట్

అండర్‌వరల్డ్‌ని షేక్ చేసిన గ్యాంగ్‌స్టర్ కథ… సీట్-ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కన్నడ యాక్షన్ ధమాకా

26 మంది పిల్లలు మిస్సింగ్… ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్

మనుషుల నిజస్వరూపాలను కళ్లకు కట్టే కథ… హృదయాలను తాకే డాక్యుమెంటరీ స్టైల్ ఎమోషనల్ ఫిల్మ్

క్షణం కూడా కన్ను మూయనివ్వని ఫైట్లు… ఓటీటీలో సందడి చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా

అడవిలో చిక్కుకున్న పైలట్ సాహసం… నవ్వులతో పాటు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ట్రీట్

వీరభద్రుని రహస్యం’ క్లైమాక్స్ ప్రశ్నలకు సమాధానం… ఒళ్ళు గగుర్పొడిచే మలుపులతో వస్తున్న మైండ్ బెండింగ్ థ్రిల్లర్

నెత్తురు ఏరులై పారించే ఊరమాస్ రివేంజ్ డ్రామా… లోకేష్ కనగరాజ్ 100 కోట్ల యాక్షన్ థ్రిల్లర్ తెలుగులోనే స్ట్రీమింగ్

Big Stories

Advertisement
×