E-Paper
Advertisement

చిన్న కిచెన్‌ను పెద్దదిలా చూపించే సింపుల్ ట్రిక్స్!

చిన్న కిచెన్‌ను పెద్దదిలా చూపించే సింపుల్ ట్రిక్స్!
Advertisement

Smart Kitchen Tips:సొంతిళ్లలో అయితే కిచెన్‌ని మనకు నచ్చినట్టుగా డిజైన్ చేయించుకుంటాం. ఎక్కడ ఎంత స్పేస్ కావాలో, ఎక్కడ ఏం పెట్టుకోవాలో ముందే డిసైడ్ అయిపోతాం. కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు.కానీ చాలా ఇళ్లల్లో కిచెన్ పెద్దగా ఉండదు. ముఖ్యంగా చిన్న ఇళ్లల్లో, అపార్ట్మెంట్లలో కిచెన్ చాలా చిన్నగా ఉంటుంది. దీంతో వంట చేసేటప్పుడు ఇబ్బందిగా అనిపించడం కామన్.అయితే, ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే కిచెన్ చిన్నదైనా దాన్ని పెద్దదిగా కనిపించేలా సెట్ చేసుకోవచ్చు. అంతేకాదు, వంట చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది.మరి ఆ చిన్న చిన్న టిప్స్ ఏంటో ఒకసారి చూద్దాం.

 అవసరం లేని వస్తువులు తొలగించండి

అన్నిటికన్నా ముందుగా మీరు చేయాల్సింది… ఎక్కడపడితే అక్కడ అవసరం లేకుండా పడి ఉన్న వస్తువులన్నీ తొలగించేయడం.ఎన్నో ఏళ్లుగా ముట్టకుండా ఉన్న డబ్బాలు, వాడని వస్తువులు, పాతబడిపోయిన పాత్రలు, చెడిపోయిన గిన్నెలు, పేరుకుపోయిన బాటిళ్లు… ఇలా అవసరం లేని వాటిని బయటకు తీసేయండి.మనకు తెలియనిది ఏంటంటే… వీటి వల్లే కిచెన్‌లో సగం స్థలం కబ్జా అయిపోతుంది. నిజంగా మనం వాడే, మనకు ఉపయోగపడే వస్తువులు మాత్రమే కిచెన్‌లో ఉంచితే అది క్రియేట్ చేసే స్పేస్ అంతా ఇంతా కాదు.

చిన్న సామాగ్రిని గోడలకు వేలాడదీయండి

Advertisement

స్పూన్లు, చెంచాలు, కత్తులు, గరిటెలు వంటి చిన్న చిన్న సామాగ్రిని స్లాబ్‌పై పడేయకుండా గోడలపై ఉన్న ర్యాక్స్‌కు వేలాడదీయండి.ఇలా చేస్తే ఖాళీ స్థలం పెరుగుతుంది. అలాగే వంట చేసేటప్పుడు అవసరమైన వస్తువు వెంటనే దొరుకుతుంది.

 రోజూ వాడే వస్తువులు ఒకే చోట పెట్టండి

మసాలా డబ్బాలు, నూనె సీసాలు, పప్పు డబ్బాలు… ఇలా రోజూ ఉపయోగించే వస్తువులన్నింటినీ ఒకే చోట అందంగా అమర్చుకోండి.ఎలా పడితే అలా పెడితే కిచెన్ గందరగోళంగా కనిపించడమే కాకుండా చిన్నదిగా కూడా అనిపిస్తుంది.ట్రేలు లేదా చిన్న చిన్న ఆర్గనైజర్లను ఉపయోగిస్తే మరింత స్థలం ఆదా అవుతుంది.

 లేత రంగులు ఎంచుకోండి

Advertisement

కిచెన్‌లో తెలుపు, క్రీమ్, లైట్ గ్రే లేదా లైట్ బేజ్ వంటి లేత రంగులు ఎంచుకోవడం మంచిది.ఈ రంగులు కిచెన్‌ని పెద్దదిగా కనిపించేలా చేస్తాయి. ముదురు రంగులు మాత్రం చిన్న స్థలాన్ని మరింత చిన్నగా కనిపించేలా చేస్తాయి.

 సరిపడా లైటింగ్ ఉండాలి

కిచెన్‌లో సరిపడా వెలుతురు ఉండేలా చూసుకోవాలి.బయట నుంచి నేచురల్ లైట్ వస్తే చాలా మంచిది. అలా కాకపోతే మంచి వెలుగునిచ్చే ఎల్ఈడీ లైట్లు ఉపయోగించండి.ఎంత ఎక్కువ వెలుతురు ఉంటే కిచెన్ అంత విశాలంగా కనిపిస్తుంది.

స్లాబ్‌ను ఖాళీగా ఉంచండి

ఫ్రిడ్జ్‌పై, కిచెన్ స్లాబ్‌పై వస్తువులు పెట్టకండి.చాలా ఇళ్లల్లో ప్లాస్టిక్ డబ్బాలు, కవర్లు, ఖాళీ బాటిళ్లు అన్నీ స్లాబ్‌పైనే ఉంచేస్తారు. దీంతో కిచెన్ చిన్నగా కనిపిస్తుంది.కాబట్టి స్లాబ్‌ను వీలైనంత వరకు ఖాళీగా ఉంచండి.

 ట్రాన్స్‌పరెంట్ డబ్బాలు వాడండి

ట్రాన్స్‌పరెంట్ డబ్బాలు వాడితే చూడటానికి బాగుండటమే కాకుండా బియ్యం, పప్పులు, చక్కెర, టీ పొడి… ఇలా ఏది ఎంత క్వాంటిటీ ఉందో వెంటనే తెలిసిపోతుంది.

మల్టీపర్పస్ ఫర్నిచర్ ఉపయోగించండి

చిన్న కిచెన్‌లో మల్టీపర్పస్ ఫర్నిచర్ ఉంటే ఇంకా బాగుంటుంది.ఉదాహరణకు మడత పెట్టుకునే స్టూల్ వాడితే అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించి, తర్వాత మడతపెట్టి పెట్టేయొచ్చు. దీంతో స్థలం ఆదా అవుతుంది.

క్యాబినెట్ స్పేస్‌ను పూర్తిగా ఉపయోగించండి

క్యాబినెట్‌లలో ఉండే ఖాళీ స్థలాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి.ప్లేట్ స్టాండ్లు, షెల్ఫ్ ఆర్గనైజర్లు, డ్రాయర్ డివైడర్లు వాడితే ఒకే క్యాబినెట్‌లో ఎక్కువ వస్తువులు సర్దుకోవచ్చు.

 ప్రతిరోజూ శుభ్రంగా ఉంచండి

కిచెన్‌ని ప్రతిరోజూ నీట్‌గా ఉంచే అలవాటు చేసుకోండి.గ్యాస్ స్టవ్, స్లాబ్, సింక్ శుభ్రంగా ఉంటే వంటగది ఎప్పుడూ ఫ్రెష్‌గా కనిపిస్తుంది.చిన్న కిచెన్ అయినా నీట్‌గా ఉంటే మరింత అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది.

చిన్న డెకరేషన్ సరిపోతుంది

కిచెన్‌లో ఒక చిన్న ఇండోర్ మొక్క లేదా చిన్న షోపీస్ పెట్టినా కిచెన్‌కు వచ్చే లుక్ పూర్తిగా మారిపోతుంది.అలా అని ఎక్కువ గజిబిజిగా పెట్టేయకండి. అవి మళ్లీ స్థలాన్ని ఎక్కువగా ఆక్రమిస్తాయి.

వారానికి ఒకసారి పూర్తిగా చెక్ చేయండి

అన్నిటికన్నా ముఖ్యంగా వారానికి ఒకసారి అయినా కిచెన్ మొత్తాన్ని చెక్ చేయండి.ఏవైనా అవసరం లేని వస్తువులు ఉంటే వెంటనే తీసేయండి. వాడే వస్తువులు మాత్రమే కిచెన్‌లో లేదా అందుబాటులో ఉండే చోట ఉంచుకోండి.

ఇలా చేస్తే కిచెన్ ఎప్పుడూ చక్కగా, నీట్‌గా ఉంటుంది.

సో… కిచెన్ చిన్నగా ఉందని బాధపడకండి. సరైన ప్లానింగ్, కొద్దిపాటి క్లీనింగ్, అన్నింటికీ మించి వస్తువులను సరైన విధంగా సెట్ చేసుకుంటే అదే కిచెన్ పెద్దదిగా, అందంగా కనిపిస్తుంది.ఈ చిన్న చిన్న మార్పులే మీ వంటగదికి చాలా పెద్ద మార్పును తీసుకొస్తాయి.

also read :టీవీని పక్కన పెట్టేసిన జెన్‌జీ.. అంతా ఓటీటీ మాయే!

సో… ఈ టిప్స్ పాటించి మీ బుల్లి కిచెన్‌ని పెద్దదిగా చేసుకుంటారు కదా!

Tags

Related News

టీవీని పక్కన పెట్టేసిన జెన్‌జీ.. అంతా ఓటీటీ మాయే!

భార్యాభర్తల మధ్య దూరం అక్రమ సంబంధాలకు దారితీస్తుందా?

హైబ్రిడ్ ఫిట్‌నెస్ అంటే ఏంటి? స్టామినా, బలం రెండూ పెంచే కొత్త వర్కౌట్స్

ప్రేమలో మూడో వ్యక్తి జోక్యాన్ని సహించరు.. ఈ తేదీల్లో పుట్టినవారు చాలా పొసిసివ్

కిచెన్‌లో మీరు చేసే ఈ 9 తప్పుల వల్లే వర్షాకాలంలో ఆరోగ్య సమస్యలు..

పిల్లలు బొటనవేలు ఎందుకు చీకు తుంటారు? ఈ అలవాటు మాన్పించేందుకు ఈజీ టిప్స్ hi

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

Big Stories

Advertisement
×