E-Paper
Advertisement

కారు వద్దు బాబోయ్.. ముందు నా చలాన్లు కట్టండి! దర్శకుడు బాబు కామెంట్స్ వైరల్

కారు వద్దు బాబోయ్.. ముందు నా చలాన్లు కట్టండి! దర్శకుడు బాబు కామెంట్స్ వైరల్
Advertisement

Least Eligible Bachelor Success:బాబు డేగల దర్శకత్వంలో హర్ష చెముడు మెయిన్ లీడ్ గా వచ్చిన లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అటు ఈటీవీ విన్ లో, ఇటు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతూ మంచి టాక్ మూటగట్టుకుంది.ఇక ఈ సందర్భంగా థాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు మేకర్స్. ఇక ఇందులో డైరెక్టర్ బాబు ,వైవా హర్ష ల మధ్య జరిగిన బైక్ కామెడీ అక్కడ నవ్వులు పూయించింది.

విషయంలోకి వెళ్తే బాబు మాట్లాడుతూ మా ఫ్రెండ్స్ అంతా ఈ సిరీస్ గురించి ఇంస్టా లో ఎక్కడ చూసినా తెగ మీమ్స్ రన్ అవుతున్నాయి ఏంటి సంగతి,ఎంతిచ్చావు అంటున్నారు ,అసలు వాళ్ళకి ఇచ్చేందుకు నా దగ్గర డబ్బులే లేవు,ఆ సంగతి మీకు కూడా తెలుసు అని అసలు విషయం చెప్పాడు.

Advertisement

ఇక సిరీస్ చూసిన వారంతా చాలా బాగుందని మెచ్చుకుంటూ వరుసగా మెసేజెస్ పెడుతున్నారు.పని వత్తిడి వల్ల ఆ మెసేజెస్ కి రిప్లయ్ ఇవ్వలేకపోతున్నారు, తీరిగ్గా అందరికి ఒక పది రోజుల తర్వాత రిప్లయ్ ఇస్తాను దయచేసి అర్థం చేసుకోగలరు అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక వైవా హర్శతో మాట్లాడుతూ మాములుగా సినిమా ఏదైనా హిట్ అయితే కార్ ఎదో గిఫ్ట్ ఇస్తారంటా,కాని కార్ డ్రైవింగ్ ఎలాగూరాదు కనీసం బైక్ అయినా గిఫ్ట్ గా ఇప్పించు అన్నా ..అదీ కుదరకపోతే ఏదైనా పాత బైక్ గిఫ్ట్ గా ఇచ్చినా పర్లేదు అంటూ చెప్పుకొచ్చాడు.దీంతో హర్ష రియాక్ట్ అవుతూ నువ్ ఏ బైక్ కావాలో సేల్కేట్ చేసుకో అది ktm అయినా ఏ బైక్ అయినా సరే నేను ఇప్పిస్తాను అని అన్నాడు.దానికి బాబు ktm అని వినడానికి బాగుందన్నా,ఆ బైక్ ఇప్పించు పోనీ అదీ కుదరకపోతే నా బైక్ కి చలాన్లు అయినా నేను హ్యాపీగా ఫీల్ అవుతా అంటూ నవ్వులు పూయించాడు.

Advertisement

సిటీలో బైక్ నడుపుతుంటే ఎక్కడ పోలీసులు కనిపించినా బండి ఆపుతారేమో అని బయపడేవాడిని అని,కాని ఇపుడు లీస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ డైరెక్టర్ అని చెప్పుకోవడానికి ఒక గుర్తింపు ఉందని, పట్టుబడితే ఆ విషయమే చెప్పి ఎవరినో ఒకరిని అడిగి కడతానని కామెడీ గా చెప్పుకొచ్చాడు.

ఇక ఈ సినిమా సక్సెస్ నా ఒక్కడిది కాదని, ఆ విషయం మీక్కూడా తెలుసనీ, సినిమాకి కష్టపడి పని చేసిన ఆఫీసు బాయ్ నుండి డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ వరకు అందరిది ఈ సక్సెస్ అని,అలాగే మాకోసం ఈ సిరీస్ ని మూడు గంటల పాటు ఓపికగా చూసి ఎంకరేజ్ చేసిన ఆడియన్స్ కూడా అని చెప్పుకొచ్చాడు బాబు

ఇక హర్ష మాట్లాడుతూ నీకు నచ్చిన బైక్ గురించి నాకు చెప్పు,దసరా లోపల అది నీకు వచ్చేట్టు చేస్తానని చెప్పడం విశేషం. మొత్తంగా బాబు ,హర్షాల మధ్యన జరిగిన ఈ బైక్ కామెడీ ఆడిటోరియం లో నవ్వులు పూయించింది.చూడాలి మరి చెప్పినట్టుగా హర్ష నిజంగానే బైక్ కొనిస్తాడో లేదో !

ALSO READ :నవరాత్రి స్పెషల్.. అమ్మవారిలా మారిపోయిన కృతి కర్బందా!

Tags

Related News

నవరాత్రి స్పెషల్.. అమ్మవారిలా మారిపోయిన కృతి కర్బందా!

భార్యతో గొడవలకు కారణం అదేనా? హర్ష చెముడు ఓపెన్ కామెంట్స్!

సుమతిగా సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్.. కల్కి 2 షూటింగ్ పై బిగ్ అప్డేట్!

నితిన్ రుక్మిణిగా బాలీవుడ్ బ్యూటీ ఆఫియా సయ్యద్… ఆమె పాత్ర ఇదేనా?

రాజాసాబ్ డిజాస్టర్‌పై తొలిసారి నోరు విప్పిన నిర్మాత.. ఏమన్నాడో తెలుసా?

ఆ సైజులు పెంచుతూ ఫోటోలు మార్ఫింగ్…AI ఫోటోల పై శ్రియ ఫైర్

కార్తికేయ ‘పర్ణశాల’ నుంచి జిమ్ జిమ్ తారా.. పాట అదిరిందిగా!

Big Stories

Advertisement
×