Fake Lecturer Scam: టెన్త్ సర్టిఫికెట్ లేకుండా జూనియర్ లెక్చరర్.. అనుమతి లేని యూనివర్శిటీల నుంచి ఫేక్ సర్టిఫికెట్లు.. చదివిన డిగ్రీకి చెప్పే చదువుకు సంబంధం లేదు. అయినా గత ప్రభుత్వ పెద్దల మద్దతుతో JLగా కొనసాగాడు ఓ వ్యక్తి..
తెలంగాణ ఉన్నత విద్యలో అతిపెద్ద స్కామ్ ఇది. BRS హయాంలో జరిగిన ఈ కుంభకోణంపై BIG TV చేస్తున్న ఇన్వెస్టిగేషన్‌లో నివ్వెరపోయే నిజాలు బయట పడుతున్నాయి. BIG TV ఎఫెక్ట్‌తో ఇప్పటికే 35 మంది ఉద్యోగాలు ఊడాయి. ఇంకో 10 మందికి నోటీసులు ఇచ్చారు. నోటీసులు తీసుకున్నవారిలో ఖలీల్ అన్సారీ స్వచ్ఛందంగా రాజీనామా చేసి వెళ్లారు. అంటే మొత్తం 36 మందిపై వేటు పడింది. ఇంకా 1,000 మంది ఉన్నారని అధికారులే చెప్తున్నారు. కోర్టు తీర్పులు, UGC నిబంధనలకు వ్యతిరేకంగా పీజీలు ఉన్నవాళ్లు 638 మంది ఉన్నట్టు అధికారిక లెక్కలే చెప్తున్నాయి. వీళ్లందరిపైనా చర్యలు తీసుకోవాలని BIG TV కోరుతోంది.
Also read: సీఎం చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ.. ఈ అంశాలపై కీలక చర్చ!
పొలిటికల్ ఇన్‌ఫ్లుయెన్స్ ఉన్నవాళ్లకి, లంచాలు ఇచ్చినవారికి పోస్టులు ఇస్తే ఎలా? కష్టపడి చదివిన నిరుద్యోగులు ఏం కావాలి? ఈ నకిలీ లెక్చరర్లు చదువులు చెప్తే.. విద్యార్ధుల భవిష్యత్ ఏం కావాలి? ఈ ప్రశ్నలకు విద్యాశాఖ ఉన్నతాధికారులు సమాధానం చెప్పాలి. అసలు 2023లో రెగ్యులర్ చేసిన మొత్తం పోస్టులపై రీ-వెరిఫికేషన్ జరగాలి. ఇదంతా జరిగే వరకు BIGTV వదిలిపెట్టదు. మరోసారి ఇలాంటి స్కామ్ జరగకూడదని BIG TV పోరాటం కొనసాగిస్తోంది.