E-Paper
Advertisement

ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేయకండి.. ఫేక్ వీడియోలపై ఎంపీ చామల ఫైర్!

ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేయకండి.. ఫేక్ వీడియోలపై ఎంపీ చామల ఫైర్!
Advertisement

Rahul Gandhi: లోక్ సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపడుతున్న కార్యక్రమాలు ,యాత్రలకు ప్రజల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందనను చూసి బీజేపీ ఓర్వలేకపోతుందని అందుకే ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎంపీ చామల కిరణ్​ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడారు.

ఫేక్ ప్రచారం..

రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రలకు దేశవ్యాప్తంగా సామాన్య ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని జ్ఞానేశ్ కుమార్ ఏ విధంగా దుర్వినియోగం చేశారో రాహుల్ గాంధీ ప్రజల ముందు స్పష్టంగా ఎత్తిచూపారని ఎంపీ గుర్తుచేశారు. రాహుల్ గాంధీకి వస్తున్న ప్రజాదరణను చూసి బీజేపీ జీర్ణించుకోలేకపోతోందని, అందుకే ఇలాంటి అసత్య ప్రచారాలకు తెరలేపుతోందని మండిపడ్డారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను రాహుల్ గాంధీ సెక్యూరిటీ సిబ్బంది తోసేశారంటూ బీజేపీ వర్గాలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమైనదని చామల కొట్టి పారేశారు.

తప్పుడు వీడియోలు..

Advertisement

ఈ యాత్రలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ‘ఇండియా’ కూటమి ముఖ్య నేతలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని తెలిపారు. సాధారణ కార్యకర్తలతో కలిసి నడవాలని రాహుల్ గాంధీ ఎప్పుడూ భావిస్తుంటారని, అయితే ఎస్పీజీ, భద్రతా సిబ్బందికి మాత్రం ఆయన భద్రత, ప్రొటోకాల్‌తో కూడిన నిబంధనలు ముఖ్యమని స్పష్టం చేశారు. దీన్ని వక్రీకరించి తప్పుడు వీడియోలతో తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ విమర్శించారు. కర్ణాటక బీజేపీ శాఖతో పాటు జాతీయ స్థాయిలో బీజేపీ సోషల్ మీడియా విభాగాలు చేస్తున్న దిగజారుడు రాజకీయాలను తక్షణమే మానుకోవాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.

Also read: నీతులు చెబుతారు కానీ, పాకిస్తాన్ వెధవలందరూ డ్ర‌గ్స్ తీసుకుంటారు!

Tags

Related News

పేద రైతు ప్రాణాలు బలిగొన్న భూ కబ్జా దందా.. హుజూరాబాద్‌లో సర్పంచ్ భర్త అరాచకాలు!

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా గంజాయి పట్టివేత.. ఎలా దోరికాడో తెలుసా..?

రిమ్స్ ప్రమాదంపై కేటీఆర్ ఫైర్.. ఆసుపత్రి ఘటన వెనుక ఉన్న నిజాలు ఇవే!

ఉప్పల్ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ టీ20 మ్యాచ్.. బ్లాక్‌లో టికెట్ల విక్రయం.. నలుగురు అరెస్ట్!

రైతు మెడకు ఊరేసేందుకేనా ఈ కుట్ర.. జీవో 17 జారీ పై హరీష్ రావు ఫైర్!

ప్రభుత్వం గుడ్ న్యూస్.. మీ సేవ సర్టిఫికెట్లు ఇక మరింత పటిష్టం.. చినగవు, తడిచినా చెక్కుచెదరవు!

బిగ్ బ్రేకింగ్.. అక్టోబర్ 15 నుంచి ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు!

Big Stories

Advertisement
×