Superhero Movie: సిటీని కాపాడిన హీరోనే ఒక్కసారిగా విలన్‌గా ముద్ర వేస్తే ఎలా ఉంటుంది? ఓ భారీ యుద్ధం తర్వాత నగరం ధ్వంసమై, వందలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో ఆ నేరం మొత్తం అతడి మీద పడుతుంది. పవర్స్ పోయి, పేరు పోయి, పోలీసులకు దొరకకుండా మూడేళ్లు అజ్ఞాతంలో ఉన్న ఆ హీరో తిరిగి వస్తే పరిస్థితులు ఎలా మారతాయి? ఇదే కాన్సెప్ట్‌తో సూపర్ హీరో యాక్షన్, సైన్స్ ఫిక్షన్, ఫ్యామిలీ ఎమోషన్ కలిపి తెరకెక్కిన సినిమా ‘Legend of the White Dragon’. పవర్ రేంజర్స్ ఫేమ్ జేసన్ డేవిడ్ ఫ్రాంక్ నటించిన ఈ సినిమాలో ఆయన చివరి ఫిల్మ్ పెర్ఫార్మెన్స్ చూడొచ్చు. ఆగస్టు 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సెప్టెంబర్ 22 నుంచి డిజిటల్ రిలీజ్‌లోకి వచ్చింది. మరి వైట్ డ్రాగన్ మీద పడిన నింద ఏంటి? తన పేరు ఎలా క్లీన్ చేసుకున్నాడు? అతడిని టార్గెట్ చేస్తున్న కొత్త విలన్ ఎవరు? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి.
ఆరోన్ షోయెంకే, సీన్ షోయెంకే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జేసన్ డేవిడ్ ఫ్రాంక్‌తో పాటు ఆరోన్ షోయెంకే, జేసన్ ఫాంట్, రాచెల్ బ్రూక్ స్మిత్, మైఖేల్ మాడ్సెన్, డేవిడ్ రామ్‌సే, మార్క్ డాకాస్కోస్, ఆండ్రూ ‘కింగ్ బాచ్’ బాచిలర్ తదితరులు నటించారు. సినిమా నిడివి 97 నిమిషాలు. ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ R-rated సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ. ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ లేదు. సెప్టెంబర్ 22నుంచి డిజిటల్ YouTube, Google Play, Prime Video లలో రెంట్ కి అందుబాటులో ఉంది .
Read Also: పాపులర్ ఇన్‌ఫ్లుయెన్సర్ల గ్లామర్ లైఫ్ వెనకున్న సీక్రెట్… సోషల్ మీడియా ఫాలోవర్స్ డోంట్ మిస్