E-Paper
Advertisement

‘సర్’ ప్రక్రియ హాస్యాస్పదం.. ఈసీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు.. కాంగ్రెస్‌ వైఖరిపై ధ్వజం!

‘సర్’ ప్రక్రియ హాస్యాస్పదం.. ఈసీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు.. కాంగ్రెస్‌ వైఖరిపై ధ్వజం!
Advertisement

Telangana Voter Revision: కేంద్ర ఎన్నికల సంఘం సర్ ప్రక్రియను హాస్యాస్పదంగా నిర్వహిస్తోందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. బీఆర్కే భవన్ లో మంగళవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు ఎల్ రమణ, దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పార్టీ నేత సుమిత్రానంద్ మాట్లాడుతూ ఫైనల్ ఎలెక్టోరల్ లిస్ట్ రాకముందే గ్రాడ్యుయేట్ ఓటర్ గా నమోదు చేసుకోమని కేంద్ర ఎన్నికల సంఘం చెప్తోందన్నారు. దీంతో గందరగోళం ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

మరోవైపు గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు తేదీని నవంబర్ 6 నుంచి మరో రెండు వారాలు వాయిదా వేయాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. ’43 లక్షల ఓట్లపై కత్తి పేరిట వార్తలు వస్తున్నాయి. పారదర్శకంగా సర్ ప్రక్రియ సాగడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటరు సవరణపై చిత్తశుద్ధి లేదు’ అని ఆరోపించారు. 90 లక్షల మందికి నోటీసులు ఇచ్చినా అధికార పార్టీ నుంచి సరైన స్పందన లేదన్నారు. అందులో 36 లక్షల ఓట్లు పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అంటే ఇవి దొంగ ఓట్ల అనేది ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

Also Read: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. రంగంలోకి సీఎం రేవంత్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ!

Advertisement

రాష్ట్రంలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెక్నికల్ మిస్టేక్స్ సరి చేయాలని కోరారు. చనిపోయిన, మిస్ అయిన వారి ఓటర్ల పేర్లు రాజకీయ పార్టీలకు తెలియజేయాలన్నారు. సర్ ప్రక్రియ సజావుగా జరిపించాలని కోరారు. అర్హులైన ప్రతీ ఒక్కరు ఓటర్ల జాబితాలో ఉండాలని బీఆర్ఎస్ పోరాడుతోందన్నారు. ఏ ఎన్నికకైనా ఓటు ప్రాధాన్యత అంతే ఉంటుందని, తాము లేవనెత్తిన అభ్యంతరాల పై సీఈఓ సానూకూలంగా స్పందించారన్నారు.

Also Read: ఐఫోన్ యూజర్లకు కీలక అప్‌డేట్.. భారత్‌లోకి Apple Pay ఎంట్రీ, మరి UPI సంగతేంటి?

Tags

Related News

ఎమ్మెల్సీ ఎన్నికలకు కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా..?

ఏసీబీకి చిక్కిన మంచిర్యాల గ్రామ పరిపాలనా అధికారి!

ప్రభుత్వ వైద్యం దయనీయం.. చిన్నారుల చావుల్లోనూ నిర్లక్ష్యమా?.. కవిత తీవ్ర ఆగ్రహం!

నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ పాపాల పుట్ట బద్దలు.. ఏసీబీ దాడుల్లో సంచలనాలు!

ఇలా ఉన్నారేంట్రా.. ట్రాక్టర్‌ని విప్పేసి ఇంజన్ ఎత్తుకెళ్లిన దొంగలు.. ఎక్కడో తెలుసా..?

హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. రంగంలోకి సీఎం రేవంత్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ!

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్!

Big Stories

Advertisement
×