E-Paper
Advertisement

విమానం కూలిన తర్వాత మొదలైన వేట… తెలుగులో ఉన్న ఈ సర్వైవల్ థ్రిల్లర్ మిస్ కావద్దు

విమానం కూలిన తర్వాత మొదలైన వేట… తెలుగులో ఉన్న ఈ సర్వైవల్ థ్రిల్లర్ మిస్ కావద్దు
Advertisement

Survival Thriller on OTT: ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా కూలిపోయింది. చుట్టూ చూస్తే మనుషులెవరూ కనిపించరు. ఎటు చూసినా మంచే… గడ్డకట్టించే చలి. ప్రమాదం నుంచి బయటపడిన కొద్దిమంది కార్మికులు కనీసం ప్రాణాలతో బయటపడ్డామనే ఊపిరి పీల్చుకునేలోపే మరో షాక్ ఎదురవుతుంది. వాళ్లు ఉన్న ప్రాంతం సాధారణ అడవి కాదు… ఆకలితో ఉన్న తోడేళ్ల గుంపు పరిధి. అక్కడి నుంచి ఎంత దూరం వెళ్లినా అవి వెంటాడుతూనే ఉంటాయి. చలి, ఆకలి, గాయాలతో పోరాడుతూ ఒక్కొక్కరుగా సహచరులను కోల్పోయే ఓ వ్యక్తి చివరి వరకు ఎలా నిలబడ్డాడనేదే ‘ది గ్రే’ (The Grey) కథ. మరి ఈ సర్వైవల్ థ్రిల్లర్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? తెలుగులో ఉందా ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

అలాస్కాలోని ఓ ఆయిల్ రిగ్‌లో జాన్ ఓట్వే పని చేస్తుంటాడు. కార్మికులపై దాడి చేసే తోడేళ్లను వేటాడటం అతని పని. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఓట్వే తీవ్ర విషాదంలో ఉంటాడు. భార్యను కోల్పోయిన తర్వాత జీవితంపై ఆసక్తి తగ్గిపోతుంది. చివరకు తన జీవితాన్ని కూడా ముగించుకోవాలని నిర్ణయించుకున్నా… చివరి క్షణంలో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటాడు. ఆ తర్వాత కొంతమంది కార్మికులతో కలిసి ఓట్వే విమానంలో బయలుదేరుతాడు. మార్గమధ్యలో భారీ మంచు తుఫాను రావడంతో విమానం అదుపు తప్పి మంచుతో నిండిన అడవిలో కూలిపోతుంది.

Advertisement

చాలామంది అక్కడికక్కడే చనిపోగా, ఓట్వేతో పాటు కొద్దిమంది మాత్రమే ప్రాణాలతో బయటపడతారు. విమాన శిథిలాల దగ్గరే ఉంటే రక్షణ బృందాలు వస్తాయని మొదట అనుకుంటారు. కానీ రాత్రి పడగానే ఓ వ్యక్తిపై తోడేళ్లు దాడి చేయడంతో అసలు ప్రమాదం తెలుస్తుంది. తాము ఆ తోడేళ్ల వేట పరిధిలో చిక్కుకున్నామని ఓట్వే గుర్తిస్తాడు. వాటి ప్రవర్తన గురించి తనకు బాగా తెలుసు కాబట్టి, మిగిలిన వారందరినీ అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అలా మొదలైన ప్రయాణంలో చలి, ఆకలి, గాయాలు ఒకవైపు.. ఎప్పుడైనా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న తోడేళ్లు మరోవైపు.

ఒక్కో ప్రమాదాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్తున్న కొద్దీ ఓట్వే తన తోటి కార్మికులను కోల్పోతుంటాడు. చివరకు అతను ఒంటరిగా మిగిలిపోతాడు. అయినా ప్రాణాలపై ఆశ వదులుకోకుండా ముందుకు సాగిన ఓట్వే చివరకు ఒక భయంకరమైన ప్రదేశానికి చేరుకుంటాడు. చుట్టూ పదుల సంఖ్యలో తోడేళ్లు కనిపిస్తాయి. అప్పుడే అతనికి అసలు నిజం అర్థమవుతుంది. తాను వాటి నుంచి తప్పించుకుంటూ వచ్చాననుకుంటే… చివరకు వాటి డెన్‌లోకే వచ్చేశాడు.

Advertisement

భారీ ఆల్ఫా తోడేలు అతని ముందుకు రావడంతో వెనక్కి వెళ్లే దారి కూడా లేకుండా పోతుంది. మరి ప్రాణాలతో బయటపడేందుకు ఓట్వే ఏం చేశాడు? ఆ ఆల్ఫా తోడేలుతో జరిగిన చివరి పోరులో ఎవరు గెలిచారు? అసలు ఓట్వే బతికి బయట పడ్డాడా? లేక ఆ మంచు అడవే అతని చివరి గమ్యంగా మారిందా? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమాను చూడాల్సిందే.

తెలుగులో కూడా ఉంది

‘ది గ్రే’ తెలుగు డబ్బింగ్‌తో JioHotstarలో అందుబాటులో ఉంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో కూడా వీక్షించవచ్చు. లియామ్ నీసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ లో మనిషిలో బతకాలనే పట్టుదల ఎలా ఉంటుందో అద్భుతంగా చూపించారు. మంచు ప్రాంతాల్లో సాగే సర్వైవల్, వన్యప్రాణుల ముప్పు, ప్రాణాల కోసం చివరి వరకు పోరాడే పాత్రలతో సినిమా చివరి వరకూ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ లా సాగుతుంది.

Read Also: అమ్మాయి కోసం ఇలా కూడా చేస్తారా ? చివర్లో వచ్చే ట్విస్ట్ ఊహించలేరు భయ్యా

Tags

Related News

గాల్లోనే ప్రాణాంతక వైరస్ దాడి.. ప్రపంచం మొత్తం భయపడిన ఏవియేషన్ డిజాస్టర్ థ్రిల్లర్ తెలుగులో

పుస్తకంలో రాసిన పాత్రలు నిజంగా బయటకొస్తే ? తర్వాత జరిగింది చూస్తే నవ్వాపుకోలేరు

గిఫ్ట్‌గా ఇచ్చిన టోస్టర్ కోసం పిచ్చెక్కించే రచ్చ… డార్క్ కామెడీ మూవీ తెలుగులో స్ట్రీమింగ్

ప్రేమ కోసం పెట్టిన కండిషన్… ఆటేరాని వాడు ఫుట్ బాల్ గ్రౌండ్ లోకి దిగితే… ఈ స్పోర్ట్స్ డ్రామా తెలుగులోనే

అమ్మాయి కోసం ఇలా కూడా చేస్తారా ? చివర్లో వచ్చే ట్విస్ట్ ఊహించలేరు భయ్యా

డిజిటల్ మార్కెట్లో సరికొత్త రికార్డు.. ‘జై హనుమాన్’ ఓటీటీ హక్కులకు భారీ డీల్!

అమ్మాయి కోసం రచ్చరచ్చ… అసలు టార్గెట్ తెలిస్తే మైండ్ బ్లాక్… ఓటీటీలోకి మహేష్ బాబు అన్న కొడుకు సినిమా

Big Stories

Advertisement
×