Jana Sena: జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనకు స్థానిక సంస్థల ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల వ్యూహం వర్తించదని అన్నారు. 21 సీట్లకు పరిమితమైన 2024 వ్యూహం సార్వత్రిక ఎన్నికలకే పరిమితం అని పవన్ అన్నారు. ప్రాంతాలవారీ రాజకీయ, సామాజిక పరిస్థితుల ఆధారంగా స్థానిక ఎన్నికల వ్యూహం ఉంటుందన్నారు. జనసైనికులు, వీర మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
స్థానిక పరిస్థితులకు అనుగుణంగా జనసేన పోటీ ఉంటుంది. జనసేనకు తగిన స్థానాలను గుర్తించి నివేదిక ఇవ్వాలని ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేవశారు. స్థానిక ఎన్నికల విధివిధానాల రూపకల్పనకు 9 నుంచి 11 మందితో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తానని, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తానని పవన్ అన్నారు. క్షేత్రస్థాయి జనసేన శ్రేణుల అభిప్రాయాలకు ప్రాధాన్యం అని అన్నారు. జనసేన శ్రేణుల రాజకీయ బలోపేతమే లక్ష్యం అని, కూటమి ధర్మానికి భిన్నంగా వ్యవహరిస్తున్న చోట్ల అసంతృప్తిపై పవన్‌కు ఎమ్మెల్యేల ఫిర్యాదు చేయాలన్నారు.
Also Read: మేడ్చల్ టు పాకిస్తాన్.. హైదరాబాద్‌లో ISI నెట్‌వర్క్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!
జనసేన శ్రేణుల అభిప్రాయాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటామన్న పవన్ కళ్యాన్ తెలిపారు. స్థానిక ఎన్నికల్లో జనసేనకు మెరుగైన అవకాశాలు కల్పిస్తామన్నారు. 2019-24 మధ్య జనసేన శ్రేణుల పోరాటాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ గుర్తు చేశారు. 2021 స్థానిక ఎన్నికల్లో జనసేన శ్రేణులు ధైర్యంగా నిలబడ్డారని జనసేన అధినేత అన్నారు. 2024లో కూటమి విజయానికి జనసేన శ్రేణుల కృషి మరువలేమని, 2019-24 నాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని పవన్ పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో జనసేన ప్రభావశీలంగా, మెరుగైన స్థాయిలో నిలబడుతుందని పవన్ అన్నారు.
Also Read: గాల్లోనే ప్రాణాంతక వైరస్ దాడి.. ప్రపంచం మొత్తం భయపడిన ఏవియేషన్ డిజాస్టర్ థ్రిల్లర్ తెలుగులో