Nindu Noorella Saavasam Serial Today Episode: పార్టీలో అమర్ గురించి ఏవేవో విషయాలు చెప్తుంది మిస్సమ్మ. వెనకే వచ్చి అమర్ వింటాడు. అక్కడే ఉన్న మేజర్ వైఫ్ కూడా ఏమయ్యా అమరేంద్ర నీకు నీ భార్యంటే అంత ఇష్టం ఉంటే మరీ ప్రతిపనీ నువ్వే చేయాలా అంటుంది. దీంతో అమర్ గుర్రుగా మిస్సమ్మను చూస్తుంటాడు. దేవుడా ఇలా బుక్ చేశావేంటయ్యా అని మిస్సమ్మ మనసులో అనుకుంటుంది. ఇంతలో అమర్.. భాగీని పక్కకు రమ్మని పిలుస్తాడు. సరే అంటూ మిస్సమ్మ వెళ్తుంటే అమర్ చేయి పట్టుకుని తీసుకెళ్తుంటాడు. అది చూసిన మేజర్ వైఫ్ చూశారా ఇప్పుడు కూడా అమర్ భాగీ చేయి వదలడం లేదు.. హస్బెంట్ అంటే అలా ఉండాలి అంటూ పక్కన ఉన్నవాళ్లకు చెప్తుంది. అందరూ సిగ్గుగా నవ్వుతుంటారు.
పక్కకు వెళ్లిన అమర్ కోపంగా ఏంటి నేను నిన్ను పార్టీకి రమ్మని ఇన్‌వైట్ చేశానా..? అని అడుగుతాడు. లేదండి అని మిస్సమ్మ చెప్తుంది. నీకు కొత్త శారీ కొనిపెట్టానా..? నిన్ను కూర్చోబెట్టి ఇంట్లో పనులు చేస్తానా..? ఎందుకు అలా అబద్దాలు చెప్పావు అంటూ అమర్ అడగ్గానే.. మిస్సమ్మ సిగ్గు పడుతూ ఊరికే తమాషాకు జోక్ చేశా అంటుంది. ఇంతలో మేజర్ అమర్ ఒకసారి ఇటు రావా..?అని పిలుస్తాడు. ఆ వస్తున్నాను.. సార్.. ఇంటికెళ్లాక నీ పని చెప్తాను అంటూ మేజర్ దగ్గరకు వెళ్తాడు మేజర్ అమర్ ఎనీ ప్రాబ్లమ్ అని అడుగుతాడు. నథింగ్ సార్ అని పార్టలో జాయిన్ అవుతాడు. మిస్సమ్మ మేజర్ వైప్ దగ్గరకు వెళ్తుంది. మేజర్ వైఫ్ నవ్వుతూ ఏంటి భాగీ ఏమంటున్నాడు మీ ఆయన అని అడుగుతుంది. ఏం లేదు మేడం.. ఈ పార్టీలో నాకు దిష్టి తగులుతుందేమోనని ఇంటికి వెళ్లాక దిష్టి తీస్తా అన్నారు అని చెప్తుంది.
ఇంతలో అమర్ వచ్చి పక్కన నిలబడి ఉంటాడు. అమర్‌ను చూసిన మిస్సమ్మ మళ్లీ భయపడుతూ..మీరు సార్ దగ్గరకు వెళ్లారు కదండి.. అని అడుగుతుంది. ఇంతలో మేజర్ వైఫ్ ఏమయ్యా అమరేంద్ర నువ్వు దిష్టి కూడా తీస్తావా..? నీకు దిష్టి తీయడం కూడా వచ్చా..? ఎప్పుడూ చెప్పలేదు.. మీ సార్‌కు కూడా కొంచెం నేర్పవయ్యా.. పదవయ్యా.. నీ దగ్గర చాలా విషయాలు నేర్చోకోవాలి పదవయ్యా.. రా.. అంటూ మేజర్ వైఫ్ అమర్‌ను మేజర్ దగ్గరకు తీసుకెళ్తుంది. మిస్సమ్మకు ఏం చేయాలో అర్థం కాదు. మేజర్ వైఫ్ ఏవండి.. అమర్‌ను చూశారా..? వీళ్ళ ఆవిడకు ఇంటికి వెళ్లిన తర్వాత దిష్టి కూడా తీస్తాడట. వాళ్ల భార్యని చాలా బాగా చూసుకుంటున్నాడు అని చెప్పగానే.. మేజర్ అమరేంద్ర నిజమా అని అడుగుతాడు. అమర్ సిగ్గుపడుతుంటాడు.
ఏవండి భార్యను ప్రేమగా ఎలా చూసుకోవాలో అమరేంద్రకు తెలిసినట్టుగా ఇంకెవ్వరికీ తెలియదు. ఆ ట్రిక్స్ ఏవో అమర్ దగ్గర మీరు తెలుసుకోవాలి. అమర్ మీ సార్‌కు కూడా కొంచెం చెప్పవయ్యా.. సినిమాలకు షికార్లకు కూడా వెళ్తారట కదా అని అడుగుతుంది. దీంతో అది నేను సరదాగా అన్నాను సార్.. అని అమర్ చెప్పగానే.. మేజర వైఫ్ ఏవండి విన్నారా..? మీరు ఎప్పుడైనా నన్ను తీసుకెళ్లారా..? అమర్‌ను చూసి నేర్చుకోండి.. అని చెప్తుంది. మరోవైపు దూరం నుంచి అంతా చూస్తున్న మిస్సమ్మ భయపడుతూ అయ్యో ఇంటికి వెళ్లాక నన్ను ఏమంటారో ఏమో టెన్షన్‌లో నా గొంతు ఎండుకుపోతుంది. ఏయ్ బాబు ఇటు రా అంట పిలిచి వాటర్ అనుకుని మందు తాగుతుంది. అమర్ చూసి తనేంటి కూల్ డ్రింక్ అనుకుని మందు తాగేస్తుందా..? అని మనసులో అనుకుంటుంటాడు.
ఇంతలో మేజర్ వైఫ్ అమర్ ఇంకేంటయ్యా ట్రిక్స్ .. ఏమయ్యా అమర్ నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు అక్కడ చూస్తున్నావేంటి..? భాగీ కోసమా… భాగీ ఎక్కడికి వెల్లిపోదులేవయ్యా.. ఆ ట్రిక్స్ ఏవో కొంచెం మా ఆయనకు కూడా చెప్పు అని చెప్పగానే.. లేదు మేడం.. తను కూల్ డ్రింక్స్ అనుకుని మందు తాగేస్తుంది. అంటూ అమర్ చెప్పగానే.. అందరూ అటువైపు చూస్తారు. మిస్సమమ్ మాత్రం కూల్ డ్రింక్ చాలా బాగుంది అంటూ మందు తాగుతూనే ఉంటుంది. మేజర్ వైఫ్ చూసి అమర్ భాగీకి డ్రిక్స్ అలవాటు ఉందా..? అని అడుగుతుంది.. లేదు మేడం తను అది కూల్ డ్రింక్స్ అనుకుంటుంది అంటూ అమర్ చెప్పగానే.. వెళ్లి త్వరగా ఆపవయ్యా అంటూ మేజర్ చెప్పగానే.. అమర్ స్పీడుగా మిస్సమ్మ దగ్గరకు వెళ్తాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం