BigTV English

OTT Movie : వింత శక్తులిచ్చే తాళాలు… డెవిల్ తో గేమ్స్… ఫ్యామిలీతో చూడాల్సిన హర్రర్ ఫాంటసీ థ్రిల్లర్

OTT Movie : వింత శక్తులిచ్చే తాళాలు… డెవిల్ తో గేమ్స్… ఫ్యామిలీతో చూడాల్సిన హర్రర్ ఫాంటసీ థ్రిల్లర్

OTT Movie : ఫాంటసీ, హారర్ , కుటుంబ డ్రామా, సూపర్నాచురల్ థ్రిల్స్‌ తో ఒక వెబ్ సిరీస్ ఓటీటీలో దూసుకెళ్తోంది. దీని విజువల్స్, నటన, క్లైమాక్స్ కు అభిమానులు కేరింతలు కొడుతున్నారు. ఈ సిరీస్ లాక్ అనే కుటుంబం చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు తమ తండ్రి హత్య తర్వాత మాసచూసెట్స్‌లోని మాయాజాల కీలతో నిండిన తమ పూర్వీకుల మాన్షన్‌కు వెళతారు. ఒక దెయ్యం శక్తి నుండి ఈ కీలను రక్షించేందుకు పోరాడుతారు. ఈ సిరీస్ పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళితే …


నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఈ అమెరికన్ ఫాంటసీ-హారర్ సిరీస్ పేరు ‘లాక్ అండ్ కీ’ (Locke & Key). జో హిల్, గాబ్రియెల్ రోడ్రిగ్జ్ రాసిన కామిక్ బుక్ సిరీస్ ఆధారంగా నెట్‌ఫ్లిక్స్ కోసం కార్ల్టన్ క్యూస్, మెరిడిత్ అవెరిల్, ఆరోన్ ఎలీ కోలైట్ సృష్టించారు. ఈ సిరీస్ 2020 ఫిబ్రవరి 7న మొదటి సీజన్‌తో ప్రారంభమై, మూడు సీజన్లలో (2020-2022) మొత్తం 28 ఎపిసోడ్‌లతో ముగిసింది. ఇందులో డార్బీ స్టాంచ్‌ఫీల్డ్, కానర్ జెస్సప్, ఎమిలియా జోన్స్, జాక్సన్ రాబర్ట్ స్కాట్, లైస్లా డి ఒలివెరా, పెట్రిస్ జోన్స్, గ్రిఫిన్ గ్లక్ నటించారు. IMDbలో 7.3/10 రేటింగ్ ఉన్న ఈ సిరీస్ Netflix లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషలలో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

రెండెల్ లాక్ చనిపోవడంతో, అతని భార్య నీనా (డార్బీ స్టాంచ్‌ఫీల్డ్), పెద్ద కొడుకు టైలర్ (కానర్ జెస్సప్), కుమార్తె కిన్సీ (ఎమిలియా జోన్స్), చిన్న కొడుకు బోడ్ (జాక్సన్ రాబర్ట్ స్కాట్) సీటెల్ నుండి మాథెసన్‌లో ఉన్న “కీహౌస్” అనే సొంత మాన్షన్‌కు మారతారు. కీహౌస్ అనేది మాయాజాల కీలతో నిండిన ఒక పురాతన ఇల్లు. ఈ కీలు వివిధ అతీంద్రియ శక్తులతో నిండి ఉంటాయి. ఉదాహరణకు, ఎనీవేర్ కీ (ఏ డోర్ ద్వారా ఎక్కడికైనా ట్రావెల్ చేయడం), హెడ్ కీ (మనస్సులోకి ప్రవేశించడం), ఘోస్ట్ కీ (ఆత్మగా మారడం). ఈ కీలను ఉపయోగించడం ద్వారా, లాక్ పిల్లలు తమ కుటుంబ చరిత్రను, రెండెల్ మరణం వెనుక రహస్యాలను కనిపెడతారు.

ఈ క్రమంలో వీళ్లంతా ఒక దెయ్యం శక్తి డాడ్జ్ ను ఎదుర్కొంటారు. డాడ్జ్ ఒక వింత ఆకారంలో కనిపించి, కీలను సేకరించి, బ్లాక్ డోర్ అనే ఒక పోర్టల్‌ను తెరిచ, ఇతర దెయ్యాలను విడుదల చేయడానికి ప్రయత్నిస్తుంది. డాడ్జ్ రెండెల్ స్నేహితుడు లూకాస్‌తో సంబంధం కలిగి ఉందని తెలుస్తుంది. లాక్ పిల్లలు తమ స్నేహితుల సహాయంతో డాడ్జ్‌ను ఎదుర్కొంటారు. చివరికి ఆ కీ ల రహస్యం ఏమిటి ? దెయ్యాలు ఆ ఇంట్లో ఎందుకు ఉన్నాయి ? లాక్ ఫ్యామిలీ ఆ ఇంటి నుంచి బయటపడుతుందా ? లాక్ ఎలా చనిపోయాడు ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సిరీస్ ను మిస్ కాకుండా చుడండి.

Read Also : తలలు తెంపేసి జైలు గేటు ముందే వేలాడదీసే సైకో… దేశాన్ని గజగజా వణికించిన రియల్ స్టోరీ

Related News

OTT Movie : పోయినోళ్ళను తిరిగిచ్చే యాప్… భర్తను బలిచ్చి ముసలాడితో సెటిలయ్యే అమ్మాయి… నరాలు కట్టయ్యే ఉత్కంఠ

OTT Movie : ఈ అమ్మాయి పెయింటింగ్ వేస్తే పోతారు మొత్తం పోతారు… గుండె ధైర్యం ఉన్నవాళ్లే చూడాల్సిన హర్రర్ మూవీ

OTT Movie : తెగిపడే బొమ్మల తలలు… మనుషులు కన్పిస్తే ముక్కలు ముక్కలుగా నరికి… ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్ మావా

OTT Movie : సొంత కొడుకుని కూడా వదలకుండా… ఇదెక్కడి దిక్కుమాలిన కథ ? ఈ డైరెక్టర్ కు మైండ్ దొబ్బిందా భయ్యా

OTT Movie : పెళ్ళాం ఉండగా మరో అమ్మాయితో భర్త… ఇంకొకడితో భార్య జంప్… స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : ఈ సబ్ వేలో అడుగు పెడితే చావే… అంతులేని మిస్టరీ… ‘స్క్విడ్ గేమ్’ లాంటి లైఫ్ అండ్ డెత్ గేమ్

OTT Movie : ఏం సినిమా గురూ… వర్షాకాలంలోనూ చెమటలు పట్టించే మసాలా సీన్లు… కాకరేపే క్రైమ్ కథ

OTT Movie : ఈ ఊర్లో ఇంట్లో నుంచి బయటకొస్తే బతుకు బస్టాండే… మనుషుల్ని పీక్కుతినే వైరస్ తో డేంజర్ బెల్స్

Big Stories

×