E-Paper
Advertisement

హైటెక్ సిటీలో భారీ మాల్.. షాపింగ్, థియేటర్లు, రెస్టారెంట్లు అన్నీ ఒకే చోట.. సరికొత్త వీకెండ్ డెస్టినేషన్!

హైటెక్ సిటీలో భారీ మాల్.. షాపింగ్, థియేటర్లు, రెస్టారెంట్లు అన్నీ ఒకే చోట.. సరికొత్త వీకెండ్ డెస్టినేషన్!
Advertisement

HiTech City Mall: హైదరాబాద్ ఐటీ రంగానికి గుండెకాయ లాంటి హైటెక్ సిటీలో భారీ మాల్ రాబోతోంది. అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలకు నిలయంగా మారిన ఈ ప్రాంతంలో బ్రూక్‌ఫీల్డ్ – కె.రహేజా గ్రూప్ సంయుక్తంగా ఒక భారీ షాపింగ్ మాల్‌ను నిర్మిస్తున్నాయి. నగర వాసులకు అంతర్జాతీయ స్థాయి షాపింగ్, వినోదం, విందు వంటి అనుభూతులను ఒకే చోట అందించడమే లక్ష్యంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ వేగంగా రూపుదిద్దుకుంటోంది.

షాపింగ్ నుంచి వినోదం వరకు..

ఈ సరికొత్త మాల్ కేవలం షాపింగ్‌కే పరిమితం కాకుండా.. అన్ని రకాల గ్లోబల్ బ్రాండ్లు, రకరకాల వంటకాలను అందించే లగ్జరీ రెస్టారెంట్లు, సరికొత్త గేమింగ్ జోన్లు, అత్యాధునిక మల్టీప్లెక్స్ థియేటర్లు ఇందులో భాగం కానున్నాయి. ఐటీ ఉద్యోగులకు, స్థానికులకు వారాంతాల్లో సరదాగా గడిపేందుకు ఇది ఒక పర్ఫెక్ట్ వీకెండ్ డెస్టినేషన్‌గా మారబోతోంది.

రియల్ ఎస్టేట్‌కు బూస్టప్..

Advertisement

ఈ భారీ మాల్ అందుబాటులోకి వస్తే.. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రాపర్టీ విలువలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే నగరంలో మంచి డిమాండ్‌లో ఉన్న రియల్ ఎస్టేట్ రంగానికి ఈ ప్రాజెక్ట్ మరిన్ని రెక్కలు తొడుగుతుందని అంచనాలు ఉన్నాయి. నిత్యం లక్షలాది మంది ఉద్యోగులు, ప్రజలు తిరిగే హైటెక్ సిటీలో.. ఈ కొత్త ల్యాండ్ మార్క్ ఈ ప్రాంత రూపురేఖలను మరింతగా మార్చేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Also Read: జియో బిగ్ ఆఫర్.. రూ.2000తో ఏడాదంతా 15 ఓటీటీలు ఫ్రీ.. 1000 పైగా ఛానెళ్లు !

ఇప్పటికే నగరంలో భారీ మాల్స్

Advertisement

అయితే హైదరాబాద్ నగరంలో ఇప్పటికే చాలా మాల్స్ ఉన్నాయి. వీకెండ్స్ వస్తే పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి వెళ్తూ వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు. కాగా, నగరంలోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్ (AMB Mall) ఆసియాలోనే అతిపెద్ద మాల్స్‌లో ఒకటిగా నిలిచింది. అలాగే నెక్సస్ మాల్, ఇనార్బిట్ మాల్, జీవీకే వన్, సిటీ సెంటర్ వంటి మాల్స్ హైదరాబాద్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్స్ గా నిలుస్తున్నాయి. త్వరలో హైటెక్ సిటీలోని మాల్ కూడా అందుబాటులోకి వస్తే.. నగరవాసులకు వీకెండ్స్ కోసం మరో డెస్టినేషన్ స్పాట్ దొరికినట్లేనని చెప్పవచ్చు.

Also Read: రూ.25 వేలలో బెస్ట్ ఫోన్ కావాలా? చౌకగా వన్ ప్లస్, ఐకూ, శాంసంగ్ మెుబైల్స్.. అమెజాన్‌లో బంపరాఫర్లు!

Tags

Related News

కలలోకి ప్రియుడు రావడంతో యువతి బలవన్మరణం, శంషాబాద్‌లో విషాద ఘటన

మునుగోడు పంచాయతీ సెక్రటరీలకు ఎమ్మెల్యే మాస్ వార్నింగ్!

రాజీవ్ యువ వికాసం పథకం బిగ్ అప్డేట్.. కలెక్టర్లకు ఆదేశాలు జారీ!

హైడ్రా ప్రజావాణికి వెల్లువలా ఫిర్యాదులు.. ఒక్కరోజే ఇన్ని ఫిర్యాదులా..?

గద్వాల మున్సిపాలిటీలో రూ. 11 లక్షల గోల్‌మాల్ కలకలం!

ఐటీ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మరో 1000 మందికి ఉద్యోగాలు!

బహదూర్‌పల్లి బాధితులకు కేటీఆర్ భరోసా.. ప్రభుత్వంపై కీలక డిమాండ్స్!

స్థానిక ఎన్నికలే టార్గెట్.. కవిత తన మార్క్ స్కెచ్.. పార్టీ నేతలతో వరుస భేటీలు!

Big Stories

Advertisement
×