BigTV English
Advertisement

Mad Square on OTT : ఓటీటీలోకి ‘మ్యాడ్ స్క్వేర్’.. ధూమ్ ధామ్ ట్రైలర్ వదిలిన నెట్ ఫ్లిక్స్, స్ట్రీమింగ్ అప్పుడే!

Mad Square on OTT : ఓటీటీలోకి ‘మ్యాడ్ స్క్వేర్’.. ధూమ్ ధామ్ ట్రైలర్ వదిలిన నెట్ ఫ్లిక్స్, స్ట్రీమింగ్ అప్పుడే!

Mad Square on OTT : నార్నె నితిన్ (Narne Nithin), సంగీత్ శోభన్ (Sangeeth Sobhan), రామ్ నితిన్ (Ram Nithin) ప్రధాన పాత్రలు పోషించిన యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ‘మ్యాడ్ స్క్వేర్ (Mad Square)’. 2023లో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ‘మ్యాడ్’కు సీక్వెల్ గా రూపొందిన ఈ మూవీ ఈ ఏడాది మార్చి 28న రిలీజ్ అయ్యి, నిర్మాతలకు మంచి లాభాలే తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ కూడా ధూమ్ ధామ్ గా కానిస్తున్నారు. ఈ మూవీని రిలీజ్ చేయబోతున్న ఓటీటీ నెట్ ఫ్లిక్స్ (Netflix) ట్రైలర్ ని రిలీజ్ చేసి, మరోసారి అందరి దృష్టి ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ పై పడేలా చేసింది.


మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి… 

కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రాబోతుంది. ఏప్రిల్ 25 నుంచి ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఇక ఎప్పటిలా సినిమాను జస్ట్ పోస్టర్ల ద్వారా ప్రకటించి, డైరెక్ట్ గా రిలీజ్ చేయకుండా… ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీకి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేసి ప్రమోషన్ల సందడి మొదలెట్టింది నెట్ ఫ్లిక్స్. అయితే థియేటర్లలో రిలీజ్ అయిన నెలరోజులలోపే ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండడం గమనార్హం.


‘మ్యాడ్ స్క్వేర్’ స్టోరీ 

నలుగురు ఇంజనీరింగ్ స్నేహితులు చదివు అయిపోగానే విడిపోతారు. ఇంజనీరింగ్ చేసినప్పటికీ లైఫ్ లో సెటిల్ కాకుండా ఎంజాయ్ చేస్తూ గడుపుతారు. ఈ నలుగురిలో ఒకడైన లడ్డూ తన ఫ్రెండ్స్ కి చెప్పకుండా పెళ్లికి రెడీ అవుతాడు. ఈ విషయం తెలుసుకున్న ఫ్రెండ్స్ సడన్ గా పెళ్లికి అతిథులుగా విచ్చేస్తారు. ఆ తర్వాత ఫ్రెండ్స్ తో పాటు వచ్చిన అబ్బాయితో పెళ్లికూతురు వెళ్ళిపోతుంది. దీంతో ఆ బాధ మర్చిపోవాలని ఫ్రెండ్స్ అంతా కలిసి లడ్డూ కోసం గోవా ట్రిప్ ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? డాన్ మ్యాక్స్ తో వీళ్ళకు గొడవ ఏంటి? లడ్డూ తండ్రిని ఎందుకు కిడ్నాప్ చేస్తారు? అసలు సినిమాలో ఉన్న లాకెట్ స్టోరీ ఏంటి? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే మూవీని చూడాల్సిందే.

Read Also : పాక్ నటితో సినిమానా? ప్రభాస్ మూవీపై ఆగ్రహావేశాలు.. ఇప్పుడు ఏం చేస్తారో?

ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇందులో ప్రియాంక జవాల్కర్ కీలక పాత్రను పోషించింది. సునీల్, శుభలేఖ సుధాకర్, విష్ణు, మురళీధర్ గౌడ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. బీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, తమన్ ఈ మూవీకి బీజీఎం అందించారు. ఇక ఈ సినిమాను థియేటర్లలో మిస్సయిన వారు మరికొన్ని గంటల్లో ఓటీటీలో చూసి, ఎంచక్కా కడుపుబ్బా నవ్వుకోవచ్చు.

Related News

OTT Movie : ‘గేమ్ ఆఫ్ థ్రోన్’కు మించిన కంటెంట్ ఉన్న సిరీస్ మావా… అస్సలు వదలొద్దు

Phaphey Kuttniyan OTT : అందంగా దోచుకునే అమ్మాయిలు… కామెడీ మూవీకి క్రైమ్ ట్విస్ట్… 3 నెలల తరువాత ఓటీటీలోకి

Mithra Mandali OTT : ఓటీటీలోకి ‘మిత్రమండలి’… రీ-లోడెడ్ వెర్షన్ వర్కౌట్ అవుతుందా ?

November 2025 OTT releases : ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ నుంచి ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ వరకు… ఈ నెల ఓటీటీలో మోస్ట్ అవైటింగ్ సిరీస్ లు

OTT Movie : ‘గర్ల్ ఫ్రెండ్’ రిలీజ్ కంటే ముందు చూడాల్సిన రష్మిక మందన్న టాప్ 5 మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : టీనేజర్ల పాడు పనులు… బాయ్ ఫ్రెండ్ ను ఊహించుకుని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

Big Stories

×