Amazon sale blockbuster soundbar offers: ఇంట్లోనే.. సినిమా థియేటర్ లాంటి అద్భుతమైన ఆడియో ఫీల్ పొందాలనుకునే వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో.. ప్రత్యేకంగా ప్రారంభమైన ఫ్రీడమ్ సేల్‌లో ప్రముఖ బ్రాండ్ల డాల్బీ అట్మాస్ సౌండ్ బార్‌లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరకే.. ప్రీమియం సౌండ్ క్వాలిటీ అందించే బెస్ట్ సౌండ్‌బార్ మోడల్స్, వాటి ప్రత్యేకతలు, ఆఫర్ ధరల గురించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.
ప్రపంచవ్యాప్తంగా ఆడియో పరికరాలకు పేరుగాంచిన జెబిఎల్ బ్రాండ్ నుంచి వచ్చిన ఈ డాల్బీ అట్మాస్ సౌండ్‌బార్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. అమెజాన్ ఫ్రీడమ్ సేల్‌లో భాగంగా దీని ధర సుమారు రూ. 21,999 వరకు లభిస్తోంది. ఇది సూపర్ బేస్ ,క్రిస్టల్ క్లియర్ వాయిస్ క్లారిటీతో వస్తుంది. ఇంటిలోపల సినిమా చూసేటప్పుడు లేదా మ్యూజిక్ వినేటప్పుడు 3D సరౌండ్ సౌండ్ అనుభవాన్ని ఇది అందిస్తుంది. వైర్‌లెస్ సబ్‌వుఫర్ సపోర్ట్ ఉండటం వల్ల దీనిని ఆపరేట్ చేయడం, సెటప్ చేయడం చాలా ఈజీ.
ఇండియన్ మార్కెట్లో తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు అందించే జెబ్రానిక్స్ నుంచి వచ్చిన ఈ మోడల్ అందరినీ ఆకట్టుకుంటోంది. అమెజాన్ ఆఫర్లలో.. దీని ధర సుమారు రూ. 14,999 పరిధిలో లభిస్తుంది. ఇది డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో కూడి ఉండి, గది నలుమూలలా సౌండ్ సమానంగా ప్రవహించేలా చేస్తుంది. మల్టిపుల్ కనెక్టివిటీ ఆప్షన్స్ , బెస్ట్ ఎల్‌ఈడీ లైటింగ్ డిజైన్ దీని సొంతం. అంతే కాకువడా ఇది బడ్జెట్ యూజర్లకు పర్ఫెక్ట్ ఛాయిస్.
నాణ్యతకు మారుపేరైన సోనీ బ్రాండ్ నుంచి వచ్చిన ఈ మోడల్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ ధర సుమారు రూ. 29,990 వరకు ఉంది. ఇది వర్చువల్ సరౌండ్ ఇంజిన్‌తో పని చేస్తూ థియేటర్ స్థాయి అనుభూతిని ఇస్తుంది. అంతర్నిర్మిత డ్యూయల్ సబ్‌వుఫర్ ఉండటం వల్ల ..ప్రత్యేకంగా పెద్ద బాక్స్ అవసరం లేకుండానే బలమైన బాస్‌ను ఆస్వాదించవచ్చు. స్మార్ట్ ఫోన్ లేదా టీవీకి బ్లూటూత్ ద్వారా క్షణాల్లో కనెక్ట్ అయ్యే ఈ సౌండ్ బార్ రిమోట్ మూవీ లవర్స్‌కు బెస్ట్.
Also Read: గూగుల్ మ్యాప్స్‌లో అమేజింగ్ ఫీచర్స్..99% మందికి తెలియవు !
యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్న బోట్ బ్రాండ్ నుంచి వచ్చిన ఈ మోడల్ సౌండ్‌బార్ అత్యంత తక్కువ ధరలో లభిస్తోంది. అమెజాన్ సేల్‌లో దీని ధర దాదాపు రూ. 9,999 వరకు తగ్గింపుతో లభిస్తుంది. ఇది డాల్బీ ఆడియో, అట్మాస్ సపోర్ట్‌తో వచ్చి, రోజువారీ టీవీ చూడటం, పాటలు వినే అనుభవాన్ని రెట్టింపు చేస్తుంది. స్లీక్ డిజైన్ , బెస్ట్ సౌండ్ మోడ్స్ దీని ప్రత్యేకతలు, తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఆడియో కోరుకునే వారికి ఇది సరిగ్గా సరి పోతుంది.
సామ్‌సంగ్ బ్రాండ్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్నఈ మోడల్ డాల్బీ అట్మాస్ సౌండ్‌బార్ ధర సుమారు రూ. 26,999 వరకు ఉంది. ఇది అకౌస్టిక్ బీమ్ టెక్నాలజీతో పనిచే స్తూ సౌండ్‌ను మరింత స్పష్టంగా చేరవేస్తుంది. టీవీతో పర్ఫెక్ట్‌గా సింక్ అయ్యే ఈ డివైజ్ గేమింగ్ , యాక్షన్ సినిమాలకు అద్భుతమైన ఆడియోను అందిస్తుంది. అమెజాన్ ఫ్రీడమ్ సేల్ అందిస్తున్న ప్రత్యేక బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను ఉపయోగించుకుని ఈ ప్రీమియం సౌండ్‌బార్‌లను మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.