E-Paper
Advertisement

కామెడీ నుంచి థ్రిల్లర్ వరకు… ఈ వారం ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన మలయాళం మూవీస్

కామెడీ నుంచి థ్రిల్లర్ వరకు… ఈ వారం ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన మలయాళం మూవీస్
Advertisement

Malayalam Movies on OTT : మలయాళ చిత్రాలు ఎప్పుడూ కొత్త కథలు, బలమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ వారం కూడా కొన్ని ఆసక్తికరమైన మలయాళ సినిమాలు OTTలో స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి. ఆ లిస్ట్ లో థ్రిల్లర్ నుంచి కామెడీ వరకు వివిధ జానర్లు ఉన్నాయి. ఈ వారం ఇంట్లో కూర్చొని చూడాలనుకునే వారి కోసమే ఈ మూవీస్. మరి ఆ సినిమాలు ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతున్నాయి ? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం పదండి.

1. దృశ్యం 3 (Drishyam 3)

మోహన్‌లాల్, మీనా, అన్సిబా హాసన్, ఎస్తేర్ అనిల్, కళాభవన్ షాజోన్, సిద్ధిక్, మురళీ గోపీ, ఆశా శరత్ ప్రధాన పాత్రలు పోషించిన మూవీ ‘దృశ్యం 3’. జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ డ్రామా త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది. జార్జ్‌కుట్టి (మోహన్‌లాల్), అతని కుటుంబం కొంతకాలం ప్రశాంతంగా ఉంటారు. గతం ఎప్పుడు మళ్లీ తమను ఇబ్బందుల్లో పడేస్తుందో అని భయపడుతూనే ఉంటాడు. దాచిన రహస్యాలు బయటపడి, వారి జీవితాలు మళ్లీ అల్లకల్లోలమవుతాయా ? అయితే ఈసారి హీరో ఎలాంటి పరిష్కారం కనిపెట్టాడు ? అనేది ఈ పార్ట్ స్టోరీ. మోహన్‌లాల్ అద్భుత నటనతో మరోసారి మెప్పించే సినిమా ఇది.
ఎక్కడ చూడాలి : Prime Video
స్ట్రీమింగ్ తేదీ : జూన్ 18

2. గు (Gu)

Advertisement

ఈ సినిమాలో సైజు కురుప్, దేవా నంద, నిరంజ్ మణియన్‌పిల్ల రాజు, అశ్వతీ మనోహరన్ మెయిన్ లీడ్స్ గా నటించారు. మను రాధాకృష్ణన్ దర్శకత్వం వహించారు. ఈ హారర్ డ్రామాలో ఎనిమిదేళ్ల అప్పు, అతని కజిన్ మిన్నా చుట్టూ సాగుతుంది కథ. గులికన్ అనే దైవిక శక్తి రహస్యాలను వారు ఎలా అన్వేషిస్తారు ? అనే స్టోరీ లైన్ తో హారర్ ఎలిమెంట్స్‌తో కూడిన డ్రామా ఇది.
ఎక్కడ చూడాలి : ManoramaMAX
స్ట్రీమింగ్ తేదీ : జూన్ 19

3. ఆశాన్ (Aashaan)

ఇంద్రన్స్, జోమోన్ జ్యోతిర్, శోబి తిలకన్, మదన్ గౌరీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు దర్శకుడు జాన్‌పాల్ జార్జ్ దర్శకత్వం వహించారు. ఈ కామెడీ డ్రామాలో విఎఫ్ఎక్స్ టెక్నీషియన్ కావాలని కలలు కంటున్న అనంతరామన్, సినిమా ప్రియుడు ఆశాన్ కథను చూడవచ్చు. ఒక సూపర్‌స్టార్ సినిమా షూటింగ్ కోసం వచ్చిన బృందం వల్ల వారి జీవితాల్లో ఎలాంటి గందరగోళం ఏర్పడుతుంది ? అనేది స్టోరీ. సినిమా ఇండస్ట్రీ వాస్తవాలను హాస్యంగా చూపించే చిత్రమిది.
ఎక్కడ చూడాలి: Sun NXT
స్ట్రీమింగ్ తేదీ: జూన్ 19

4. అతిరది (Athiradi)

Advertisement

ఈ సినిమాలో టోవినో థామస్, బాసిల్ జోసెఫ్, వినీత్ శ్రీనివాసన్, రియా శిబు, షాన్ రెహమాన్ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. అరుణ్ అనిరుధన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా యాక్షన్ కామెడీ జానర్లో తెరకెక్కింది. ఇంజనీరింగ్ విద్యార్థి సమ్కుట్టి బ్యాన్ చేసిన కాలేజీ ఉత్సవాన్ని మళ్లీ మొదలు పెట్టాలని ప్రయత్నిస్తాడు. గాయకుడిగా ఎదగాలనుకునే శ్రీకుట్టన్‌తో అతనికి గొడవ అవుతుంది.
ఎక్కడ చూడాలి: SonyLIV
స్ట్రీమింగ్ తేదీ: జూన్ 19

Read Also : తరతరాలుగా ఊరిని వణికించే దెయ్యం… చీకటంటేనే భయపడే హీరో చేసే రిస్క్ చూస్తే దిమాక్ ఖరాబ్

Related News

ఇంట్లో కూర్చుని 80 లక్షల సంపాదన… హర్రర్ గేమ్ ఆడుతూ ఆగమాగం… ఈ హర్రర్ థ్రిల్లర్ పెద్దలకు మాత్రమే

నైట్‌క్లబ్‌లో లేడీ డాన్సర్ల పవర్ వార్… రెండు కొప్పులు ఒకే చోట ఇమడవు అంటే ఇదేనేమో… తెలుగులో టర్కిష్ మూవీ

చిల్లర బ్యాచ్ కాదు… సీట్-ఎడ్జ్ యాక్షన్‌తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ

సినిమా పిచ్చితో సీక్రెట్ పనులు… అపరిచితుడి ఎంట్రీతో అదిరిపోయే ట్విస్ట్… సింగిల్స్ కి మాత్రమే

కోటి బహుమతి కోసం ఎక్స్‌తో జోడీ… కట్ చేస్తే కాటికి తీసుకెళ్ళే ట్విస్ట్… సీక్రెట్ క్లబ్‌లో హారర్ మిస్టరీ

బైక్ పై ఇద్దరమ్మాయిల రచ్చ… అదిరిపోయే రోడ్ ట్రిప్ డ్రామా… నెవర్ బిఫోర్ కథ

కామాంధులను శిక్షించడానికి రంగంలోకి దిగే రహస్య శక్తి… మృత్యుదేవత విలయతాండవం

ఇన్సూరెన్స్ కోసం ముసలోళ్ల ఇంటికెళ్తే ఇదేం అరాచకం భయ్యా ? ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హర్రర్ మూవీ

Big Stories

Advertisement
×