E-Paper
Advertisement

తరతరాలుగా ఊరిని వణికించే దెయ్యం… చీకటంటేనే భయపడే హీరో చేసే రిస్క్ చూస్తే దిమాక్ ఖరాబ్

తరతరాలుగా ఊరిని వణికించే దెయ్యం… చీకటంటేనే భయపడే హీరో చేసే రిస్క్ చూస్తే దిమాక్ ఖరాబ్
Advertisement

Malayalam Horror Thriller : మలయాళం సినిమాలంటే చెవి కోసుకునేవారి సంఖ్య భారీగానే ఉంటుంది. అలా క్రేజీగా మాలీవుడ్ సినిమాలను ఇష్టపడే వారి కోసమే ఈ థ్రిల్లర్ మూవీ. 2025లో థియేటర్లలో విడుదలై మలయాళ ప్రేక్షకులను అలరించిన చిత్రం ‘నెల్లిక్కాంపొయిల్ నైట్ రైడర్స్’ (Nellikkampoyil Night Riders). ప్రముఖ ఎడిటర్ నౌఫల్ అబ్దుల్లా మొదటిసారి దర్శకుడిగా మారిన ఈ సినిమా అక్టోబర్ 24న రిలీజ్ అయ్యింది. మాథ్యూ థామస్, మీనాక్షి ఉన్నికృష్ణన్, శరత్ సభ, రోషన్ శానవాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. మూఢనమ్మకాలు, గ్రామీణ గాథలు, హారర్, కామెడీ, సస్పెన్స్ కలిసిన ఈ చిత్రం థియేటర్లలో మంచి విజయం సాధించింది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? అన్న విషయాలను వివరంగా తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

రాత్రైతే కాదు గ్రామాన్ని పట్టి పీడించే భయంకరమైన హర్రర్ స్టోరీ ఇది. నెల్లిక్కాంపొయిల్ అనే ఒక మారుమూల గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఆ ఊరిలో రాత్రి వేళల్లో వింత వింత సంఘటనలు జరుగుతుంటాయి. ముఖ్యంగా గుర్రపు కాళ్ల శబ్దంతో వచ్చి గ్రామస్తులపై దాడి చేసే ఒక వింత ఆకారం లేదా ముసుగు ధరించిన భయంకరమైన మృగం గ్రామాన్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది. మంగళూరులో కాలేజీ పూర్తి చేసుకుని తన సొంత ఊరైన నెల్లిక్కాంపొయిల్‌ కు తిరిగి వచ్చే శ్యామ్ (మాథ్యూ థామస్)కు చీకటి అంటే భయం. రాత్రి పూట బయటకు వెళ్లాలంటేనే అతను వణికిపోతాడు. కానీ ఆ గ్రామంలో జరుగుతున్న వింత దాడుల వల్ల అతని ప్రేయసి, స్నేహితుల జీవితాలు ప్రమాదంలో పడతాయి. అసలు చీకటి అంటేనే భయపడే హీరో తన ఫ్రెండ్స్ ను ఎలా కాపాడాడు ? ఆ దెయ్యం నిజంగానే ఉందా ? ఊరిని భయపెడుతున్న ఆ మాస్క్ మనిషి ఎవరు ? అన్నది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

Advertisement

తనలోని చీకటి భయాన్ని అధిగమించి, ప్రేయసిని కాపాడుకోవడానికి, గ్రామాన్ని పట్టి పీడిస్తున్న ఆ అజ్ఞాత శక్తి వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి శ్యామ్ తన స్నేహితులతో కలిసి రాత్రి పూట సాహసాలు చేస్తాడు. హారర్ సన్నివేశాలు, కామెడీ టైమింగ్‌లు, గ్రామీణ బ్యాక్‌డ్రాప్, ఉత్కంఠభరితమైన ట్విస్ట్‌లు కలిసి ఈ చిత్రాన్ని ప్రత్యేకం చేశాయి. మాథ్యూ థామస్ భయంతో వణికే యువకుడిగా, తన భయాన్ని అధిగమించి హీరో అవతారం ఎత్తడానికి చేసే ప్రయత్నాల్లో బాగా నటించాడు. మీనాక్షి ఉన్నికృష్ణన్ అతని ప్రేయసి పాత్రలో తనదైన మార్క్ వేసింది. శరత్ సభ, రోషన్ శానవాస్ స్నేహితుల పాత్రల్లో కామెడీని జోడించారు. మొత్తం ఎన్సెంబుల్ కాస్ట్ బాగా పని చేసింది. ప్రముఖ ఎడిటర్ నౌఫల్ అబ్దుల్లా మొదటి సినిమాతోనే గుడ్ ఇంప్రెషన్ సృష్టించాడు. సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ భయాన్ని మరింత పెంచాయి. ఈ చిత్రం 2026 ఫిబ్రవరి 6 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ మలయాళ ఆడియోతో పాటు సౌత్ ఇండియన్ భాషల సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి.

Read Also : ఇదెక్కడి విడ్డూరం… నెట్‌ఫ్లిక్స్‌ ట్రెండింగ్‌లో 8 ఏళ్ళ క్రితం విడుదలైన పాత వెబ్ సిరీస్

Tags

Related News

ఇంట్లో కూర్చుని 80 లక్షల సంపాదన… హర్రర్ గేమ్ ఆడుతూ ఆగమాగం… ఈ హర్రర్ థ్రిల్లర్ పెద్దలకు మాత్రమే

నైట్‌క్లబ్‌లో లేడీ డాన్సర్ల పవర్ వార్… రెండు కొప్పులు ఒకే చోట ఇమడవు అంటే ఇదేనేమో… తెలుగులో టర్కిష్ మూవీ

చిల్లర బ్యాచ్ కాదు… సీట్-ఎడ్జ్ యాక్షన్‌తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ

సినిమా పిచ్చితో సీక్రెట్ పనులు… అపరిచితుడి ఎంట్రీతో అదిరిపోయే ట్విస్ట్… సింగిల్స్ కి మాత్రమే

కోటి బహుమతి కోసం ఎక్స్‌తో జోడీ… కట్ చేస్తే కాటికి తీసుకెళ్ళే ట్విస్ట్… సీక్రెట్ క్లబ్‌లో హారర్ మిస్టరీ

బైక్ పై ఇద్దరమ్మాయిల రచ్చ… అదిరిపోయే రోడ్ ట్రిప్ డ్రామా… నెవర్ బిఫోర్ కథ

కామాంధులను శిక్షించడానికి రంగంలోకి దిగే రహస్య శక్తి… మృత్యుదేవత విలయతాండవం

ఇన్సూరెన్స్ కోసం ముసలోళ్ల ఇంటికెళ్తే ఇదేం అరాచకం భయ్యా ? ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హర్రర్ మూవీ

Big Stories

Advertisement
×