E-Paper
Advertisement

జూబ్లీహిల్స్, మాదాపూర్, బంజారాహిల్స్‌లో పన్నుల మోత.. క్యూర్ చట్టంలో సంచలన మార్పులు!

జూబ్లీహిల్స్, మాదాపూర్, బంజారాహిల్స్‌లో పన్నుల మోత.. క్యూర్ చట్టంలో సంచలన మార్పులు!
Advertisement

CUR Urban Act: స్వేచ్చ బ్యూరో: కోర్ అర్బన్ రీజయన్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు వర్తించేలా సరి కొత్తగా ఇటీవలే రూపకల్పన చేసి, ఇప్పటికే అసెంబ్లీ, గవర్నర్ ఆమోదం పొందిన కొత్త క్యూర్ చట్టాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంచి రోజు కోసం అన్వేషిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం తో కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో అమలవుతున్న మున్సిపల్ యాక్టు సుమారు ఏడు దశాబ్దాల క్రితం నాటికి కావటం, ప్రస్తుతం పెరిగిన పట్టణీకరణ, జనాభా, పౌర సేవల నిర్వహణలో ఆధునికత చోటుచేసుకోవటంతో ప్రభుత్వం ఈ క్యూర్ చట్టాన్ని తెరపైకి తీసుకువచ్చింది.

నోటిఫికేషన్ జారీ..

ఈ క్యూర్ చట్టం అమలుకు అన్ని రకాలుగా లైన్ క్లియర్ కావటంతో ఎప్పటి నుంచి అమలు చేయాలి? మంచి రోజు ఎపుడు? అన్న విషయంపై సర్కారు ఆలోచిస్తున్నట్లు ఉన్నతాధికారవర్గాల సమాచారం. రానున్న మూడు, నాలుగు రోజుల్లో క్యూర్ స్పెషలాఫీసర్, మున్సిపల్ శాఖ స్పెషల్ కార్యదర్శి జయేష్ రంజన్ ఈ మేరకు కొత్త క్యూర్ చట్టం అమలుకు ముహూర్తాన్ని నిర్ణయించి, నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలున్నట్లు తెలిసింది. ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తే పాలక వర్గం, అధికారగణం విధి నిర్వహణలో పారదర్శకత, జవాబుదారితనం పెరగనున్నాయి. ముఖ్యంగా పాలక మండలి పెద్దలు, సభ్యుల విధులు, పాలక మండలి నిడిచే విధి విధానాలు మరింత కఠినతరం కానున్నాయి.

పెరగనున్న ఆదాయం.. ప్రజలపై పన్నుల భారం

Advertisement

ఇటీవలే జీహెచ్ఎంసీలో విలీనం చేసిన 27 పట్టణ స్థానిక సంస్థల్లో మినహా మిగిలిన ప్రాంతాల నుంచి కార్పొరేషన్లకు భారీగా ఆదాయం పెరగనుంది. కానీ ఇప్పటికే భూమి ధరలు ఆకాశాన్నంటిన జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, రాయదుర్గం వంటి ప్రాంతాల్లో ఆస్తి పన్ను మరింత పెరిగే అవకాశముంది. ప్రస్తుతం క్యూర్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో రెండు రకాలుగా ప్రాపర్టీ ట్యాక్స్ ను వర్తింపజేస్తున్నారు. విలీనం చేసిన పట్టణ స్థానిక సంస్థల్లో క్యాపిటల్ వ్యాల్యూ విధానంతో ప్రాపర్టీ ట్యాక్స్ ను వసూలు చేస్తుండగా, పాత జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రాంతాల్లో రెంటల్ వ్యాల్యు ఆధారంగా బెంచ్ మార్క్ ట్యాక్స్‌ను వర్తింపజేస్తున్నారు. ఇపుడు యూనిఫామ్ గా మొత్తం క్యూర్ సిటీ పరిధిలో క్యూర్ చట్టం అమల్లోకి వస్తే, మొత్తం క్యూర్ పరిధిలోని అన్ని రకాల ఆస్తుల నుంచి క్యాపిటల్ వ్యాల్యూ ఆధారంగా రెసిడెన్షియల్, కమర్షియల్ పన్నులు వసూలు చేయనున్నారు.

మార్కెట్ వ్యాల్యూ ప్రకారం..

దీంతో హైదరాబాద్ నగరంతో పాటు మల్కాజ్ గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాత జీహచ్ఎంసీలోని ప్రాంతాల్లో కూడా ప్రాపర్టీ ట్యాక్స్ భారీగా పెరగనుంది. వీటిలో కమర్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ మరింత తడిసి మోపెడు కానుంది. ఈ కొత్త చట్టంలో రెంటల్ వ్యాల్యుూ ప్రాపర్టీ ట్యాక్స్ ను రద్దు చేసి క్యాపిటల్ వ్యాల్యూ ఆధారంగా పన్ను వర్తింపజేయనున్నట్లు సర్కారు స్పష్టంగా కొత్త చట్టంలో పేర్కొంది. సర్కారు ఇటీవలే భూముల మార్కెట్ వ్యాల్యూను సవరించి, పెంచి అమలు చేస్తున్న సంగతి తెల్సిందే. ఇపుడు మార్కెట్ వ్యాల్యూ ప్రకారం ట్యాక్స్ వర్తింపజేస్తే చెల్లింపుదారులపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశాలున్నాయి. దీనికి తోడు ప్రస్తుతం వాటర్ బిల్లులో జలమండలి వసూలు చేస్తున్న సీవరేజీ ఛార్జీలను జీహెచ్ఎంసీకి బదలాయించి, ప్రాపర్టీ ట్యాక్స్ లోనే కలిపి వసూలు చేయనున్నారు.

Advertisement

Also Read: నవ్వులు పూయిస్తున్న గోల్డెన్ భాగ్యం గ్లింప్స్!

రూ. 5 వేల కోట్ల దాటనున్న ట్యాక్స్ కలెక్షన్..

ప్రస్తుతం కోర్ అర్భన్ రీజియన్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు 28 లక్షల 80 వేల ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నెంబర్లు (టిన్ ) ఉన్నాయి. వీటిలో దాదాపు మూడున్నర లక్షల పీటిఐఎన్ లు కమర్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తుండగా, మిగిలిన ఆస్తుల యజమానులు రెసిడెన్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ ను చెల్లిస్తున్నట్లు సమాచారం. వీటి ద్వారా మూడు కార్పొరేషన్ల పరిధిలో గత ఆర్థిక సంవత్సరానికి (2025-26) కు సంబంధించి రూ.2558.80 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలైంది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2024-25)లో పాత జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు రూ. 2038.46 కోట్ల ట్యాక్స్ వసూలైన సంగతి తెల్సిందే.

పెరిగిన కలెక్షన్..

గత సంవత్సరం నవంబర్ 25వ తేదీన కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని 27 పట్టణ స్థాని సంస్థలను విలీనం చేయటంతో ఇటీవలే ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో వసూలైన రూ. 2558.80 తో అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (2024-25) ఆర్థిక సంవత్సరంలోని కలెక్షన్ రూ. 2038.46 కోట్లతో పోల్చితే తాజాగా సుమారు రూ. 520.34 కోట్ల కలెక్షన్ పెరిగింది. ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణ, అసెంబ్లీ, గవర్నర్ ఆమోదం పొంది సర్కారు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న కొత్త క్యూర్ చట్టం అమల్లోకి వస్తే మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కు ఒక్క ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారానే సుమారు రూ. 5 వేల కోట్ల ఆదాయం సమకూరే విధంగా కొత్త చట్టంలో నిబంధనలున్నాయి.

విలీన ప్రాంతాల్లోని ఆస్తులపై జీఐఎస్ సర్వే .

జీహెచ్ఎంసీ పీకల దాక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవటంతో ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను అన్వేషించిన జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు మూడేళ్ల క్రితం జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న సుమారు 17 లక్షల రెసిడెన్షియల్ ఆస్తులతో పాటు మరో రెండున్నర లక్షల కమర్షియల్ ఆస్తులకు ఎలాగో ట్యాక్స్ ను పెంచే పరిస్థితి లేకపోవటంతో ఆస్తులపై నియో జియో సంస్థ ద్వారా జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సర్వే (జీఐఎస్) ను నిర్వహించింది. దాదాపు అన్ని ఆస్తులకు ఈ సర్వేను పూర్తి చేశారు. దీని వల్ల గతంలో నిర్మాణ అనుమతులు తీసుకున్న భవనాల్లో అదనపు అంతస్తులు, రెసిడెన్షియల్ అనుమతులు తీసుకుని కమర్షియల్ కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు టెక్నికల్ గా రుజువైంది. దీంతో సదరు ఆస్తుల యజమానులకు జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసి, ఆ భవనాల అదనపు అంతస్తులు, అక్రమ వినియోగానికి సంబంధించి ట్యాక్స్ ను సవరించగా, జీహెచ్ఎంసీకి అదనంగా వంద కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది.

ఆస్తులపై జీఐఎస్ సర్వే..

కొత్త క్యూర్ చట్టం అమల్లోకి రాగానే విలీనం చేసిన 27 పట్టణ స్థానిక సంస్థల్లోని ఆస్తులపై కూడా జీఐఎస్ సర్వే నిర్వహించాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ పట్టణ స్థానిక సంస్థల్లో రెసిడెన్షియల్ అనుమతులు తీసుకుని, కమర్షియల్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు, చాలా ప్రాంతాల్లో అసలు అనుమతుల్లేకుండా నిర్మించి, వాటిలో కమర్షియల్ కార్యకపాలు కొనసాగిస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించినట్లు తెలిసింది. ఇలాంటి ఆస్తులపై కూడా సర్వే నిర్వహించి, చెల్లిస్తున్న పన్నును సవరిస్తే మూడు కార్పొరేషన్లకు అదనంగా రూ. వెయ్యి కోట్ల వరకు ట్యాక్స్ కలెక్షన్ అవుతుందని అధికారులు లెక్కలేస్తున్నారు. కొత్త క్యూర్ చట్టం అమల్లోకి రాగానే, విలీన ప్రాంతాల్లోని ఆస్తులపై జీఐఎస్ సర్వే మొదలుపెట్టేందుకు మూడు మున్సిపల్ కార్పొరేషన్లు సిద్దంగా ఉన్నట్లు సమచారం.

హైడ్రాకు చట్టబద్దత

ప్రస్తుతం క్యూర్ సిటీ పరిధిలో సర్కారు ఆస్తులైన చెరువులు, కుంటలు, లే ఔట్లలో ప్రజావసరాల కోసం కేటాయించిన స్థలాల పరిరక్షణ కోసం ఏర్పాటై, ఆశించిన స్థాయిలో పని చేస్తున్న హైడ్రాకు క్యూర్ బిల్లు అమలుతో మరిన్ని అధికారాలు సమకూరే అవకాశాలున్నాయి. అంతేగాక, ఈ బిల్లులో హైడ్రాకు చట్టబద్ధతను కూడా కల్పించనున్నారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు చట్టబద్దతో హైడ్రాకు మర్నిని కీలకమైన బాధ్యతలను అప్పగించనున్నారు. ఆహార భద్రత, విపత్తుల నిర్వహణ, ట్రాఫిక్ కంట్రోల్, వారసత్వ సంపద పరిరక్షణ వంటి విధులు ఇతర సంస్థలు వేర్వేరుగా విధులు నిర్వర్తించనున్నాయి. ఇప్పటికే టీజీ సేవ్ ను ఏర్పాటు చేసి, జీహెచ్ఎంసీ లోని ఫుడ్ ఇన్ స్పెక్టర్లు, ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్లను టీజీ సేవ్ లో విలీనం చేసిన సంగతి తెల్సిందే. మున్ముందు అవసరాలకు తగిన విధంగా ఇతర శాఖల పవర్స్ కట్ చేసి హైడ్రాకు అప్పించేలా ఈ చట్టంలో నిబంధనలను పొందుపరిచారు.

Aso Read: తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల రగడ.. బీజేపీలో టికెట్ ఆశించే నాయకుల లిస్ట్ ఇదే?

Tags

Related News

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల రగడ.. బీజేపీలో టికెట్ ఆశించే నాయకుల లిస్ట్ ఇదే?

చెల్లెనే కాదు.. తల్లి, భార్యనూ అవమానించారు..! బీఆర్‌ఎస్‌ను బొందపెట్టేందుకు మీరిద్దరు చాలు..! ఇంకెవరూ అసవరం లేదు..

దానం నాగేందర్‌కు ఉహించని షాక్.. రివేంజ్ తీర్చుకునేందుకు బీఆర్ఎస్ బిగ్ స్కెచ్!

కేసీఆర్‌లా పంచు డైలాగులు కొట్టబోయి.. విమర్శల పాలైన కేటీఆర్‌! ఆయన మందలింపు మాటలనూ ఎంజాయ్‌ చేస్తారు…మీరంటే ఎగతాళి చేస్తారు!

క్షుద్ర రాజకీయాలిక్కడ.. చేతబడుల దాడులు అక్కడ..! రాజకీయాల కోసం నేతలే మూఢనమ్మకాలను పట్టుకు వేలాడుతుంటే..

రాముడి యుగం నాటి దివ్య వృక్షం.. విజయవాడలో ప్రత్యక్షం!

ఎమ్మెల్యేలను నెత్తినపెట్టుకుని పెద్ద తప్పు చేశాం..! కేసీఆర్ చేసిన పెద్ద పొరపాటిదే..! కేటీఆర్‌ కామెంట్స్‌ వెనుక మర్మమేమిటీ? పాతకాపులకిక చెక్?

Big Stories

Advertisement
×