E-Paper
Advertisement

భర్త, ప్రాణ స్నేహితురాలు కలిసి చంపేశారు… గతంలోకి వెళ్ళిన భార్య వాళ్లకే పెళ్లి చేయాలనుకుంటే ? అదిరిపోయే కొరియన్ రివెంజ్ డ్రామా

భర్త, ప్రాణ స్నేహితురాలు కలిసి చంపేశారు… గతంలోకి వెళ్ళిన భార్య వాళ్లకే పెళ్లి చేయాలనుకుంటే ? అదిరిపోయే కొరియన్ రివెంజ్ డ్రామా
Advertisement

Korean Revenge Drama OTT : మన జీవితంలో బాగా నమ్మిన ఇద్దరు వ్యక్తులే వెన్నుపోటు పొడిస్తే ఆ బాధను మాటల్లో చెప్పడం కష్టం. భర్త, ప్రాణ స్నేహితురాలు కలిసి మోసం చేయడమే కాకుండా, ఆ మోసానికి బలైన మహిళ ప్రాణాలే పోతే… ఆమెకు మళ్లీ గతంలోకి వెళ్లి తన జీవితాన్ని మార్చుకునే అవకాశం వస్తే… ఈసారి బాధితురాలిగా మిగిలిపోకుండా, తనను మోసం చేసిన వారే తమ నిర్ణయాల ఫలితాన్ని ఎదుర్కొనేలా చేయాలని ఆమె అనుకుంటుంది. ప్రతీకారం, ప్రేమ, విధి వంటి ఇంట్రెస్టింగ్ అంశాలన్నీ కలిపి తీసిన కొరియన్ ఫాంటసీ డ్రామా ‘మ్యారీ మై హస్బెండ్’ (Marry My Husband).

కథలోకి వెళ్తే…

కాంగ్ జీ-వోన్ జీవితంలో ఎదురయ్యే విషాదం ఆమెను పూర్తిగా కుంగదీస్తుంది. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో తన భర్త పార్క్ మిన్-హ్వాన్, తనకు అత్యంత సన్నిహితురాలైన జంగ్ సూ-మిన్ మధ్య అక్రమ సంబంధం ఉందని తెలుసుకుంటుంది. ఈ విషయం బయట పడిన తర్వాత జరిగే ఘర్షణలో జీ – వోన్ హత్యకు గురవుతుంది. తనను ప్రేమించాల్సిన భర్త, నమ్మకంగా ఉండాల్సిన స్నేహితురాలే తన జీవితాన్ని నాశనం చేశారనే బాధ ఆమెను వెంటాడుతుంది.

Advertisement

అయితే కథ అక్కడితో ముగియదు. జీ-వోన్ పదేళ్లు వెనక్కి వెళ్లి, గతంలో తనకు జరిగిన సంఘటనలకు ముందు ఉన్న కాలంలో మళ్లీ మేల్కొంటుంది. తనకు రెండో అవకాశం దొరికిందని గ్రహించిన ఆమె, ఈసారి గతంలో చేసిన తప్పులను పునరావృతం చేయకూడదని నిర్ణయించుకుంటుంది. తనను మోసం చేసిన వారిని నేరుగా ఎదుర్కోవడమే కాకుండా, వారి భవిష్యత్తు నిర్ణయాలను మార్చే ప్రణాళిక వేస్తుంది.

ఈ ప్రయాణంలో యూ జీ-హ్యోక్ ఆమెకు అండగా నిలుస్తాడు. కార్యాలయంలో ఉన్నత స్థాయిలో పని చేసే అతడు జీ-వోన్‌ ను అర్థం చేసుకుంటాడు. ఇద్దరి మధ్య నమ్మకం పెరిగేకొద్దీ, జీ-వోన్‌ కు తన జీవితాన్ని కొత్తగా నిర్మించుకునే ధైర్యం వస్తుంది. అయితే గతాన్ని మార్చడం అనుకున్నంత సులభం కాదు. ఒక సంఘటన మారితే దాని ప్రభావం మరెన్నో జీవితాలపై పడవచ్చు. జీ-వోన్ తన ప్రతీకారాన్ని అమలు చేస్తూనే తనకు నిజంగా కావాల్సిన జీవితం ఏమిటో కూడా తెలుసుకోవాల్సి వస్తుంది. తనను చంపిన వారికి వాళ్ళు చేసిన తప్పులకు ఫలితం ఎలా ఉంటుందో చూపించగలదా ? రెండో అవకాశం ఆమెకు కొత్త ప్రేమను అందిస్తుందా ? గతాన్ని మార్చే క్రమంలో ఆమె ఊహించని సమస్యల్లో చిక్కుకుంటుందా ? ఈ ప్రశ్నలకు సమాధానంగా కథ ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది.

ప్రైమ్ వీడియోలో తెలుగులో ఉందా ?

Advertisement

పార్క్ వోన్-గుక్ (Park Won-kook) దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో పార్క్ మిన్-యంగ్ (Park Min-young), నా ఇన్-వూ (Na In-woo), లీ యి-క్యుంగ్ (Lee Yi-kyung), సాంగ్ హా-యూన్ (Song Ha-yoon) నటించారు. ‘మ్యారీ మై హస్బెండ్’ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం తెలుగు ఆడియో లేదు.

Related News

దెయ్యాలనే నమ్మని యువతికి దడుచుకునే ట్విస్ట్… మస్ట్ వాచ్ హారర్ మిస్టరీ థ్రిల్లర్

హత్య వెనకున్న మతిపోగొట్టే మిస్టరీ… ఉత్కంఠ రేపుతున్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ సీజన్ 24

తీగ తెగితే ప్రాణాలు పైకే… రియల్ లైఫ్ కేబుల్ కార్ ఇన్సిడెంట్… నరాలు కట్టయ్యే ట్విస్టులున్న సర్వైవల్ డాక్యుమెంటరీ

దెయ్యాల వేట – హాంటెడ్ స్కూల్… ఈ వారం ఓటీటీలోకి వచ్చిన 4 హారర్ సినిమాలు, సిరీస్‌లు… తెలుగులో ఎన్ని చూడొచ్చంటే ?

పదేళ్లుగా ఇంట్లోంచి బయటకు రాని రచయిత్రి… కిల్లర్ కు తనను తానే ఎరగా వేసుకునే సాహసం… బుర్రపాడు సైకలాజికల్ థ్రిల్లర్

బాక్సింగ్ రింగ్‌లో ప్రపంచాన్ని వణికించిన మైక్ టైసన్… కట్ చేస్తే వివాదాలు, జైలు జీవితం, పతనం

అవయవ మార్పిడితో ఐదుగురిలో ఊహించని సూపర్ పవర్స్… క్రేజీ కొరియన్ సూపర్‌హీరో అడ్వెంచర్

Big Stories

Advertisement
×