Telangana Gratuity: ఉపాధి హామీ పథకం ఎఫ్‌టీఈ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం దసరా కానుక ప్రకటించింది. రాష్టంలో ఉన్న 3,800 మంది ఉద్యోగులకు గ్రాట్యుటీతో ఆర్థిక భరోసా కల్పించనుంది. గ్రాట్యుటీ మంజూరు చేస్తూ సర్కార్ జీవో జారీ చేసింది. మంత్రి సీతక్క చొరవతో 20 ఏళ్ల ఉద్యోగుల పోరాటానికి ఫలితం లభించినట్టైంది. వీరికి రిటైర్మెంట్ సమయంలో కనీసం రూ.4 లక్షల గ్రాట్యుటీ వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
పదేళ్ల సర్వీసు పూర్తిచేసే ఉద్యోగులకు కనీసం రూ.10 లక్షల వరకు ప్రయోజనం చేకూనుంది. ఎఫ్‌టీఈల 20 ఏళ్ల కలను సాకారం చేసిన మంత్రి సీతక్కకు ఉద్యోగుల సంఘం కృతజ్ఞతలు తెలిపారు. గ్గ్రాట్యుటీ ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ధన్యవాదాలు ఎఫ్టీఈలు తెలిపారు. దీంతో ఉద్యోగుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి సీతక్క అన్నారు.
రాష్ట్రంలో ఉద్యోగుల హక్కులు, ఆత్మగౌరవానికి మా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపుతున్నామని, రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు పడకూడదన్నదే మా సంకల్పం అని మంత్రి సీతక్క అన్నారు. కష్టపడి పనిచేసిన ఉద్యోగులకు జీవిత చరమాంకంలో ఆర్థిక భద్రత కల్పించడం మా బాధ్యత అని మంత్రి సీతక్క కొనియాడారు.
Also read: హత్య వెనకున్న మతిపోగొట్టే మిస్టరీ… ఉత్కంఠ రేపుతున్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ సీజన్ 24