OTT Movie : బెంగళూరు లోని చామరాజ్‌పేట్, మిడిల్-క్లాస్ జీవితాల సందడితో నిండి ఉంటుంది. సతీష్ అతని చిన్ననాటి స్నేహితులు, తమ కలలను సాకారం చేసుకోవాలనే ఆశతో అడుగులు వేస్తుంటారు. ఒక రోజు రాత్రి, సతీష్ పుట్టినరోజు సంబరాలు వీళ్ళ జీవితాలను శాశ్వతంగా మార్చేస్తాయి. ఒక రోడ్ యాక్సిడెంట్ లో సతీష్ ప్రాణాలు కోల్పోతాడు. ధనవంతుడైన బ్రాట్స్ నడిపిన కారు వల్ల ఈ ప్రమాదం జరుగుతుంది. ఈ దుర్ఘటన వెనుక న్యాయం కోసం సతీష్ స్నేహితులు పోరాడుతారు. ధనవంతులతో వీళ్ళు ఎలా పోరాడుతారు ? వాళ్ళ అహంకారం ముందు మిడిల్-క్లాస్ గౌరవం నిలబడగలదా? ఈ ప్రతీకారం వారి జీవితాలను ఎలా మారుస్తుంది? ఈ మూవీ పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలు తెలుసుకుందాం ..
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ బెంగళూరు లోని చామరాజ్‌పేట్‌లోని మిడిల్-క్లాస్ నేపథ్యంలో జరుగుతుంది. సూరి, మంజా, సతీష అనే ముగ్గురు బాల్య స్నేహితులు, వారి రోజువారీ జీవితంలో కష్టాలను ఎదుర్కొంటూ, కలలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. సూరి ఒక రాజకీయ పార్టీ వర్కర్, కార్పొరేటర్ కావాలనే ఆశతో ఉంటాడు. మంజా క్యాబ్ డ్రైవర్, సొంత కారు కొనాలని డబ్బు ఆదా చేస్తాడు. సతీష్ ఫుడ్ డెలివరీ బాయ్ గా చేస్తూ, అప్పులు తీర్చడానికి కష్టపడుతూ ఉంటాడు. తన సోదరి లక్ష్మితో (తేజు బెళవాడి) కలిసి జీవిస్తుంటాడు. మంజా మాత్రం సతీష్ చెల్లెలు లక్ష్మి ని ప్రేమిస్తుంటాడు. ఒక రోజు సతీష్ పుట్టినరోజు సంబరాల కోసం ముగ్గురూ బయటకు వెళతారు. అయితే అదే రాత్రి ఒక రోడ్ యాక్సిడెంట్‌లో సతీష్ ప్రాణాలు కోల్పోతాడు.
ఈ యాక్సిడెంట్‌కు కారణం రాకీ (ప్రభు ముంద్కూర్), PK (శ్రవణ్ కుమార్), నిఖిల్ (హరిహరన్), షెట్టి (షైన్ శెట్టి) అనే ధనవంతులైన యువకులు. మద్యం మత్తులో కారు నడిపి సతీష్‌ను ఢీకొడతారు. సూరి మొదట్లో డబ్బుల కోసం రాజీకి సిద్ధపడినప్పటికీ, రిచ్ బ్రాట్స్ వారిని అవమానించడం, న్యాయ వ్యవస్థను తమ అధీనంలో ఉంచుకోవడం వల్ల సూరి, మంజా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటారు. ఈ చిత్రం మిడిల్-క్లాస్ జీవితాలను రిలేటబుల్‌గా చూపిస్తూ, డ్రంక్ డ్రైవింగ్ వల్ల కలిగే విషాదాలను హైలైట్ చేస్తుంది. చివరికి సతీష్ చావుకు సూరి, మంజా ఎలా ప్రతీకారం తీర్చుకుంటారు ? రాకీ బృందం ఎలా రియాక్ట్ అవుతుంది? న్యాయ వ్యవస్థ ధనవంతులకు ఎలా అనుకూలంగా పనిచేస్తుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : వర్షం పడితే అమ్మాయిల్ని చంపే సైకో … శవాలని కూడా వదలకుండా … ఇదెక్కడి అరాచకం మావా
ఏ ఓటీటీలో ఉందంటే
ఈ రెవేంజ్ కన్నడ డ్రామా మూవీ పేరు ‘మర్యాద ప్రశ్నే’ (Maryade Prashne). 2024 నవంబర్ 22 న థియేట్రికల్ రిలీజ్ అయిన ఈ సినిమాకు నాగరాజ్ సోమయాజి దర్శకత్వం వహించారు. ఇందులో రాకేష్ అదిగా (సూరి, రాజకీయ పార్టీ వర్కర్, కార్పొరేటర్ కావాలనే ఆశతో),పూర్ణచంద్ర మైసూరు (మంజా, క్యాబ్ డ్రైవర్),సునీల్ రావ్ (సతీష్, ఫుడ్ డెలివరీ బాయ్)తేజు బెళవాడి (లక్ష్మి, సతీష్ సోదరి, మంజా ప్రేమికురాలు) ప్రభు ముంద్కూర్ (రాకీ, రిచ్ బ్రాట్, యాంటగనిస్ట్) షైన్ శెట్టి (షెట్టి, రిచ్ బ్రాట్) ప్రధాన పాత్రల్లో నటించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ అందుబాటులో ఉంది.