BigTV English

OTT Movie : వే*శ్య తో ఫ్రెండ్ మర్డర్ కి పక్కా ప్లాన్ … స్నేహితుడి చావుకి రివేంజ్ స్కెచ్ … మైండ్ బ్లాక్ చేసే మిడిల్ క్లాస్ ఎంటర్టైనర్

OTT Movie : వే*శ్య తో ఫ్రెండ్ మర్డర్ కి పక్కా ప్లాన్ … స్నేహితుడి చావుకి రివేంజ్ స్కెచ్ … మైండ్ బ్లాక్ చేసే మిడిల్ క్లాస్ ఎంటర్టైనర్

OTT Movie : ఓటీటీ లో భాషతో సంబంధం లేకుండా, అన్నిరకాల జనర్ల లో వస్తున్న సినిమాలను చూస్తున్నారు ప్రేక్షకులు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఈ సినిమా మిడిల్ క్లాస్ కష్టాలకు దగ్గరగా ఉంటుంది. చాలీ చాలని జీతం, తీరని అప్పులు, ఇలా మనిషిని ఒక్కసారిగా కదిలిస్తుంది. ఇంతలోనే అనుకోని ట్విస్ట్ లు కూడా వస్తాయి. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ కన్నడ రివేంజ్ డ్రామా మూవీ పేరు ‘మర్యాదే ప్రశ్నే’ (Maryade Prashne). 2024 లో విడుదలైన ఈ మూవీకి నాగరాజ్ సోమయాజి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రాకేష్ అడిగా, సునీల్ రావ్, పూర్ణచంద్ర మైసూర్, తేజు బెలవాడి, ప్రభు ముండ్కూర్, రేఖ కుడ్లిగి వంటి నటులు నటించారు. ఇది బెంగళూరులోని చామ్‌రాజ్‌పేట్‌లోని మధ్యతరగతి నేపథ్యంలో తెరకెక్కింది. ఈ మూవీ ముగ్గురు స్నేహితులు సూరి, మంజా, సతీష్ చుట్టూ తిరుగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ 2025, ఫిబ్రవరి, 7 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

ఒక రాజకీయ పార్టీ కార్యకర్త గా సూరి అనే వ్యక్తి ఉంటాడు. ఇతనికి కార్పొరేటర్ కావాలనే ఆశ ఉంటుంది. మంజా క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తూ, సొంత కారు కొనాలని కలలు కంటాడు. సతీష్, లక్ష్మీతో ప్రేమలో ఉంటాడు. సతీష్ ఒక ఫుడ్ డెలివరీ బాయ్ గా చేస్తూ, అప్పులు తీర్చడానికి కష్టపడుతుంటాడు. ఈ ముగ్గురి స్నేహితుల జీవితాలు సాధారణంగా సాగుతుండగా, సతీష్ పుట్టినరోజు వేడుక సందర్భంగా ఒక దురదృష్టకర సంఘటన జరుగుతుంది. రాకీ అనే ఒక పెద్ద ధనవంతుడి కొడుకు నడిపిన కారు వారిని ఢీకొట్టడంతో, సతీష్ ఒక రోడ్డు ప్రమాదంలో మరణిస్తాడు. ఈ దుర్ఘటన సూరి, మంజాలను ఎక్కువగా బాధపెడుతుంది. వారు సతీష్ కుటుంబానికి న్యాయం చేయాలని నిర్ణయిస్తారు. మొదట సూరి రాజీ కోసం ఆలోచిస్తాడు.  డబ్బు సహాయం సతీష్ కుటుంబానికి ఉపయోగపడుతుందని భావిస్తాడు.

కానీ రాకీ, అతని స్నేహితులు అహంకారంతో వారిని అవమానిస్తారు. ఇది సూరి, మంజాలకు బాగా కోపం తెప్పిస్తుంది. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటారు. ఇంతలో రాకీ తన ఫ్రెండ్ ని డబ్బుకోసం వేశ్య తో మర్డర్ చేపిస్తాడు. వయాగ్రా ఎక్కువగా తీసుకోవడంతో అతను చనిపోతాడు. ఎవరికీ తెలీదనుకునే లోపు, ఈ విషయం సూరికి తెలుస్తుంది. ఆ తరువాత వాళ్ళను సూరి, మంజా వెంబడిస్తూ రివేంజ్ కి పక్కా ప్లాన్ వేస్తారు. చివరికి సతీష్ చావుకి సూరి, మంజా ప్రతీకారం తీర్చుకుంటారా ? అతని కుటుంబానికి అండగా ఉంటారా ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ రివేంజ్ డ్రామా సినిమాని మిస్ కాకుండా చూడండి.

Read Also : ప్రాంక్ లతో చిక్కుల్లో పడే స్నేహితులు … ‘మ్యాడ్’ లాంటి హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×