BigTV English

Best Web Series: భర్త కళ్ల ముందే అందరితో పడుకొనే భార్య.. గతం మరిచిపోతే? హత్యకు కుట్ర పన్నేది ఎవరు?

Best Web Series: భర్త కళ్ల ముందే అందరితో పడుకొనే భార్య.. గతం మరిచిపోతే? హత్యకు కుట్ర పన్నేది ఎవరు?

కొన్ని స్పానిష్ వెబ్ సీరిస్‌లు భలే ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. మనీ హీస్ట్, లాక్డ్ అప్, ఎలైట్, ఫేక్ ప్రొఫైల్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే అవుతుంది. తాజాగా Netflix ఓటీటీలో రిలీజ్ అయిన Medusa వెబ్ సీరిస్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా స్పైసీ సీన్లను ఇష్టపడేవారికి ఇది పండగలాంటి వెబ్ సీరిస్. మసాలా సీన్ల గురించి పక్కన బెడితే ఈ సీరిస్ భలే థ్రిల్‌గా.. సస్సెన్స్‌తో ఒక ఫ్లోలో సాగిపోతుంటుంది.


ఈ కొలంబియన్ థ్రిల్లర్ సీరిస్ నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 5, 2025 నుండి స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మొత్తం 12 ఎపిసోడ్‌లతో రూపొందిన ఈ సిరీస్.. కార్పొరేట్ డ్రామా, ఫ్యామిలీ సీక్రెట్స్, సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలను మేళవించి ప్రేక్షకులకు ఒక ఆసక్తికర అనుభవాన్ని ఇస్తుంది. కొలంబియాలోని రన్‌క్విల్లా నగరంలో ఈ సీరిస్‌ను తెరకెక్కించారు. కథాపరంగానే కాదు.. విజువల్స్ కూడా పిచ్చెక్కిస్తాయి. మరి కథలోకి వెళ్లిపోదామా.

కథ:
సీన్ స్టార్టింగ్‌లోనే.. బార్బరా హిడాల్గో (Juana Acosta) అనే మహిళా వ్యాపారవేత్త తన సొంత బోటులో ఒంటరిగా విహరిస్తూ కనిపిస్తుంది. ఆమె వైబ్రేటర్‌తో స్వయంతృప్తి పొందున్న సమయంలో ఒక్కసారిగా బోటు పేలిపోతుంది. దీంతో ఆమె నీటిలోకి దూకి ప్రాణాలు రక్షించుకొనే ప్రయత్నం చేస్తుంది. అయితే, ఇద్దరు దుండగులు నీటిలోకి దూకి.. ఆమె వేలును కట్ చేసి ఉంగరాన్ని దొంగిలిస్తారు. నీటిలో మునిగి చనిపోతున్న ఆమెను ఓ మంత్రగత్తె రక్షిస్తుంది. ఆ తర్వాత ఆమెకు వైద్యం అందిస్తుంది. బోటు పేలుడు ఘటనలో బార్బరా చనిపోయిందని భావించి కుటుంబ సభ్యులు ఆమెకు అంత్యక్రియలు చేస్తారు. అయితే, ఆమె కుటుంబంలోనే ఎవరో ఆమెను చంపేందుకు ప్రయత్నించి ఉంటారనే అనుమానం కలుగుతుంది. కానీ, ఎవరికి ఆమె మరణం వల్ల లాభం జరుగుతుంది అనేది మాత్రం సస్పెన్సే.


కొద్ది రోజులు గడిచిన తర్వాత బార్బరా బతికి ఉన్న విషయం తెలుస్తుంది. ఆమెను ఇంటికి తీసుకొస్తారు. అయితే.. ఆమె గతం మరిచిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు. కానీ, అందరిలో ఏదో టెన్షన్. మరోవైపు బార్బరాకు కూడా ఏమీ అర్థం కాదు. తాను Medusa అనే వ్యాపార సామ్రాజ్యానికి సీఈవోగా ఉన్నట్లు తెలుసుకుంటుంది. కానీ, ఆమె మరణ వార్త తర్వాత ఆ బాధ్యతలు ఆమె తమ్ముడికి దక్కుతాయి. కానీ, బార్బరాకు చాలా విషయాలు గుర్తుండవు. తనతో ఉన్న వ్యక్తులు ఎలాంటివారు? తనతో ఎలా ప్రవర్తించేవారు అనేది తెలియక స్నేహంగా ఉంటుంది. మరోవైపు అనుమానంతో వారి గురించి తెలుసుకొనే ప్రయత్నం చేస్తుంటుంది. చివరి తన భర్త, తమ్ముడిని కూడా అనుమానిస్తుంది. అలాగే.. తన క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకొనే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే.. ఆమెకు మధ్య మధ్యలో కొంతమంది వ్యక్తులతో శరీరక సంబంధాలు ఉన్నట్లు ఫ్లాష్ అవుతూ ఉంటుంది. కానీ, తాను ఎందుకు అలా చేసిందనే విషయం ఆమెకు గుర్తుండదు. పూర్తిగా కొత్త జీవితాన్ని గడుపుతుంది.

అదే సమయంలో ఆమె బోట్ పేలుడు ఘటన దర్యాప్తు చేస్తున్న డిటెక్టివ్ డేంజర్ కార్మెలో (Manolo Cardona)తో పరిచయం ఏర్పడుతుంది. బోటును కావాలనే ఎవరో పేల్చారని కార్మె ఆమెకు చెబుతాడు. దీంతో అప్పటి నుంచి ఆమె తన ఫ్యామిలీలో అందరినీ అనుమానిస్తుంది. దర్యాప్తు క్రమంలో బార్బరాకు.. కార్మెకు మధ్య ప్రేమ చిగురిస్తుంది. దీంతో ఇద్దరూ శరీరకంగానూ దగ్గర అవుతారు. అయితే, బార్బరా గురించి నిజాలు తెలిసే కొద్ది.. కార్మేకు దిమ్మ తిరగడం మొదలవుతుంది. అసలు బార్బరా ఎవరు? ఆమె గతం ఏమిటనేది చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఆమె భర్త ఎదురుగానే కొంతమంది పురుషులతో శరీరకంగా దగ్గర కావడం, ఆమెకు కుటుంబ సభ్యులంతా భయపడటం ఇలా.. కొన్ని సన్నివేశాలు మధ్య మధ్యలో వస్తుంటాయి. చివరికి ఆమె ఎవరు, ఆమెను ఎవరు చంపాలని అనుకున్నారు అనేది నెమ్మది నెమ్మదిగా రివీల్ అవుతుంది.

Also Read: ఏం ఎలివేషన్ ఇచ్చారు భయ్యా వీడికి.. ఆ సీన్ చూస్తే గూజ్‌బంప్సే, బలంతో కాదు బుద్ధితో కొడతాడు!

విశ్లేషణ:
‘మెడూసా’ వెబ్ సీరిస్‌లో ప్రధాన ఆకర్షణ.. సినిమాటోగ్రఫీ. అలాగే నటీనటులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. నటి జువానా అకోస్టా.. బార్బరా పాత్రలో లీనమైందని చెప్పవచ్చు. మొదట్లో ఆమె చాలా అమాయకంగా, అయోమయంలో ఉన్న మహిళగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఎంతో స్ట్రాంగ్‌గా, ప్రమాదకరమైన స్త్రీగా కనిపిస్తుంది. మనోలో కార్డోనా డిటెక్టివ్‌ పాత్రకు న్యాయం చేశాడు. ఆమె భర్తగా నటించిన సెబాస్టియన్ మార్టినెజ్… ఎస్టీబన్‌ పాత్రలో చక్కని నటన కనబరిచారు. ఆయన పాత్ర చాలా అనుమానాలు రేకెత్తించేలా ఉంటుంది. ఏదో దాస్తున్న విషయాన్ని ఆయన తన హవభావాలతో చూపిస్తాడు. సస్పెన్సులు, ట్వీస్టులకు ఈ కథలో లోటే ఉండదు. అలాగే, స్పైసీ సీన్లు ఇష్టపడేవారికి ఈ సీరిస్ బాగా నచ్చుతుంది. ప్రతి ఎపిసోడ్‌లో రెండు మూడు.. అలాంటి సీన్లు ఉంటాయి. ముఖ్యంగా డిటెక్టి్వ్‌గా రొమాన్స్ సీన్ రక్తికట్టిస్తుంది. అయితే, కొన్ని రొమాంటిక్ సీన్లను కావాలనే ఇరికించారా అనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే, స్టోరీలో కొన్ని సీన్లను మనమే ముందే ఊహించేస్తాం. క్లైమాక్స్ కూడా వీక్ అనిపిస్తుంది. కార్పొరేట్ థ్రిల్లర్స్, ఫ్యామిలీ డ్రామాలు, సస్పెన్స్ కథలు ఇష్టపడే ప్రేక్షకులకు ఇది బాగా నచ్చుతుంది. ఇందులో రొమాంటిక్ ఎలిమెంట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ఉంటాయి.

Tags

Related News

OTT Movie : స్కూల్ నుంచి తిరిగొచ్చేలోపు బాయ్ ఫ్రెండ్ తో తల్లి… వాడిచ్చే ట్విస్టుకు వణుకు పుట్టాల్సిందే మావా

OTT Movie : మర్డర్ మిస్టరీకి టేస్టీ ఫుడ్ టచ్… కొరియన్ మూవీ లవర్స్ కు కన్నుల పండుగ ఈ సిరీస్

OTT Movie : చనిపోయిన భార్యతో కనెక్ట్ అవ్వడానికి అలాంటి పని… నెక్స్ట్ ట్విస్టుకు గుండె గుభేల్… స్పైన్ చిల్లింగ్ హర్రర్ మూవీ

OTT Movie : అమ్మాయిలతో ఆ పాడు పని చేసి హత్య చేసే కిల్లర్… 6 నెలల తరువాత ఓటీటీలోకి… కానీ చిన్న ట్విస్ట్

OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సినిమాల సందడి..మూవీ లవర్స్ కు పండగే..!

OTT Movie : కళ్ళు కన్పించని కన్నిబలిస్టిక్ జీవులు… ట్రిప్పుకెళ్లి అడ్డంగా బుక్కయ్యే గ్రూప్… ఒళ్ళు జలదరించే సీన్స్

OTT Movie : కాబోయే భర్తను చంపే పెళ్లికూతురు… పెళ్లికి ముందే దెయ్యం పట్టి పిచ్చి పనులు… కలలోనూ వెంటాడే సీన్స్

OTT Movie : అమ్మాయికి వింత జబ్బు… పనిష్మెంట్ పేరుతో ఆఫీసర్ అరాచకం… ఫ్యామిలీతో చూడకూడని మూవీ

Big Stories

×