BigTV English

OTT Movie : రాత్రిపూట గోర్లు కట్ చేసుకుంటే ఈ దెయ్యానికి బలి… చలికాలంలో కూడా చెమటలు పట్టించే హర్రర్ మూవీ

OTT Movie : రాత్రిపూట గోర్లు కట్ చేసుకుంటే ఈ దెయ్యానికి బలి… చలికాలంలో కూడా చెమటలు పట్టించే హర్రర్ మూవీ

OTT Movie : ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా, దెయ్యాల కథలు ప్రచారంలో ఉంటాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో విజిల్ వేయడం, గోర్లు కత్తిరించడం లాంటివి చేయకూడదని పెద్దలు చెప్తుంటారు. ఈ నియమాలతో ఒక ఇండొనేషియన్ హారర్ మూవీ ఓటీటీలో భయపెట్టిస్తోంది. ఈ సినిమాలో ఇలా చేయడం వల్ల ఆత్మలు ఘోరంగా వెంటాడుతాయి. ఈ సినిమాను చూస్తే భయంతో వణికిపోతారు. అంతలా భయపెట్టే సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

ఈ ఇండోనేషియన్ హారర్ మూవీ పేరు ‘పమాలి: దుసున్ పోకాంగ్’ (Pamali: The Corpse Village). 2023లో విడుదలైన ఈ సినిమాకు బాబీ ప్రసేత్యో దర్శకత్వం వహించారు. ఈ మూవీ ‘The Tied Corpse’అనే వీడియో గేమ్ ఆధారంగా రూపొందింది. 2022లో విడుదలైన పమాలి చిత్రానికి సీక్వెల్‌గా వచ్చింది. ఇందులో ఫజర్ నుగ్రా, యాస్మిన్ జాసెమ్, డియా పనేంద్రా, అర్లా ఐలానీ, అనంత్య కిరణ, బుకీ బి. మన్సూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. 97 నిమిషాల రన్‌ టైమ్ ఉన్న ఈ సినిమాకి, IMDB లో 6.1/10 రేటింగ్ ఉంది. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

కథ ఇండోనేషియాలో ఉండే ఒక మారుమూల గ్రామంలో జరుగుతుంది. ఈ గ్రామంలో ఉండే ప్రజలు ఒక వింత వ్యాధితో బాధపడుతుంటారు. ఈ వ్యాధి గ్రామస్తులను చర్మ సమస్యలతో బాధపెడుతుంది. దీనికి చికిత్స చేయడం కష్టంగా ఉంటుంది. గత వారంలో దాదాపు 40 మంది దీని బారినపడి మరణించారు.ఇంకా డజన్ల కొద్దీ వ్యక్తులు దీని వల్ల అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి, ముగ్గురు వైద్య సిబ్బంది, ఇద్దరు సమాధులు తవ్వేవాళ్ళు ఈ గ్రామానికి పంపబడతారు. వీళ్ళు గ్రామస్తులకు వైద్య సహాయం అందించడంతో పాటు, మృతదేహాలకు సమాధిని కూడా సిద్ధం చేస్తుంటారు. ఈ బృందం గ్రామానికి చేరుకున్న తర్వాత, వింతైన ఆచారాలు, కఠినమైన సంప్రదాయాలను గమనిస్తుంది. ముఖ్యంగా సుందానీస్ సంస్కృతికి సంబంధించిన “పమాలి” ఆచారాలను ఇక్కడ ఎక్కువగా ఫాలో అవుతుంటారు.

ఇందులో రాత్రి సమయంలో విజిల్ వేయడం, గోర్లు కత్తిరించడం వంటివాటి వల్ల ఆత్మలు వస్తాయని స్థానికులు నమ్ముతారు. అయితే ఈ బృందంలోని కొందరు, ఈ ఆచారాలను తేలిగ్గా తీసుకుని, గ్రామంలో ఉన్న నియమాలను ఉల్లంఘిస్తారు. ఒక వ్యక్తి రాత్రి సమయంలో విజిల్ వేస్తాడు. మరొకరు మృతదేహాలను సమాధి చేసే విధానంలో స్థానిక ఆచారాలను పాటించకపోవడంతో, గ్రామంలో భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. ఈ బృందం సభ్యులు “పోకాంగ్” అనే ఆత్మలను చూడటం మొదలుపెడతారు. పోకాంగ్ అనేది ఇండోనేషియన్ ఇతిహాసాలలో ఒక రకమైన ఆత్మగా ప్రచారంలో ఉంది. ఈ పోకాంగ్ ఆత్మలు గ్రామంలో తిరుగుతూ, డాక్టర్ల బృందాన్ని భయపెడతాయి. గ్రామంలో ఉండే వింత వ్యాధికి, పోకాంగ్ ఆత్మలకు సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. చివరికి వీళ్ళంతా ఆత్మల చేతిలో బలవుతారా ? ఈ రోగానికి విరుగుడు ఏమిటి ? ఈ స్టోరీ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను, ఈ ఇండోనేషియన్ హారర్ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : భార్య ఉండగానే మరో అమ్మాయితో… భర్త ముందే మరో అబ్బాయితో… ఈ దంపతులు చేసే పనులకు మెంటలెక్కాల్సిందే

Related News

OTT Movie : 33 సంవత్సరాల టైమ్ ట్రావెల్ … తమ్ముడికోసం అన్న షాకింగ్ రిస్క్ … ఫ్యామిలీతో చూసేయచ్చు

OTT Movie : భార్య కంటికి చిక్కే భర్త లవ్ లెటర్… ఆమె ఇచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్

OTT Movie : సొంత కూతురితో ఆ పని కోసం అబ్బాయిని వెతికే తండ్రి… మైండ్ బెండింగ్ మలయాళ స్టోరీ

Virgin Boys: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన వర్జిన్ బాయ్స్.. ఎప్పుడు? ఎక్కడంటే?

OTT Movie : ఇండియన్ స్పైగా వెళ్లి, పాక్ ఆర్మీ ఆఫీసర్ కు భార్యగా… ఈ సిరీస్ ను ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు

OTT Movie: అక్క అంటూనే.. టీనేజ్‌లో అలాంటి పని చేసే అబ్బాయి, ఆ కథతోనే సినిమా తీసి.. ఫుల్ కామెడీ భయ్యా!

Big Stories

×