E-Paper
Advertisement

హాలీవుడ్‌ను ఏలిన మినియన్స్… రాక్షసులను దించి ప్రపంచాన్నే డేంజర్లో పడేసే బొమ్మలు

హాలీవుడ్‌ను ఏలిన మినియన్స్… రాక్షసులను దించి ప్రపంచాన్నే డేంజర్లో పడేసే బొమ్మలు
Advertisement

Animated Movie on OTT: మినియన్స్ అంటేనే అల్లరి, కామెడీ, వింత చేష్టలు గుర్తుకొస్తాయి. ‘డెస్పికబుల్ మీ’ ఫ్రాంచైజీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించుకున్న ఈ పసుపు రంగు బుజ్జి బొమ్మలు మరోసారి సరికొత్త సాహసంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇల్యూమినేషన్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ‘మినియన్స్ & మాన్‌స్టర్స్’ (Minions & Monsters) 2026 జూలై 1న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ‘డెస్పికబుల్ మీ’ ఫ్రాంచైజీలో ఏడవ సినిమా కాగా, మినియన్స్ ప్రీక్వెల్ సిరీస్‌లో మూడవ భాగంగా తెరకెక్కింది. ఇక ఎట్టకేలకు ఓటీటీ మూవీ లవర్స్ ను అలరించడానికి డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చింది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈసారి కథ మనల్ని ఏకంగా 1920ల నాటి హాలీవుడ్‌ కు తీసుకెళ్తుంది. అప్పట్లో సినిమా ప్రపంచం కొత్తగా ఎదుగుతున్న సమయంలో మినియన్స్ గ్యాంగ్ కూడా హాలీవుడ్‌ లోకి అడుగు పెడుతుంది. అక్కడ తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని, పెద్ద స్టార్స్‌గా మారాలని కలలు కంటాయి ఆ బుజ్జి బొమ్మలు. అయితే మినియన్స్‌కు వచ్చిన ఆలోచన అక్కడితో ఆగదు. తామే ఒక అద్భుతమైన మాన్‌స్టర్ మూవీ తీయాలని నిర్ణయించుకుంటారు. ప్రేక్షకులను నిజంగా భయపెట్టాలంటే సినిమాలో నిజమైన రాక్షసులు ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచన వారికి వస్తుంది. దీంతో ఒక వింతైన మేజికల్ ఎక్స్‌పెరిమెంట్‌ కు తెరతీస్తారు.

Advertisement

అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. మినియన్స్ చేసిన ఆ ప్రయోగం ఊహించని విధంగా బెడిసి కొడుతుంది. మంచు గడ్డల్లో శతాబ్దాలుగా బంధించబడి ఉన్న నిజమైన భారీ రాక్షసులు బయటకు వచ్చేస్తారు. ఒక్కసారిగా హాలీవుడ్ వీధుల్లో రాక్షసులు సంచరించడంతో పరిస్థితి అదుపు తప్పుతుంది. తాము సరదాగా చేసిన పని ఇంత పెద్ద ప్రమాదానికి దారి తీసిందని మినియన్స్‌ కు అర్థమవుతుంది. దీంతో ఇప్పటివరకు అల్లరి చేసే బుజ్జి బొమ్మలుగా ఉన్న వీళ్లు ఏకంగా ప్రపంచాన్ని కాపాడే బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో ‘గూమి’ అనే వింత పచ్చటి జీవితో కలిసి రాక్షసులను ఆపాలని అనుకుంటారు. మరి మినియన్స్ ఆ రాక్షసులను ఎలా ఆపారు? వాళ్లు చేసిన ప్రయోగం వల్ల వచ్చిన ప్రమాదం నుంచి ప్రపంచాన్ని ఎలా కాపాడారు? చివరకు తమ కలల సినిమాను పూర్తి చేయగలిగారా? మూవీ క్లైమాక్స్ ఏంటి ? అనేదే ఈ యానిమేటెడ్ అడ్వెంచర్‌లో ఆసక్తికరమైన అంశం.

తెలుగులో ఉందా ?

ఈ సినిమాకు పియరీ కాఫిన్ దర్శకత్వం వహించారు. మినియన్స్‌కు స్వయంగా పియరీ కాఫిన్ వాయిస్ అందించగా, ట్రే పార్కర్, క్రిస్టోఫ్ వాల్ట్జ్, జెస్సీ ఐసెన్‌బర్గ్, జెఫ్ బ్రిడ్జెస్ తదితరులు ఇతర పాత్రలకు వాయిస్ ఇచ్చారు. సుమారు గంటన్నర నిడివితో సాగే ఈ మూవీ ఇంగ్లీష్‌ లో అందుబాటులో ఉంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడంతో పిల్లలతో కలిసి పెద్దలు కూడా హాయిగా చూడొచ్చు. మినియన్స్ చేసే అల్లరి, రాక్షసులతో జరిగే యాక్షన్, కామెడీ, అడ్వెంచర్ కలయికతో వచ్చిన ఈ సినిమా చిన్నారులకు మాత్రమే కాకుండా మినియన్స్ అభిమానులందరికీ మంచి ఫన్ రైడ్‌గా నిలుస్తుంది. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ కి స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also: వెకేషన్‌లో ప్రియుడు మిస్సింగ్… వెతుకుతూ వెళ్తే అతడి అసలు బండారం బట్టబయలు

Related News

ఓటీటీలో రికార్డ్ సృష్టించిన ఇరుముడి.. ఎన్నో స్థానం అంటే?

పాడుబడిన భవంతిలో దెయ్యం… భయంతో పాటు కడుపుబ్బా నవ్వించే హారర్ కామెడీ

కొడుకు తల్లికంటే బేబీసిట్టర్ కే ఎక్కువ దగ్గరైతే… గుండెను పిండేసే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా

ఇంట్లో గది అద్దెకు ఇస్తే ఇదేం రచ్చ భయ్యా… మళ్లీ మొదలైన నవ్వుల హంగామా

గతాన్ని మర్చిపోయి దాక్కున్న గ్యాంగ్‌స్టర్‌… ప్రేమ కోసం మళ్లీ తుపాకీ పడితే… యాక్షన్ క్రైమ్ డ్రామా

సరదా ట్రిప్ కాస్తా దెయ్యాల టార్చర్‌గా మారితే… క్రేజీ హారర్ కామెడీ

పాట కోసం ప్రాణాలైనా ఇచ్చేంత పిచ్చి… కట్ చేస్తే పేరు తెచ్చిన పాటతోనే ఊహించని ట్విస్ట్… యూత్‌ఫుల్ మ్యూజికల్ డ్రామా

కూతురు కిడ్నాప్… పోలీసులు చేతులెత్తేయడంతో తండ్రి ఊచకోత…. హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×