OTT Movie : థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు, కొద్ది రోజుల్లోనే ఓటీటీ లో దర్శనం ఇస్తున్నాయి. వీటిలో బాలీవుడ్ సినిమాలను మన ప్రేక్షకులు, ఓటీటీ లోనే ఎక్కువగా చూస్తున్నారు. అయితే ఒక బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ, ఓటిటిలో అదరగొడుతోంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు, ట్విస్టులతో మెంటల్ ఎక్కిపోతుంది. దీని పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే
నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో
ఈ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘మోనికా ఓ మై డార్లింగ్’ (Monica, O My Darling). 2022 లో విడుదలైన ఈ సినిమాకు వాసన్ బాల దర్శకత్వం వహించారు. జపనీస్ రచయిత కీగో హిగాషినో రాసిన 1989 నవల (Heart of Brutus) ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇందులో రాజ్‌కుమార్ రావు, హుమా ఖురేషి, రాధికా ఆప్టే, సికందర్ ఖేర్, బగవతి పెరుమాళ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో 2022 నవంబర్ 11న విడుదలైంది.
స్టోరీలోకి వెళితే
జయంత్ ఒక ప్రతిభావంతుడైన ఇంజనీర్ గా పేరుతెచ్చుకుంటాడు. యూనికార్న్ రోబోటిక్స్ కంపెనీలో కీలక పదవిలో ఉంటాడు. అతను కంపెనీ సీఈఓ సత్యనారాయణ్ కుమార్తె నిక్కీ తో నిశ్చితార్థం చేసుకుని, కంపెనీ బోర్డు డైరెక్టర్‌గా పదోన్నతి పొందుతాడు. జయంత్ తన మధ్యతరగతి నేపథ్యం నుండి ఎదిగి, ఈ స్థాయికి చేరుకుంటాడు. అయితే అతని సహాయకురాలు మోనికాతో, అక్రమ సంబంధం కారణంగా అతని జీవితం చిక్కుల్లో పడుతుంది. మోనికా, జయంత్‌తో పాటు కంపెనీ సీఎఫ్‌ఓ అరవింద్, సీఈఓ కొడుకు నిశికాంత్ లను కూడా బ్లాక్‌మెయిల్ చేస్తుంది. తాను ప్రెగ్నెంట్ అని చెప్పి డబ్బు డిమాండ్ చేస్తుంది. ఈ ముగ్గురూ మోనికాను హత్య చేయాలని ఒక పథకం వేస్తారు. నిశికాంత్ ఆమెను చంపడం, జయంత్ శవాన్ని తరలించడం, అరవింద్ శవాన్ని పారవేయడం. ఇలా వారు ఒక కాంట్రాక్ట్‌పై సంతకం చేస్తారు. ఎవరైనా వెనక్కి తగ్గితే వాళ్ళు కూడా ఇరుక్కునేలా ఉటుంది ఈ కాంట్రాక్ట్ . అయితే పథకం ప్రకారం ఈ హత్య జరగదు. జయంత్, అరవింద్ ఆ శవాన్ని అడవిలో పారవేసే సమయంలో చిరుతపులి దాడి చేస్తుంది. ఆతరువాత వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు.
మరుసటి రోజు, మోనికా బతికే ఉంటుంది కానీ, నిశికాంత్ శవమై కనిపిస్తాడు. ఏసీపీ విజయశాంతి ఈ హత్యను విచారించడం ప్రారంభిస్తుంది. ఈ దశలో అరవింద్ ఒక పాము కాటుకు చనిపోతాడు. జయంత్ కు తన సోదరి షాలుకి, కాబోయే భర్త గౌరవ్ నుండి బెదిరింపులు వస్తాయి. అతను వారి మర్డర్ కాంట్రాక్ట్ ఫోటోకాపీని పంపిస్తాడు. జయంత్ మోనికా ఇంటికి వెళ్లి ఆమెను చంపాలని ప్రయత్నిస్తాడు. ఇంతలోనే ఆమె తాగిన వైన్‌లో ఎవరో విషం కలపడంతో ఆమె చనిపోతుంది. ఆమె చనిపోయే ముందు నిశికాంత్, అరవింద్‌ను తాను చంపలేదని, నిజమైన హంతకుడిని గుర్తించినట్లు చెప్పడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలోనే ఆమె చనిపోతుంది. చివరికి ఈ హత్యలు ఎలా జరుగుతున్నాయి ? ఎవరు చంపుతున్నారు ? పోలీసులు హంతకున్ని పట్టుకుంటారా ? అనే ఈ విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : అండమాన్ లో అంతుపట్టని మిస్టరీ … ప్రాణాలతో చెలగాటం … గుండె గల్లంతవ్వడం ఖాయం