OTT Movie : టెక్సాస్‌లోని ఒక నిర్మానుస్య ప్రాంతం .. ఎండలో కాలిపోతున్న రహదారి .. ఒక సాధారణ రోడ్ ట్రిప్ భయంకరమైన పీడకలగా మారుతుంది. ఐదుగురు యువకులు తమ అమ్మమ్మ ఇంటికి వెళ్తూ, ఒక భీకరమైన ఉచ్చులో చిక్కుకుంటారు. అక్కడ ముఖానికి మాస్క్ ధరించిన ఒక హంతకుడు, తన చైన్సాతో మనిషి మాంసం కోసే పనిలో ఉంటాడు. ఈ అరాచకం ఎంతలా ఉంటుందంటే, సినిమా చూసిన తరువాత ఎక్కడికైనా వెళ్లాలంటే భయపడతారు. అయితే ఈ రోడ్ ట్రిప్ కి వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో బయటపడతారా ? ఆ హంతకుడి చేతిలో బలవుతారా ? ఈ మూవీ పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివారాలు తెలుసుకుందాం పదండి.
స్టోరీలోకి వెళితే
ఐదుగురు స్నేహితులు సాలీ హార్డెస్టీ, ఫ్రాంక్లిన్ అనే సోదరులు, అలెన్ డాన్జిగర్, కిర్క్, పామ్ అనే ఫ్రెండ్స్ ను తీసుకుని తమ అమ్మమ్మను చూడటానికి వెళ్తుంటారు. వీళ్ళు ప్రయాణిస్తున్న వ్యాన్ టెక్సాస్ గ్రామీణ ప్రాంతంలో గుండా వెళ్తుంది . దారిలో ఒక వార్తాపత్రికలో శవాల దొంగతనం గురించి చదువుతారు. ఒక విచిత్రమైన మనిషి వీళ్లకు ఎదురుపడతాడు. అతను వీళ్ళను తన విచిత్రమైన ప్రవర్తనతో భయపెడతాడు. తనను తాను గాయపరుచుకుని, ఫ్రాంక్లిన్‌ను కత్తితో గాయపరుస్తాడు. ఇక ఆ మనిషి నుంచి తప్పించుకుని, వాళ్ళు ఒక నిర్జనమైన పాత ఇంటికి చేరుకుంటారు. సమీపంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఇంధనం లభించకపోవడంతో, వారు చుట్టుపక్కల ప్రాంతంలో వెతుకుతుంటారు. ఈ క్రమంలో కిర్క్, పామ్ ఒక సమీపంలో ఉండే ఇంటికి వెళతారు.
అక్కడ వీళ్ళు లెదర్‌ఫేస్ అనే భీకరమైన హంతకుడి చేతిలో చిక్కుకుంటారు. వీళ్ళు చూడటానికి దెయ్యాలకన్నా ఘోరంగా ఉంటారు. మానవ చర్మంతో తయారు చేసిన మాస్క్ ను ధరించిన ఒక సైకో, తన చైన్సాతో కిర్క్‌ను హత్య చేస్తాడు. పామ్‌ను ఒక మాంసం హుక్‌పై వేలాడదీస్తాడు. ఈ ఇల్లు ఒక నరమాంస భక్షక కుటుంబానిదని చూస్తేనే తెలుస్తుంది. ఆ తరువాత ఒక్కొక్కరిగా, ఈ కుటుంబ హింసాత్మక ఉచ్చులో చిక్కుకుంటారు. సాలీ పోలీసుల కోసం ప్రయత్నిస్తుండగా, ఈ సైకో ఆమె వెంట పడతాడు. చివరికి ఆ కాన్నిబల్స్ చేతిలో వీళ్ళంతా బలవుతారా ? ఎవరైనా ప్రాణాలతో బయటపడతారా ? అనేది ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : అద్దెకు వచ్చి అరాచకం … ఇంటి ఓనర్ పైకే ఆత్మలను పంపే రిచువల్ .. ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న హర్రర్ థ్రిల్లర్
ఈ హారర్ స్లాషర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘The Texas Chain Saw Massacre’. ఈ సినిమాకి టోబ్ హూపర్ దర్శకత్వం వహించారు. ఇందులో మారిలిన్ బర్న్స్ (సాలీ), గున్నర్ హాన్సెన్ (లెదర్‌ఫేస్), ఎడ్విన్ నీల్ (హిచ్‌హైకర్), అలెన్ డాన్జిగర్ (జెర్రీ), పాల్ ఎ. పార్టైన్ (ఫ్రాంక్లిన్), టెరి మెక్‌మిన్ (పామ్) ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 23 నిమిషాలు రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDb లో 7.4/10 రేటింగ్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ అందుబాటులో ఉంది.