BigTV English

OTT Movie : దెయ్యాలంటే నమ్మని అమ్మాయికి చుక్కలు చూపించే ఆత్మ… గ్రిప్పింగ్ నరేషన్… ఊహించని ట్విస్టులు

OTT Movie : దెయ్యాలంటే నమ్మని అమ్మాయికి చుక్కలు చూపించే ఆత్మ… గ్రిప్పింగ్ నరేషన్… ఊహించని ట్విస్టులు

OTT Movie : హర్రర్ థ్రిల్లర్ సినిమాల్లోనూ ప్రత్యేకంగా జానర్లు ఉంటాయి. సైకలాజికల్, సై-ఫై, రివేంజ్… ఇలాంటి హర్రర్ థ్రిల్లర్ సినిమాలు చూస్తున్నంతసేపు కంటి రెప్ప వాల్చనంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఆతృతను కూడా పెంచుతాయి. అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ మలయాళ మూవీనే ఈ రోజు మన మూవీ సజెషన్. ఆ మూవీ పేరు ఏంటి? దాని స్టోరీ ఏంటి? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.


స్టోరీలోకి వెళితే

డాక్టర్ కీర్తి ఒక ఫోరెన్సిక్ మెడిసిన్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థి. ఆమె దగ్గరకు ఓ శవాన్ని టెస్ట్ కోసం పంపిస్తారు. నదిలో కాంక్రీట్‌తో నిండిన డబ్బాలో దొరికిన ఒక మహిళ మృతదేహం అది. ఈ మృతదేహం ఆమె కాలేజ్ లో మిస్ అయిన అనస్థీషియా విద్యార్థి డాక్టర్ సారాదని తెలుస్తుంది. దీంతో డాక్టర్ షానవాస్, సారా మాజీ ప్రేమికుడిపై అనుమానం మొదలవుతుంది. ఫలితంగా ఈ కేసులో అతను కూడా చిక్కుకుంటాడు.


కీర్తి ఈ కేసును లోతుగా ఇన్వెస్టిగేట్ చేయాలని డిసైడ్ అవుతుంది. అప్పటి నుంచి ఆమె చుట్టూ విచిత్రమైన, భయంకరమైన సంఘటనలు జరగడం మొదలవుతాయి. ఆమెకు సైన్స్‌ పై గట్టి నమ్మకం ఉన్నప్పటికీ, ఈ అసాధారణ సంఘటనలు ఒక అతీంద్రియ శక్తి లేదా ఆత్మతో సంబంధం ఉండడంతో ముందుగా భయపడుతుంది. అయితే ఆ శక్తి ఆమెను సారా హత్య వెనుక ఉన్న రహస్యాలను కనుగొనే దిశగా నడిపిస్తుంది. దీంతో కీర్తి తన భయాలను అధిగమిస్తూ, మోసాలు, ప్రమాదాలతో నిండిన ఈ కేసులో నిజాన్ని వెలికితీసే ప్రయత్నంలో ఉంటుంది. అసలు సారాను ఎవరు, ఎందుకు హత్య చేశారు ? ఆ మిస్టరీని కీర్తి చేధిస్తుందా ? అసలు ఆ ఆత్మ హీరోయిన్ నే ఎందుకు సెలెక్ట్ చేసుకుంది? చివరికి జరిగింది ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ మూవీని చూడాల్సిందే.

10 నెలల తరువాత ఓటీటీలోకి…

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మలయాళం సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘హంట్’ (Hunt). షాజీ కైలాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో భావన ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా 2024 ఆగస్టు 23న థియేటర్లలో విడుదలైంది. 2025 మే 23 నుండి మనోరమా మ్యాక్స్ (Manorama MAX) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అంటే థియేటర్లలో రిలీజ్ అయిన 10 నెలల తరువాత ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు మోక్షం దక్కిందన్న మాట. ఇందులో భావన, రేణుక మీనన్, అదితి రవి, రెంజి పణిక్కర్, చందునాథ్, అను మోహన్, దైన్ డేవిస్ ప్రధాన పాత్రలు పోషించారు.

Read Also : ప్రతీకారంతో రగిలిపోయే దెయ్యం… ఉలిక్కిపడే సీన్స్ తో హడలెత్తిస్తున్న హారర్ థ్రిల్లర్

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×