Network Issue: స్పెయిన్‌లో మొబైల్ ఫోన్ నెట్ వర్క్‌లు, అత్యవసర సేవలు పనిచేయకుండా పోయాయి. ఏం జరిగిందో.. ఏమో కానీ స్పెయిన్ దేశ వ్యాప్తంగా మొబైల్ ఫోన్ల నెట్ వర్క్‌లు ఆగిపోయాయి. దీంతో దేశ ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. నిన్న ఉదయం 5 గంటల నుంచి.. స్పెయిన్ దేశంలో అత్యవసర సేవలు ఒకేసారి పనిచేయకుండా అయిపోయాయి. దీంతో దేశ ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. అక్కడ అత్యవసర హెల్ప్ లైన్ 112 కూడా నిలిచిపోయింది.
స్పెయిన్ లో ప్రభావితమైన నెట్ వర్క్‌లలో మోవిస్టార్, వొడాఫోన్, ఆరెంజ్, డిజిమొబిల్ , O2 ఉన్నాయి. మాడ్రిడ్, బార్సిలోనా, ముర్సియా, బిల్బావో, వాలెన్సియా, మలగా, సెవిల్లా, వంటి ప్రధాన నగరాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఈ నగరాల్లో ప్రజల సంఖ్య ఎక్కువగా ఉండడమే.. కాకుండా పర్యాటకంగా చాలా ప్రాచుర్యం పొందింది. దీంతో ఈ ప్రాంతాలపై నిలిచిపోయిన సేవలు తీవ్ర ప్రభావం చూపింది. ఈ సమస్య ప్రభావం దేశవ్యాప్తంగా విస్తృతంగా ఉంది.
ఈ నెట్ వర్క్ అంతరాయం వల్ల దేశ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యవసర హెల్ప్ లైన్ 112 కూడా అందుబాటులో లేకపోవడంతో దేశ వ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దేశ ప్రజలందరూ ఎమర్జెన్సీ నంబర్ కు కాల్ చేయడంతో.. అక్కడ కూడా లోపం ఉండడంతో ప్రజలు గందరగోళానికి గురయ్యారు. ఈ సమస్య దేశమంతా వ్యాపించింది.
Also Read: AVNL Recruitment: ఏవీఎన్‌ఎల్‌లో 1805 జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలు, ఈ అర్హత ఉంటే చాలు
అసలు దేశంలో ఎదురైన ప్రాబ్లెమ్ గురించి ఎవరికి అర్థం కాలేదు. అంతరాయానికి గల అసలు కారణం ఇంకా వెల్లడి కాలేదు. ప్రస్తుతం, సేవా పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అరగాన్ ప్రాంతంలో 112 సేవలు అధికారులు పాక్షికంగా పునరద్దించారు. కానీ దేశ వ్యాప్తంగా మిగిలిన అన్ని ప్రాంతాలు సంక్షోభంలో ఉన్నాయి. జీవీఏ ఈ సమస్య వాలెన్షియన్ కమ్యూనిటీ అత్యవసర సేవలకు నేరుగా సంబంధం లేదని వివరించింది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న సాంకేతిక సంక్షోభం అని క్లారిటీ ఇచ్చింది.
కొన్ని రోజుల క్రితం స్పెయిన్ దేశంలో జాతీయ స్థాయిలో పెద్ద కరెంట్ సమస్యను ఎదుర్కొంది. ఇప్పుడు మరోసారి ఇంత పెద్ద సాంకేతిక వైఫల్యం ప్రభుత్వం, ప్రజల ఆందోళనకు గురిచేసింది. అయితే, ఈసారి సంక్షోభం మరింత తీవ్రంగా ఉంది. ఎందుకంటే ఈసారి అత్యవసర సేవలు కూడా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ సేవను త్వరగా పునరుద్ధరించకపోతే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది.
Also Read: DRDO Recruitment: డీఆర్‌డీవోలో 148 ఉద్యోగాలు.. శాలరీ రూ.56,100.. దరఖాస్తుకు లాస్ట్ డేట్?