E-Paper
Advertisement

9 ఏళ్లుగా కనిపించని కూతురు కోసం తల్లి వెతుకులాట… దొరికిందనుకున్న వేళ చుట్టూ అనుమానితులు… గ్రిప్పింగ్ మిస్టరీ థ్రిల్లర్

9 ఏళ్లుగా కనిపించని కూతురు కోసం తల్లి వెతుకులాట… దొరికిందనుకున్న వేళ చుట్టూ అనుమానితులు… గ్రిప్పింగ్ మిస్టరీ థ్రిల్లర్
Advertisement

Mystery Thriller: పుట్టిన బిడ్డ ఆసుపత్రి నుంచే అదృశ్యమైతే ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక్కరోజు కాదు.. ఏకంగా తొమ్మిదేళ్ల పాటు తన కూతురు కోసం వెతుకుతూనే ఉంటే? ఇన్నేళ్ల తర్వాత ఓ చిన్న ఆధారం దొరికిందని అనుకుంటే, నిజం దగ్గర పడుతున్న కొద్దీ తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిపైనా అనుమానం మొదలైతే? ఇదే ఉత్కంఠతో తెరకెక్కిన హిందీ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ ‘Shaque: Trust No One’. పరినీతి చోప్రా తన సిరీస్ డెబ్యూలో అన్వితగా కనిపించారు. ఆమెతో పాటు జెన్నిఫర్ వింగెట్, తాహిర్ రాజ్ భాసిన్, సోని రజ్దాన్, అనుప్ సోని, సుమీత్ వ్యాస్, హార్లీన్ సేథి, ధ్రువ్ చౌదరి కీలక పాత్రల్లో నటించారు. రెన్సిల్ డిసిల్వా, సిద్ధార్థ్ పి. మల్హోత్రా రూపొందించిన ఈ సిరీస్‌లో ఓ తల్లి తన మిస్సింగ్ బిడ్డ కోసం సాగించే తొమ్మిదేళ్ల పోరాటం క్రమంగా క్రైమ్ మిస్టరీగా మారుతుంది. ఈ సిరీస్‌లో ప్రతి వ్యక్తి వెనుక ఓ రహస్యం ఉన్నట్లు అనిపిస్తుంది. మరి అన్విత కూతురికి ఏం జరిగింది? తొమ్మిదేళ్ల తర్వాత దొరికిన ఆధారం నిజంగా ఆమెను కూతురి దగ్గరకు తీసుకెళ్లిందా? చివరికి ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి ఎందుకు వచ్చింది? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

అన్విత, ఆలొక్‌ల శిశువు ఆసుపత్రి నుంచి అదృశ్యమవుతుంది. కూతురు ఎక్కడుందో తెలియకపోయినా అన్విత మాత్రం ఆశ వదులుకోదు. ప్రతి ఏడాది బిడ్డ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు కలవరపెట్టే ఫొటోలు, ప్యాకేజీలు అందుతుంటాయి. అవి కూతురు బతికే ఉందన్న నమ్మకాన్ని ఒకవైపు పెంచుతూనే, మరోవైపు ఈ మిస్సింగ్ కేసు వెనుక ఎవరో కావాలనే ఆడుతున్నారనే అనుమానాన్ని కలిగిస్తాయి.

Advertisement

తొమ్మిదేళ్ల తర్వాత ఓ కీలక ఆధారం అన్వితను మరోసారి తన కూతురు జాడ వైపు తీసుకెళ్తుంది. కానీ ఆ ఆధారం వెంబడి వెళ్లే కొద్దీ సమస్య మరింత క్లిష్టంగా మారుతుంది. పాత ఫొటోలు, కొత్త ఆధారాలు, అనుమానాస్పద వ్యక్తులు, ఊహించని మరణం అన్నీ కలిసి కేసును కొత్త మలుపుల్లోకి తీసుకెళ్తాయి. పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఖురానా కూడా దర్యాప్తులోకి రావడంతో అసలు నిజాన్ని బయటపెట్టే ప్రయత్నం మొదలవుతుంది. మరోవైపు అన్విత చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనపై అనుమానాలు పెరుగుతాయి. చివరికి ఆమె వెతుకుతున్న నిజం తనకు అత్యంత దగ్గరగా ఉన్నవాళ్ల మధ్యే దాగి ఉందా అన్న ప్రశ్న ఎదురవుతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ కు అందరికీ ఫ్యూజులు అవుట్ అవుతాయి. ఆ ట్విస్ట్ ఏమిటి ? ఆ బిడ్డను మాయం చేసింది ఎవరు ? అన్విత ఈ మిస్టరీని ఎలా  ఛేదించింది అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

తెలుగులో అందుబాటులో ఉందా?

రెన్సిల్ డిసిల్వా దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కు రెన్సిల్ డిసిల్వా, సిద్ధార్థ్ పి. మల్హోత్రా క్రియేటర్లుగా వ్యవహరించారు. పరినీతి చోప్రా, జెన్నిఫర్ వింగెట్, తాహిర్ రాజ్ భాసిన్, సోని రజ్దాన్, అనుప్ సోని, సుమీత్ వ్యాస్ తదితరులు నటించారు. Netflix అధికారిక లిస్టింగ్ ప్రకారం మొత్తం 7 ఎపిసోడ్లు ఉన్నాయి. Netflixలో సెప్టెంబర్ 24 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ ఒరిజినల్‌తో పాటు తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉంది. మిస్టరీ, ఫ్యామిలీ సీక్రెట్స్, పోలీస్ ఇన్వెస్టిగేషన్, సైకాలజికల్ టెన్షన్, వరుస ట్విస్టులు ఇష్టపడేవారికి ‘Shaque: Trust No One’ ఆసక్తికరమైన బింజ్ వాచ్.

Advertisement

Read Also: తప్పు కేసులో జైలుకు… కోర్టు తీర్పు వెనుక షాకింగ్ సీక్రెట్… ఇంటెన్స్ కోర్టు రూమ్ సస్పెన్స్ డ్రామా

Tags

Related News

నాని ది ప్యారడైజ్ వచ్చేది ఈ ఓటీటీలోనే…స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

ఓటీటీలోకి నయనతార ‘హాయ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

ఫుట్‌బాల్ స్టార్ కెరీర్‌కు బ్రేక్… డ్యాన్సర్ గర్ల్‌ఫ్రెండ్‌కు కొత్త కష్టాలు… రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ

సముద్రం కింద మరో అద్భుత ప్రపంచం… ఎడారిలోనూ వేలాది జీవుల వింత జీవితం… కళ్లకు విందు చేసే నేచర్ డాక్యుమెంటరీ

కాస్మెటిక్ క్లినిక్‌లో షాకింగ్ నిజాలు… స్టార్ డాక్టర్‌తో ఢీకొన్న తర్వాత బయటపడే బ్యూటీ ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్స్

టాయ్స్‌కు కొత్త టెక్నాలజీతో పోటీ… స్మార్ట్ ట్యాబ్‌ను ఆపేందుకు రంగంలోకి వుడీ, బజ్… క్రేజీ ఫన్ అడ్వెంచర్

స్విట్జర్లాండ్ ట్రిప్‌లో తగిలే మిస్టీరియస్ యువకుడు… విధిని దాటి సాగే మ్యాజికల్ రొమాంటిక్ డ్రామా

Big Stories

Advertisement
×