E-Paper
Advertisement

దమ్ముంటే రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లు.. సీఎం రేవంత్‌కు రాంచందర్ రావు సవాల్!

దమ్ముంటే రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లు.. సీఎం రేవంత్‌కు రాంచందర్ రావు సవాల్!
Advertisement

Ramchander Rao: శాసనసభ్యుడు దానం నాగేందర్ అనర్హత వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టు సమర్థించడం పట్ల భారతీయ జనతా పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం ప్రజాస్వామ్య వ్యవస్థకు, రాజ్యాంగ నైతికతకు దక్కిన గొప్ప విజయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

రాజ్యాంగానికి ఎవరైనా తలవంచాల్సిందే

Advertisement

చట్టసభల్లో ప్రజాస్వామ్యం పరిలసిల్లాలని, ఎంతటి నాయకులైనా రాజ్యాంగ నియమావళికి కట్టుబడి ఉండాల్సిందేనని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసిందని ఆయన అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీజేఎల్పీ రాజీలేని రీతిలో చేసిన న్యాయపోరాటం వల్లే ఈ కీలక విజయం సాధ్యమైందని తెలిపారు. చట్టసభలు ‘ఆయారాం గయారాం’ రాజకీయాలకు వేదికలుగా మారకూడదని.. ‘ఘర్ వాపసీ’ అనే నెపంతో ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఖూనీ చేసే యత్నాలను న్యాయస్థానాలు సహించవని చెప్పారు.

ఉప ఎన్నికలకు వెళ్లే ధైర్యం ఉందా?

Advertisement

రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి ‘కంచే చేను మేసినట్లు’ గా ఉందని రాంచందర్ రావు తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలతో తక్షణమే రాజీనామా చేయించి, కొత్తగా ఉప ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డికి ధైర్యముంటే ప్రజాతీర్పును నేరుగా ఎదుర్కొని తమ బలాన్ని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.

రాహుల్ గాంధీ మార్కు రాజకీయ నయవంచన

మరో పార్టీ గుర్తుపై గెలిచిన ప్రజాప్రతినిధికి వెంటనే కాంగ్రెస్ ఎంపీ టికెట్ కేటాయించడం ఎంపీ రాహుల్ గాంధీ ద్వంద్వ నీతికి, రాజకీయ నయవంచనకు స్పష్టమైన నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడే కాంగ్రెస్ నాయకులు, క్షేత్రస్థాయిలో దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

Also Read: కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలారా.. సిగ్గుతో తలదించుకోండి: బండి సంజయ్

Tags

Related News

కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలారా.. సిగ్గుతో తలదించుకోండి: బండి సంజయ్

సుప్రీంలో చుక్కెదురు.. దానం నాగేందర్ ఆసక్తికర రియాక్షన్.. ‘ఇది ముందే తెలుసంటూ..!’

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

Big Stories

Advertisement
×