OTT Movie : కర్ణాకలోని మల్నాడ్ ప్రాంతంలో ఒక పచ్చని గ్రామంలో, ఆదివారం రోజున 11 ఏళ్ల స్నేహ తనకు ఇష్టమైన కోడి కూర తినడానికి ఎదురుచూస్తోంది. కానీ ఈ ఆదివారం గాంధీ జయంతి కావడంతో మాంసం విక్రయాలు నిషేధించబడి ఉంటాయి. ఈ స్టోరీ ఆమెను ఊరి మార్కెట్‌ల నుండి తాతయ్య ఇంటి వరకు తీసుకెళ్తుంది. ఇక ఆ పాపాకి చికెన్ దొరుకుతుందా ? ఎలా దొరుకుతుంది ? ఈ సినిమాపేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలు తెలుసుకుందాం.
స్టోరీలోకి వెళితే
ఇది కర్ణాటకలోని కుందాపుర మల్నాడ్ ప్రాంతంలో జరిగే ఒక ఆకర్షణీయ కథ. 11 ఏళ్ల స్నేహ చురుకుగా ఉండే బాలిక. ప్రతి ఆదివారం తన కుటుంబం వండే కోడి కూరను ఆస్వాదిస్తూ ఆనందిస్తుంది. కానీ ఒక ఆదివారం గాంధీ జయంతి కారణంగా, అహింస దినం కావడంతో మాంసం విక్రయాలు నిషేధించబడతాయి. స్నేహ తండ్రి (ప్రభాకర్ కుందర్) ఇంటికి కోడి బదులు కూరగాయల సంచితో వస్తాడు. దీనితో స్నేహ నిరాశకు గురవుతుంది. తన ఇష్టమైన కోడి కూర కోసం ఆమె ఒక ధైర్యసాహస యాత్రను ప్రారంభిస్తుంది. స్నేహ తన తండ్రి దాచిన మద్యం సీసాను కనిపెట్టి, దానిని ఒక ఒప్పందంగా ఉపయోగిస్తుంది.
ఇక తన తండ్రి మద్యం కోసం, ఆమె కోడి కూర కోసం, ఊరిలోని ఒక సీక్రెట్ గా మాంసాన్ని విక్రయించే మార్కెట్‌కు వెళతారు. కానీ అక్కడ స్నేహ తన తండ్రి మద్యం కోసం ఎక్కువ ధర చెల్లించడానికి సిద్ధంగా ఉన్నా, కోడి కోసం అంత శ్రద్ధ చూపకపోవడంతో నిరాశకు గురవుతుంది. ఆమె తన అమ్మమ్మ, తాతయ్య ఉండే గ్రామానికి వెళ్తుంది. అక్కడ ఆమె కోడి కూర కోసం ఒక చిలిపి పని చేస్తుంది. ఇందులో కోడిని పట్టడం కూడా ఉంటుంది. కథ స్నేహ చిన్న కోరిక చుట్టూ తిరుగుతుంది. చివరికి కోడి మాంసం ఆమెకు ఎలా దొరుకుతుంది ? అనే విషయాన్ని తెలుసుకోవాలి అనుకుంటే, ఈ కన్నడ సినిమాని మిస్ కాకుండా చూడండి.
Read Also : అమ్మాయిల ఆ వీడియోలు తీసి అమ్ముకోవాలనుకునే టీనేజర్స్… వీళ్ళ దిక్కుమాలిన ఆలోచనకు ఫుల్ స్టాప్ పెట్టే బైక్
ఈ కన్నడ సినిమా పేరు ‘Naale Rajaa Koli Majaa’ 2024 లో వచ్చిన ఈ సినిమాకి అభిలాష్ శెట్టి దర్శకత్వం వహించారు. ఇందులో సమృద్ధి కుందాపుర, ప్రభాకర్ కుందర్, రాధా రామచంద్ర, సనిధ్య ఆచార్య వంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. 2025 జూన్ 13 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది. 1 గంట 31 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDb లో 8.4/10 రేటింగ్ ఉంది.