BigTV English

Thandel OTT : ఓటీటీలోకి నాగ చైతన్య హిట్ మూవీ.. ఎప్పుడు చూడొచ్చంటే..?

Thandel OTT : ఓటీటీలోకి నాగ చైతన్య హిట్ మూవీ.. ఎప్పుడు చూడొచ్చంటే..?

Thandel OTT :   అక్కినేని నాగ చైతన్య తాజాగా నటించిన మూవీ ‘తండేల్’.. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి స్టార్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించారు. రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ‘తండేల్ ‘ మూవీకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ప్రేమ కోసం బ్రతికే జంట లవ్ స్టోరీతో పాటుగా దేశభక్తి ని కూడా యాడ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాకు హైలెట్ అయ్యాయి.. సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటుగా భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. థియేటర్లలోకి వచ్చిన 5 రోజులకే 100 కోట్ల క్లబ్ లోకి చేరడం మామూలు విషయం కాదు.. ఈ మూవీని ఓటీటీలో చూసేందుకు ఎదురు చూస్తున్న వారికోసం అదిరిపోయే న్యూస్ ను తీసుకొచ్చింది చిత్రయూనిట్.. ఇక ఆలస్యం ఎందుకు ఈ మూవీ ఓటీటీ డీటెయిల్స్ గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..


తండేల్ ఓటీటీ..

గత కొన్నేళ్లుగా సరైన హిట్ సినిమాలేక సతమతమవుతున్న నాగచైతన్యకు ఈ ఏడాది అదిరిపోయే సర్ ప్రైజ్ ను ఇచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 7న రిలీజ్ అయిన తండేల్ మూవీ భారీ విజయాన్ని అందుకుంది.. థియేటర్లలో రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే 100 కోట్లకు పైగా వసూలు చేసి సరికొత్త రికార్డుని సృష్టించింది. ఈ మూవీ ని తాజాగా ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ అధికారక ప్రకటన చేసింది. ఈరోజు అర్ధరాత్రి నుంచే ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటుగా తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ అవుతుంది.. ఈ సినిమాను మళ్లీ చూడాలని అనుకొనేవారికి పండగే..


Also Read : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఆ రెండు ఖచ్చితంగా చూడాలి..

స్టోరీ విషయానికొస్తే.. 

సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే జాలర్ల పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఈ స్టోరీగా తీసుకున్నారు. ముఖ్యంగా  శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న కొన్ని పరిణామాలతో కూడిన స్టోరీ లైన్ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు.. ప్రియుడు కోసం ప్రియురాలు చేసే త్యాగం ఈ సినిమాకు హైలైట్ అయ్యాయి. ఎమోషన్స్ యాక్షన్, కలగలిపిన ప్రేమ కథ చిత్రం.. ఈ సినిమాకు మొదటి రోజు నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న మూవి కలెక్షన్స్ బాగానే వసూలు చేసింది. థియేటర్లలో దాదాపు నెలరోజుల పాటు సక్సెస్ఫుల్ టాక్ తో రన్నయినా ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి..

నాగ చైతన్య సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా తండేల్ మూవీతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఓ ముగ్గురు డైరెక్టర్లతో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. త్వరలోనే వరుసగా సినిమాల వివరాలను అనౌన్స్ చెయ్యనున్నారు.. అటు సాయి పల్లవి లక్కీ హీరోయిన్ అయ్యింది. బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలను అకౌంట్ లో వేసుకుంటూ బాలీవుడ్ లో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది.

Related News

Friday Ott Release Movies: ఓటీటీల్లో సినిమాల జాతర.. ఇవాళ ఒక్కరోజే 15 సినిమాలు..

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

Big Stories

×