Watermelon: వేసవిలో మార్కెట్లో పుచ్చకాయ పుష్కలంగా లభిస్తుంది. పుచ్చకాయలోని పోషకాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. పుచ్చకాయ ఎముకలను బలోపేతం చేయడంలో ప్రభావ వంతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు కూడా పుచ్చకాయ తినడం ద్వారా నయమవుతాయి.
పుచ్చకాయలో లభించే పోషకాలు వేసవిలో శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయి. పుచ్చకాయ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో , బరువు తగ్గించడంలో ప్రభావ వంతంగా పనిచేస్తుంది. పుచ్చకాయ తినడం వల్ల కలిగే కొన్ని ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పుచ్చకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది: వేసవి కాలంలో, శరీరంలో నీరు తగ్గుతుంది. దీన్ని తొలగించడానికి పుచ్చకాయ తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. పుచ్చకాయలో 90 శాతం కంటే ఎక్కువ నీరు ఉంటుంది. కాబట్టి పుచ్చకాయ తినడం వల్ల శరీరం త్వరగా హైడ్రేట్ అవుతుంది. ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని శక్తిని అందిస్తాయి.
గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది: పుచ్చకాయలో సిట్రుల్లైన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. పుచ్చకాయ రసం చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. పుచ్చకాయ తిన్నా లేదా జ్యూస్ చేసుకుని రసం త్రాగినా కూడా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతే కాకుండా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
బరువు తగ్గుతుంది: ఈ రోజుల్లో బరువు పెరగడం ఒక పెద్ద సమస్యగా మారింది. బరువు తగ్గాలని అనుకునే వారు పుచ్చకాయ తినడం మంచిది. ఇది అధిక ఫైబర్ కలిగిన పండు . అందుకే పుచ్చకాయ తినడం వల్ల త్వరగా కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఫలితంగా అన్నం తినాలనే కోరికలు తొలగిపోతాయి. అందుకే క్రమం తప్పకుండా పుచ్చకాయ తినడం వల్ల బరువు తగ్గుతారు.
మలబద్ధకాన్ని తొలగిస్తుంది: ప్రతి మూడవ వ్యక్తిలో మలబద్ధకం సమస్యను ఎదుర్కుంటున్నారు. పుచ్చకాయ తినడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సంబంధిత సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. పుచ్చకాయ శక్తిని పెంచుతుంది . అంతే కాకుండా అలసటను కూడా తొలగిస్తుంది.
ఎముకలను బలపరుస్తుంది: పుచ్చకాయ ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. పుచ్చకాయ, దాని విత్తనాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా చేస్తుంది. అంతే కాకుండా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, జింక్ , పొటాషియం కూడా పుచ్చకాయలో కనిపిస్తాయి. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
Also Read: హెన్నాలో ఈ ఒక్కటి కలిపి వాడితే.. తెల్ల జుట్టు నల్లగా మారడం పక్కా !
రోగనిరోధక శక్తిని పెంచుతుంది: వేసవిలో పుచ్చకాయ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతే కాకుండా పుచ్చకాయలో విటమిన్ సి , ఎ ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతే కాకుండా రోగనిరోధక శక్తిని ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. తరచుగా పుచ్చకాయ తినడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
Also Read: ఇలా క్లీన్ చేస్తే.. టైల్స్‌పై ఉన్న మొండి మరకలు కూడా మాయం