OTT Movie : కొన్ని రియల్ స్టోరీలు చూసినప్పుడు లేదా విన్నప్పుడు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటాయి. అలాగే కొన్ని సినిమాలలో కూడా నిజంగానే జరిగిందా ? అనే రేంజ్ లో కొన్ని దారుణమైన సీన్స్ ను చూపిస్తారు మేకర్స్. ఆ సీన్స్ ఎంతకాలమైనా మర్చిపోలేనంత ఘోరంగా ఉంటాయి. అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ మూవీ గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది ? కథేంటి? అనే వివరాలకు తెలుసుకుందాం పదండి.
మల్టిపుల్ ఓటీటీలలో స్ట్రీమింగ్
ఈ మూవీ పేరు “నాతిచరామి” (Nathicharami). 2022లో విడుదలైన ఈ తెలుగు క్రైమ్ డ్రామాకు నాగు గవర దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మల్టిపుల్ ఓటీటీలలో అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), హంగామా, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్, సన్ నెక్స్ట్ వంటి ఓటీటీలలో ఈ మూవీని చూడొచ్చు. హైదరాబాద్‌లో Y2K యుగం (1990ల చివరి – 2000ల ప్రారంభం) నేపథ్యంలో సాగే ఈ మూవీలో భార్యాభర్తలైన ఓ జంట చుట్టూ కథ నడుస్తుంది. సందేశ్ బూరి, పూనమ్ కౌర్, సాయి కుమార్, శ్రీనివాస్ రెడ్డి, శివాజీ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం దాని Y2K నాస్టాల్జియా, పూనమ్ కౌర్ భావోద్వేగ నటన, లవ్ డ్రామా, క్రైమ్ వంటి ఎలిమెంట్స్‌తో ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది.
కథలోకి వెళ్తే…
Y2K సంక్షోభం సమయంలో అమెరికాకు వలస వెళ్లాలనే ఆశతో జీవితంలో సవాళ్లను ఎదుర్కొన్న ఒక మధ్యతరగతి జంట కథ. ఈ సినిమా కథ శ్రీలత (పూనమ్ కౌర్) అనే మహిళ చుట్టూ తిరుగుతుంది. శ్రీలత, ఆమె భర్త ప్రభాకర్ (అరవింద్ కృష్ణ) ఒక సంతోషకరమైన మధ్యతరగతి జీవితాన్ని గడుపుతున్న జంట. Y2K సంక్షోభం సమయంలో అమెరికాలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా రావడంతో, శ్రీలత తన భర్తను అమెరికాకు వెళ్లి మెరుగైన జీవితాన్ని సాధించమని ప్రోత్సహిస్తుంది. అయితే ఈ అమెరికన్ డ్రీమ్‌ను సాధించే క్రమంలో, శ్రీలత అప్పుల ఉచ్చులో చిక్కుకుంటుంది.
ముందుగా భర్తను అక్కడికి పంపాలనే ఆలోచనతో వీసా కోసం ఒక కన్సల్టెన్సీని కలుస్తారు. అంతా అనుకున్నట్టే జరుగుతుందనే సంబరంలో హీరోయిన్ అందరినీ పిలిచి, తన భర్త అమెరికాకు వెళ్తున్నాడని చెప్పి పార్టీ కూడా ఇస్తుంది. అంతలోనే వీసా రిజెక్ట్ అనే బ్యాడ్ న్యూస్ అందుతుంది. అప్పటికే ఫైనాన్సియర్ అయిన రామకృష్ణ దగ్గర హీరోయిన్ లక్షల్లో అప్పు చేసి ఉంటుంది. రెండు నెలలైనా అప్పు తీర్చకపోవడంతో అతను డబ్బులు తిరిగి ఇవ్వమని అడుగుతాడు. అయితే హీరోయిన్ ఆలస్యం అవుతుందని, పైగా తనకి మరో 2 లక్షలు అప్పు కావాలని అడుగుతుంది. రామకృష్ణ ఆ డబ్బులు కూడా ఇచ్చేసి వడ్డీ ఇప్పటి నుంచే స్టార్ట్ అని చెబుతాడు. తరువాత నుంచి అతను ఏకంగా శ్రీలత ఇంట్లోనే మకాం వేసి, మందు కొడుతూ, అక్కడే తింటాడు కూడా. ఒకానొక టైంలో హీరోయిన్ తో అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు. ఇదంతా జరుగుతున్నప్పుడు హీరో ఎక్కడ ఉన్నాడు? రామకృష్ణను హీరోయిన్ ఎందుకు చంపాల్సి వచ్చింది? ఆమె అసలు లాడ్జికి సీక్రెట్ గా ఎందుకు వెళ్తోంది? అనే విషయాలను సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : కళ్ల ముందే వరుస హత్యలు… కిల్లర్ ఆటలతో డిటెక్టివ్ కు నరకయాతన… క్లైమాక్స్ లో మైండ్ బెండయ్యే ట్విస్ట్