E-Paper
Advertisement

హత్య వెనకున్న మతిపోగొట్టే మిస్టరీ… ఉత్కంఠ రేపుతున్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ సీజన్ 24

హత్య వెనకున్న మతిపోగొట్టే మిస్టరీ… ఉత్కంఠ రేపుతున్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ సీజన్ 24
Advertisement

NCIS Season 24 OTT : నేరం ఎక్కడ జరిగినా దాని వెనుక ఉన్న అసలు కారణాన్ని బయట పెట్టడం అంత సులభం కాదు. ముఖ్యంగా నేవీ, మెరైన్ విభాగాలకు సంబంధించిన కేసుల్లో దేశ భద్రత, రహస్య సమాచారం, అధికారుల ప్రాణాలు వంటి అంశాలు ముడిపడి ఉంటాయి. ఒక చిన్న ఆధారం పెద్ద కుట్రను బయటపెట్టవచ్చు. అదే సమయంలో ఒక తప్పు నిర్ణయం విచారణను మరో దారిలోకి తీసుకెళ్లవచ్చు. ఇలాంటి కేసులను ఆసక్తికరంగా చూపిస్తూ సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న క్రైమ్ డ్రామా ‘ఎన్‌సీఐఎస్’ (NCIS) ఇప్పుడు 24వ సీజన్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఇంగ్షీషు క్రైమ్ డ్రామా స్ట్రీమింగ్ ఎక్కడ ? అంటే…

కథలోకి వెళ్తే…

ఈ సీజన్ ప్రారంభం గత సీజన్‌ లో జరిగిన కాల్పుల ఘటన పరిణామాల మధ్య సాగుతుంది. ప్రత్యేక ఏజెంట్ తిమోతి మెక్‌ గీ కుమారుడు కాల్పుల ఘటనలో చిక్కుకోవడంతో అతని కుటుంబం మాత్రమే కాకుండా, అతనితో కలిసి పని చేసే బృందం కూడా ఆందోళనకు గురవుతుంది. వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఈ సంక్షోభాన్ని అధిగమిస్తూనే మెక్‌ గీ తన విధులను కొనసాగించాల్సి వస్తుంది. ఒకవైపు కుటుంబంపై ఆందోళన, మరోవైపు జాతీయ భద్రతకు సంబంధించిన బాధ్యతలు అతనికి కొత్త ఒత్తిడిని తీసుకొస్తాయి.

Advertisement

ఇదే సమయంలో నేవీ కార్యదర్శికి సంబంధించిన కొత్త ముప్పు వెలుగులోకి వస్తుంది. ఆ ప్రమాదం వెనుక ఎవరు ఉన్నారు ? దాని లక్ష్యం ఏమిటి ? ఇది సాధారణ నేరమా లేక మరింత పెద్ద కుట్రలో భాగమా అనే విషయాలను తెలుసుకునేందుకు ఎన్‌సీఐఎస్ బృందం రంగంలోకి దిగుతుంది. అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించడం, అనుమానితులను ప్రశ్నించడం, చిన్న వివరాల మధ్య సంబంధాలను గుర్తించడం వంటి సీన్లతో విచారణ సాగుతుంది.

ఈ సమయంలో అభిమానులకు మరో ప్రత్యేకమైన పరిణామం ఎదురవుతుంది. టోనీ డినోజో పాత్రలో మైఖేల్ వెదర్లీ తిరిగి కథలోకి వస్తాడు. గతంలో ఎన్‌సీఐఎస్ బృందంలో తనదైన శైలితో గుర్తింపు పొందిన టోనీ, ఇప్పుడు తన ప్రైవేట్ భద్రతా సంస్థకు సంబంధించిన కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వాషింగ్టన్‌ కు వస్తాడు. అయితే అతని రాక కేవలం పాత స్నేహితులను కలుసుకోవడానికే పరిమితం కాదు. కొత్త కేసు పరిష్కారంలో అతని సహాయం అవసరమవుతుంది.

Advertisement

టోనీ తిరిగి రావడంతో మెక్‌గీతో సహా పాత సహచరుల మధ్య సంబంధాలు మరోసారి తెరపైకి వస్తాయి. గతంలో సరదాగా సాగిన వారి సంభాషణలు ఇప్పుడు బాధ్యతలు, అనుభవాలు, మారిన పరిస్థితుల నేపథ్యంలో కొత్త అర్థాన్ని సంతరించుకుంటాయి. టోనీ ఇప్పుడు పాత సహచరుడిగా మాత్రమే కాకుండా, తనదైన వృత్తిపరమైన అనుభవంతో సహాయం చేసే వ్యక్తిగా కనిపిస్తాడు. మరి చివరికి అందరూ కలిసి ఈ కొత్త ముప్పును ఎలా ఎదుర్కొన్నారు ? అసలు ఆ ముప్పు ఏంటి ? నేవీ కార్యదర్శికి పొంచి ఉన్న ముప్పు వెనుక ఎవరున్నారు? టోనీ తిరిగి రావడం బృందంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది? అన్నది తెలియాలంటే ఈ సిరీస్ పై ఒక లుక్కేయాల్సిందే.

Also Read : కాపురంలో చిచ్చు పెట్టే ఏడేళ్ళ కిందటి ఫోటో… 8.2 రేటింగ్ తో టాప్ లేపుతున్న తమిళ సినిమా

తెలుగులో చూడొచ్చా ?

‘ఎన్‌సీఐఎస్’ సీజన్ 24 అక్టోబర్ 6న అమెరికాలో సీబీఎస్‌లో ప్రారంభమైంది. అక్కడ పారామౌంట్ ప్లస్‌లోనూ ప్రసారం అవుతోంది. అయితే భారతదేశంలో ఈ కొత్త సీజన్ Amazon Prime Videoలో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. నేర పరిశోధనలు, రహస్య కుట్రలు వంటి అంశాలతో సాగే సిరీస్ లు ఇష్టపడేవారికి ఈ సీజన్ ఆసక్తికరంగా ఉండవచ్చు.

Related News

భర్త, ప్రాణ స్నేహితురాలు కలిసి చంపేశారు… గతంలోకి వెళ్ళిన భార్య వాళ్లకే పెళ్లి చేయాలనుకుంటే ? అదిరిపోయే కొరియన్ రివెంజ్ డ్రామా

దెయ్యాలనే నమ్మని యువతికి దడుచుకునే ట్విస్ట్… మస్ట్ వాచ్ హారర్ మిస్టరీ థ్రిల్లర్

తీగ తెగితే ప్రాణాలు పైకే… రియల్ లైఫ్ కేబుల్ కార్ ఇన్సిడెంట్… నరాలు కట్టయ్యే ట్విస్టులున్న సర్వైవల్ డాక్యుమెంటరీ

దెయ్యాల వేట – హాంటెడ్ స్కూల్… ఈ వారం ఓటీటీలోకి వచ్చిన 4 హారర్ సినిమాలు, సిరీస్‌లు… తెలుగులో ఎన్ని చూడొచ్చంటే ?

పదేళ్లుగా ఇంట్లోంచి బయటకు రాని రచయిత్రి… కిల్లర్ కు తనను తానే ఎరగా వేసుకునే సాహసం… బుర్రపాడు సైకలాజికల్ థ్రిల్లర్

బాక్సింగ్ రింగ్‌లో ప్రపంచాన్ని వణికించిన మైక్ టైసన్… కట్ చేస్తే వివాదాలు, జైలు జీవితం, పతనం

అవయవ మార్పిడితో ఐదుగురిలో ఊహించని సూపర్ పవర్స్… క్రేజీ కొరియన్ సూపర్‌హీరో అడ్వెంచర్

Big Stories

Advertisement
×