E-Paper
Advertisement

Netflix Animation Movies : ‘హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్’ నుండి “వైలెట్ ఎవర్‌గార్డెన్” వరకు… నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో ఉన్న యానిమేషన్ సినిమాలు

Netflix Animation Movies : ‘హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్’ నుండి “వైలెట్ ఎవర్‌గార్డెన్” వరకు… నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో ఉన్న యానిమేషన్ సినిమాలు
Advertisement

Netflix Animation Movies : నెట్‌ఫ్లిక్స్ డిఫరెంట్ యానిమేటెడ్ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తోంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకునేలా ఈ సినిమాలు ఉంటున్నాయి. ఒంటరిగా కూర్చుని కూడా వీటిని ఎంజాయ్ చెయ్యచ్చు. అలా ఉంటాయి మరి ఈ సినిమాలు. ఇప్పుడు Netflix లో ఉన్న టాప్ 10 యానిమేటెడ్ సినిమాలపై ఓ లుక్ వేద్దాం పదండి.

హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ (How to Train Your Dragon)

డ్రాగన్లను శత్రువులుగా చూసే వైకింగ్ తెగలో పుట్టిన హిక్కప్, ఒక గాయపడిన డ్రాగన్‌ను చంపలేక దానితో స్నేహం చేస్తాడు. మనుషులు, డ్రాగన్లు కలిసి జీవించవచ్చని అతను నిరూపించడమే ఈ సినిమా కథ. ఇది మూడు పార్ట్లుగా వచ్చింది. మూడూ కూడా సూపర్ హిట్ అయ్యాయి.

వైలెట్ ఎవర్‌గార్డెన్: ది మూవీ (Violet Evergarden: The Movie) 

Advertisement

క్యోటో యానిమేషన్ స్టూడియో అత్యంత అందమైన, కళ్లు చెదిరే విజువల్స్‌తో దీనిని నిర్మించారు. ఇది జపాన్ అకాడమీ ఫిల్మ్ ప్రైజ్ వంటి అనేక అవార్డులను గెలుచుకుంది.

పాప్ డెమొన్ హంటర్స్ (KPop Demon Hunters)

2025లో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఒక అమ్మాయిల మ్యూజిక్ గ్రూప్ రాక్షసులతో పోరాడటం దీని కథాంశం.

నిమోనా (Nimona)

Advertisement

ఒక రాణిని హత్య చేశాడనే నింద బాలిస్టర్ బోల్డ్‌హార్ట్ అనే యోధుడి పై పడుతుంది. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి అతను ప్రయత్నిస్తుండగా, రూపం మార్చుకునే శక్తులున్న నిమోనా అనే అల్లరి అమ్మాయి అతనికి తోడవుతుంది. వీళ్ళు కలిసి చేసే ఈ ప్రయాణంతో ఈ స్టోరీ సాగుతుంది.

ద వైల్డ్ రోబోట్ (The Wild Robot) 

డ్రీమ్‌వర్క్స్ రూపొందించిన ఈ చిత్రం, ఒక దీవిలో చిక్కుకున్న రోబోట్ ప్రకృతితో ఎలా కలసిపోతుందో అద్భుతంగా చూపిస్తుంది.

వాలెస్ & గ్రోమిట్ (Wallace & Gromit)

స్టాప్-మోషన్ టెక్నాలజీతో రూపొందిన ఈ కామెడీ థ్రిల్లర్ ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ

స్పైడర్ మాన్: అక్రాస్ ద స్పైడర్-వర్స్

విజువల్స్ పరంగా ఇదొక అద్భుతం. యాక్షన్ ప్రియులకు ఇది బెస్ట్ ఛాయిస్.

గిల్లెర్మో డెల్ టోరోస్ పినోచియో

ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఈ చిత్రం పాత పినోచియో కథకు సరికొత్త రూపాన్ని ఇచ్చింది. విజువల్స్ ఓ రేంజ్ లో ఉంటాయి.

ద సీ బీస్ట్ (The Sea Beast)

సముద్రపు రాక్షసుల వేట నేపథ్యంలో సాగే ఈ అడ్వెంచర్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక వ్యూస్ పొందిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

క్లాజ్ (Klaus)

క్రిస్మస్ తాత కథను విభిన్నంగా చూపించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పై అన్ని సినిమాలను ఒక్క సారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంటుంది.

Read Also : ‘ది రాజా సాబ్’ నుంచి రాజ్ బి శెట్టి యాక్షన్ థ్రిల్లర్ వరకు.. ఈ వారం ఓటీటీలోకి వస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీస్

 

Tags

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×