E-Paper
Advertisement

హోర్డింగ్ లోపల వ్యక్తి నివాసం.. నెట్‌ ఫ్లిక్స్ వింత ప్రచారం!

హోర్డింగ్ లోపల వ్యక్తి నివాసం.. నెట్‌ ఫ్లిక్స్ వింత ప్రచారం!
Advertisement

Netflix Viral Movie Promotion: సినిమా ప్రమోషన్ కోసం సాధారణంగా పోస్టర్లు, ట్రైలర్లు, ఇంటర్వ్యూలు, ఈవెంట్లు నిర్వహిస్తుంటారు. కానీ, నెట్‌ ఫ్లిక్స్ మాత్రం ఓ సినిమా ప్రచారం కోసం డిఫరెంట్ రూట్ ను ఎంచుకుంది. ప్రస్తుతం ఈ ఆలోచన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంత మంది ఈ ఐడియాను మెచ్చుకుంటే, మరికొంత మంది తిడుతున్నారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

మూవీ ప్రమోషన్ లో భాగంగా నెట్ ఫ్లిక్స్.. లాస్ ఏంజెల్స్‌లోని సన్‌ సెట్ బౌలే వార్డ్‌ పై ఏకంగా 30 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన ఇంటి ఆకారపు బిల్‌ బోర్డ్‌లో ఓ వ్యక్తిని 24 గంటలకు పైగా ఉంచింది. ఈ స్టంట్‌లో పాల్గొన్న వ్యక్తి పేరు నాథన్ షూప్. 34 ఏళ్ల అతను బిల్‌ బోర్డ్‌పై ఏర్పాటు చేసిన చిన్న ఇంట్లో బాత్‌ రోబ్ వేసుకుని గడిపాడు. అతడికి అక్కడ ఎయిర్ కండిషనింగ్, వైట్‌ బోర్డ్ లాంటి కొన్ని సదుపాయాలు మాత్రమే ఉన్నాయి. తినడానికి సోర్ స్ట్రిప్స్ కూడా కొన్నే ఇచ్చింది. ఈ స్టంట్‌లో మరో ఆసక్తికరమైన అంశం.అతడు ఉంటున్న బిల్‌ బోర్డ్ కింద ‘‘మీరు ఎంతకాలం జీవించగలరు?’’ అనే ప్రశ్నను కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రచారం ‘ది లాస్ట్ హౌస్’ అనే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కోసం నెట్‌ ఫ్లిక్స్‌ నిర్వహించింది.

అసలు ట్విస్ట్ ఇదే!

Advertisement

ఈ ప్రమోషన్‌లో అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే.. బిల్‌ బోర్డ్‌ పై ఇంతసేపు గడిపిన నాథన్ షూప్ ఆ సినిమాలో నటించలేదు. ఈ ప్రత్యేకమైన ప్రమోషన్‌లో పాల్గొనే అవకాశం కోసం నాథన్ షూప్ మరో తొమ్మిది మంది నటులతో పోటీ పడ్డాడు. చివరకు సినిమాలో ఇంట్లో బందీగా ఉన్న ఓ సాధారణ వ్యక్తి ఎలా ఉంటాడో బాగా చూపించడంతో అతడిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సినిమా కథకు తగ్గట్టుగానే షూప్‌ కు ఫోన్ ఇవ్వలేదు.

నెట్‌ఫ్లిక్స్‌కు కొత్త ప్రచార వ్యూహం

ఈ ప్రమోషన్ వెనుక నెట్‌ ఫ్లిక్స్‌ కు మరో కారణం కూడా ఉందని ఇండస్ట్రీ టాక్. గత ఏడాది ‘KPop Demon Hunters’ తర్వాత నెట్‌ ఫ్లిక్స్‌ కు అదే స్థాయిలో హిట్ దొరకలేదు. ఆ సినిమా ఇప్పటికీ గ్లోబల్ టాప్ 10లో కొనసాగుతోంది. కెవిన్ హార్ట్ నటించిన ‘72 అవర్స్’ కూడా మంచి స్పందన తెచ్చుకున్నప్పటికీ, ఆయన 2022లో నటించిన ‘Me Time’తో పోలిస్తే తొలి వీకెండ్ వ్యూస్ సగం కంటే తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ‘ది లాస్ట్ హౌస్’ సూపర్ హిట్ కోసం ఈ వింత ప్రమోషన్ ను ఎంచుకుంది.

నిర్వాహకులకు భారీ జరిమానా

Advertisement

సినిమా ప్రచారం కోసం చేసిన ఈ వినూత్న ప్రయత్నం చివరకు భారీ జరిమానాకు దారితీసింది. ఆ హోర్డింగ్ లో ఉన్న వ్యక్తి రోడ్డుపై వెళ్లే వారికి చేతులు ఊపుతూ కనిపించాడు. ఈ దృశ్యాన్ని చూసేందుకు వాహనదారులు వేగం తగ్గించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో స్థానిక అధికారులు ఈ స్టంట్‌ వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని భావించారు. ఈ ప్రమోషన్ నిర్వహించిన సంస్థకు సుమారు $200,000(రూ. 1.7 కోట్ల) జరిమానా విధించారు. అంతేకాదు, మూడు రోజుల్లోగా ఆ నిర్మాణాన్ని తొలగించాలని ఆదేశించారు. వినూత్న ప్రచారంగా మొదలైన ఈ ప్రయత్నం చివరకు సంస్థకు భారీ నష్టాన్ని మిగిల్చింది.

‘ది లాస్ట్ హౌస్’ గురించి..

‘ది లాస్ట్ హౌస్’ మూవీలో గ్రెటా లీ, వాగ్నర్ మౌరా ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాలో ఓ కుటుంబం తమ సొంత ఇంట్లోనే చిక్కుకుపోతుంది. తల్లిదండ్రులు, వారి ఇద్దరు పిల్లలు బయటకు వెళ్లే మార్గం లేకుండా ఇంట్లోనే బందీలుగా మారుతారు. ఆ పరిస్థితి నుంచి వారు ఎలా బయటపడతారనే అంశం చుట్టూ కథ సాగుతుంది.

Read Also: అందరికీ నో చెప్పే నయన్.. యశ్ అడగ్గానే అందుకు ఓకే చెప్పిందట.. ‘టాక్సిక్’ ఈవెంట్‌ లో సర్‌ప్రైజ్!

Tags

Related News

ఓటీటీలోకి నయనతార ‘హాయ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

ఫుట్‌బాల్ స్టార్ కెరీర్‌కు బ్రేక్… డ్యాన్సర్ గర్ల్‌ఫ్రెండ్‌కు కొత్త కష్టాలు… రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ

సముద్రం కింద మరో అద్భుత ప్రపంచం… ఎడారిలోనూ వేలాది జీవుల వింత జీవితం… కళ్లకు విందు చేసే నేచర్ డాక్యుమెంటరీ

కాస్మెటిక్ క్లినిక్‌లో షాకింగ్ నిజాలు… స్టార్ డాక్టర్‌తో ఢీకొన్న తర్వాత బయటపడే బ్యూటీ ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్స్

టాయ్స్‌కు కొత్త టెక్నాలజీతో పోటీ… స్మార్ట్ ట్యాబ్‌ను ఆపేందుకు రంగంలోకి వుడీ, బజ్… క్రేజీ ఫన్ అడ్వెంచర్

స్విట్జర్లాండ్ ట్రిప్‌లో తగిలే మిస్టీరియస్ యువకుడు… విధిని దాటి సాగే మ్యాజికల్ రొమాంటిక్ డ్రామా

తప్పు కేసులో జైలుకు… కోర్టు తీర్పు వెనుక షాకింగ్ సీక్రెట్… ఇంటెన్స్ కోర్టు రూమ్ సస్పెన్స్ డ్రామా

చాక్లెట్ ఫ్యాక్టరీలోకి 12 టీమ్స్ ఎంట్రీ… టెంప్ట్ అవ్వకపోతే కోట్ల ప్రైజ్ మనీ… క్రేజీ రియాలిటీ కాంపిటీషన్

Big Stories

Advertisement
×