E-Paper
Advertisement

శాంసంగ్ నుంచి మరో సూపర్ ఫోన్.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్, కొత్త డిజైన్ చూశారా?

శాంసంగ్ నుంచి మరో సూపర్ ఫోన్.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్, కొత్త డిజైన్ చూశారా?
Advertisement

Samsung Galaxy S26 FE: శాంసంగ్ నుంచి రాబోతున్న Galaxy S26 FE స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఒక ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది. ఈ హ్యాండ్ సెట్ లాంచ్‌కు ఇంకా కొన్ని వారాల సమయం ఉన్నప్పటికీ.. దీనికి సంబంధించిన డిజైన్ వివరాలు, కొన్ని రెండర్లు తాజాగా ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. ఈ కొత్త లీక్స్ ఆధారంగా ఫోన్ ఎలా ఉండబోతోంది? ఎలాంటి ఫీచర్లు ఉండవచ్చో.. ఒకసారి చూసేద్దాం.

కొత్త డిజైన్, ఆకట్టుకునే రంగులు:

తాజాగా బయటికొచ్చిన రెండర్ల ప్రకారం ఈ ఫోన్ నలుపు, ఆకుపచ్చ, ఊదా (పర్పుల్) రంగుల్లో కనిపించనుంది. అయితే వీటి అధికారిక పేర్లు ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. Galaxy S26 FE డిజైన్ చూస్తే దాదాపు ఈ ఏడాది మొదట్లో వచ్చిన Galaxy S26 మోడల్‌ను పోలి ఉంటుంది. వెనుక వైపు మూడు కెమెరాలతో కూడిన వెర్టికల్ మాడ్యూల్, దాని పక్కనే LED ఫ్లాష్‌ను అమర్చారు. గతంలో వచ్చిన గెలాక్సీ S25 FE మోడల్‌లో విడివిడిగా కెమెరా రింగ్స్ ఉండగా, ఈసారి కెమెరా భాగం కాస్త పైకి లేచినట్లుగా ఒక ప్రత్యేక మాడ్యూల్‌తో వస్తోంది.

Advertisement

Also Read: BSNL ధమాకా ప్లాన్.. రూ.999కే ప్రతీ నెలా 5,000GB డేటా, ఉచిత OTT సబ్‌స్క్రిప్షన్లు!

డిస్‌ప్లే, బాడీ ఫీచర్లు:

Galaxy S26 FEకి ఫ్లాట్ రియర్ ప్యానెల్, ఫ్లాట్ ఫ్రేమ్‌ను అందించారు. కుడి వైపున పవర్ బటన్, వాల్యూమ్ బటన్లు ఉన్నాయి. ముందు భాగంలో సన్నటి బెజెల్స్‌తో కూడిన డిస్‌ప్లే, మధ్యలో సెల్ఫీ కెమెరా కోసం హోల్ పంచ్ కటౌట్ ఇచ్చారు. కింది భాగంలో ఉండే బెజెల్ మాత్రం మిగిలిన మూడు వైపుల కంటే కాస్త మందంగా ఉన్నట్లు తెలుస్తోంది.

భారీ బ్యాటరీ సామర్థ్యం:

Advertisement

ఈ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ సొంత ఎక్సినోస్ 2500 ప్రాసెసర్‌తో పాటు 12GB ర్యామ్‌తో వచ్చే అవకాశం ఉంది. ఇది ఆండ్రాయిడ్ 17 ఆధారిత వన్ UI 9 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుందని సమాచారం. ఇక ఇందులో 6.7 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీ ఉండనున్నాయి. ఇది 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా నీరు, దుమ్ము నుంచి రక్షణ కోసం IP68 రేటింగ్‌ను కూడా ఇవ్వనున్నారు.

లాంచ్ ఎప్పుడంటే?

శాంసంగ్ ఈ గెలాక్సీ S26 FE ఫోన్‌ను సెప్టెంబర్ నెలలో జరిగే IFA 2026 ఈవెంట్‌లో అధికారికంగా పరిచయం చేసే అవకాశం ఉంది. ప్రీమియం ఫీచర్లను కాస్త తక్కువ ధరకే కోరుకునే వారికి ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్ ఒక మంచి ఎంపికగా మారనుంది.

Also Read: ఉన్నట్టుండి iPhone 17 ధరలు పెంచనున్న యాపిల్.. కారణం ఏంటో తెలుసా?

Related News

మ్యాప్స్ నుంచి నేరుగా ఫుడ్ ఆర్డర్, హోటల్ బుకింగ్.. గూగుల్ తెచ్చిన కొత్త AI అప్‌డేట్ చూశారా?

బిజినెస్ కోసం బెస్ట్ డీప్ ఫ్రీజర్ కావాలా? టాప్ 5 బ్రాండ్స్, ఫీచర్స్!

అమెజాన్ ఫ్రీడమ్ సేల్ 2026..సీసీ కెమెరాలపై భారీ డిస్కౌంట్లు!

ఏడాది వ్యాలిడిటీ నుండి ఇంటర్నేషనల్ రోమింగ్ వరకు.. Airtel బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ లిస్ట్!

ఉన్నట్టుండి iPhone 17 ధరలు పెంచనున్న యాపిల్.. కారణం ఏంటో తెలుసా?

BSNL ధమాకా ప్లాన్.. రూ.999కే ప్రతీ నెలా 5,000GB డేటా, ఉచిత OTT సబ్‌స్క్రిప్షన్లు!

తక్కువ బడ్జెట్‌లో ఫ్యాన్ ప్లస్ లైట్.. అమెజాన్ సేల్‌లో అద్భుతమైన మోడల్స్

Big Stories

Advertisement
×