E-Paper
Advertisement

సెక్షన్‌ 22-ఏ భూములపై ప్రభుత్వం కసరత్తు.. ఆ జాబితాలో 2 లక్షల ఎకరాల ప్రైవేట్ భూమి

సెక్షన్‌ 22-ఏ భూములపై ప్రభుత్వం కసరత్తు.. ఆ జాబితాలో 2 లక్షల ఎకరాల ప్రైవేట్ భూమి
Advertisement

Telangana: తెలంగాణలో సెక్షన్ -22 ఏ భూములపై కసరత్తు మొదలుపెట్టింది ప్రభుత్వం. 93 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నిషేధిత భూముల జాబితా నుంచి తమ ఆస్తులను తొలగించాలని కోరుతూ దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 2.20 లక్షల ఎకరాలకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయి. జిల్లా కలెక్టర్ల వద్ద దాదాపు 20 వేలకు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. నెలన్నర రోజుల్లో వాటిని పరిష్కరించాలని రెవెన్యూ శాఖ ఆదేశించింది. అందులో రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి, వికారాబాద్‌ జిల్లాల్లో ఈ సమస్య ఎక్కువగా తేలింది.

 

సెక్షన్‌ 22-ఏ భూములపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు

Advertisement

నిషేధిత భూముల జాబితా నుంచి తమ ఆస్తులను తొలగించాలని కోరుతూ వేలాది మంది రైతులు-భూయజమానులు అధికారుకు దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. ఈ సెక్షన్ వల్ల రిజిస్ట్రేషన్‌, క్రయవిక్రయాలకు అడ్డంకిగా మారింది. ఈ జాబితా నుంచి సుమారు 2.20 లక్షల ఎకరాల భూములను తొలగించాలని దరఖాస్తులు పెట్టుకున్నారట. వాటిలో గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. దాదాపు 20 వేల దరఖాస్తులు ఆయా జిల్లా కలెక్టర్ల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. 45 రోజుల్లోగా ఆయా దరఖాస్తులు పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించింది రెవెన్యూ శాఖ. వాటిని పరిశీలించి నిషేధిత జాబితా నుంచి తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించింది.

 

నిషేధిత జాబితాలో 93 లక్షల ఎకరాలు భూమి

Advertisement

తెలంగాణ వ్యాప్తంగా 2.20 కోట్ల ఎకరాల భూమి ఉంది. అందులో దాదాపు 93 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నట్లు రెవెన్యూ అధికారి చెబుతున్నమాట. సుమారు 66 లక్షల ఎకరాలు అటవీ భూమి కాగా, 24 లక్షల ఎకరాలు అసైన్డ్‌ భూమి ఉంది. మరో 3.10 లక్షల ఎకరాలు వక్ఫ్‌, ఎండోమెంట్‌ భూములున్నాయి. ఇక 1.75 లక్షల ఎకరాలు సీలింగ్‌ భూములు ఉన్నాయి. మిగిలిన వాటిలో ప్రైవేటు భూములు ఉన్నట్లు చెబుతున్నారు. వివిధ జిల్లాల్లో మరో 2 నుంచి 3 లక్షల ఎకరాల వరకు పట్టా భూములు నిషేధిత జాబితాలో ఉండే అవకాశం ఉందని అధికారుల అంచనా. కొందరు భూ యజమానులకు తమ ఆస్తి నిషేధిత జాబితాలో ఉందని తెలియలేదు. విక్రయించేందుకు రెవెన్యూ అధికారులను సంప్రదించినప్పుడు ఈ విషయం బయటపడడంతో షాకయ్యారు.

 

2 లక్షల ఎకరాల ప్రైవేట్ భూమి కూడా

నిషేధిత జాబితా నుంచి భూములను తొలగింపు విషయమై రెవెన్యూ శాఖపై దాదాపు 7 వేల కేసులు వివిధ కోర్టుల్లో దాఖలయ్యాయి. అందులో హైకోర్టులో దాఖలైన పిటిషన్లు ఉన్నాయి. అనేక కేసులు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నాయి. దీనిపై పరిశీలించాలని హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొన్ని నెలల కిందట రెవెన్యూ-రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖలు కలిసి సెక్షన్‌ 22-ఏ నిషేధిత జాబితాను సవరించే ప్రక్రియ మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో ప్రతి దరఖాస్తు పరిశీలించి 45 రోజుల్లో పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రిజిస్ట్రేషన్‌ చట్టంలోని సెక్షన్‌ 22-ఏ కింద చాలా రకాల భూములు ఉన్నాయి. వాటి రిజిస్ట్రేషన్‌కు నిషేధిత జాబితాలో చేర్చింది. ప్రభుత్వ, అసైన్డ్‌, వక్ఫ్‌, ఎండోమెంట్‌, భూదాన్‌, సీలింగ్‌ భూములతోపాటు కోర్టు వివాదాల్లో ఉన్న ఆస్తులు ఉన్నాయి.

ALSO READ: రాజకీయ నేతలకు సెక్యూరిటీ ఎందుకు?.. అసలు నిజం బయటపెట్టిన డీజీపీ!

Related News

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆర్‌టీఓ ఆఫీసుల్లో దళారీల నిషేధం!

Big Stories

Advertisement
×