OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలో సినిమాలు, సిరీస్‌ల సందడి మామూలుగా లేదు. ఫాంటసీ కామెడీ నుంచి సూపర్‌నేచురల్ హారర్ వరకు, క్రైమ్ థ్రిల్లర్ నుంచి లవ్ స్టోరీలు, సైకలాజికల్ థ్రిల్లర్ల వరకు కొత్త కంటెంట్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా తెలుగులో కూడా అందుబాటులోకి వస్తున్న సినిమాలు, సిరీస్‌లు ఎక్కువగా ఉండటంతో తెలుగు ఓటీటీ లవర్స్‌కు ఈ వీకెండ్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్ రెడీ అయింది.
అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన ‘రంభ ఊర్వశి మేనక’ (Ramba Oorvasi Menaka)లో దేవలోకానికి చెందిన ముగ్గురు అప్సరసలు భూమ్మీదకు రావడం, దాని చుట్టూ జరిగే కామెడీ, ఫాంటసీ సంఘటనలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇక ‘అగధ’ (Agadha)లో రహస్యమైన గుహ, గర్భిణీ మహిళ ఆత్మహత్య, దైవశక్తి–దుష్టశక్తుల మధ్య పోరాటం భయపెడుతుంది. ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ (Mension House Mallesh) కుటుంబ నేపథ్యంలోని కామెడీ, డ్రామాతో అలరించనుంది.
మరోవైపు ‘షాక్: ట్రస్ట్ నో వన్’ (Shaque: Trust No One)లో నమ్మకం, మోసం చుట్టూ సాగే క్రైమ్ సస్పెన్స్ కనిపించనుంది. ‘డోంట్ బీ షై’ (Don’t Be Shy)లో మూడేళ్ల ప్రేమకు బ్రేకప్ చెప్పిన మాజీ ప్రియుడిపై రివెంజ్ తీర్చుకోవాలని అనుకునే యువతి… అతని కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తోనే స్నేహం చేయడం ఆసక్తికరంగా ఉంటుంది.
‘హుంకార్: ది రోర్’ (Hunkkaar: The Roar)లో 17 ఏళ్ల అమ్మాయి ఓ శక్తివంతమైన గురువుపై ఆరోపణలు చేయడంతో మొదలయ్యే కేసు కోర్టు వరకు వెళ్తుంది. ఇక ‘ది లవ్ హైపోథిసిస్’ (The Love Hypothesis)లో అకడమిక్ పోటీ మధ్య మొదలయ్యే ఓ ఊహించని ప్రేమకథను చూడొచ్చు.
పిల్లలతో కలిసి చూడాలనుకునేవారికి ‘టాయ్ స్టోరీ 5’ (Toy Story 5) స్పెషల్ అట్రాక్షన్. వుడీ (Woody), బజ్ (Buzz) ప్రపంచంలో ఈసారి టాయ్స్‌కు టెక్నాలజీ రూపంలో కొత్త సవాలు ఎదురవుతుంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘యునాబాంబర్’ (UNABOMBER)లో హార్వర్డ్ మేధావి టెడ్ కాజిన్స్కీ (Ted Kaczynski) బాంబర్‌గా ఎలా మారాడు, అతని కోసం FBI ఎలా వేట సాగించింది అనేది చూపిస్తారు. చివరగా ‘దిస్ టెంప్టింగ్ మ్యాడ్‌నెస్’ (This Tempting Madness)లో కోమా నుంచి లేచిన మహిళకు ఆరు నెలల జ్ఞాపకాలు మిస్సవుతాయి. భర్త కనిపించకపోవడంతో అసలు ఆ సమయంలో ఏం జరిగిందనే మిస్టరీ మొదలవుతుంది.
‘రంభ ఊర్వశి మేనక’, ‘మెన్షన్ హౌస్ మల్లేష్’, ‘డోంట్ బీ షై’, ‘ది లవ్ హైపోథిసిస్’ సినిమాలు ప్రైమ్ వీడియో (Prime Video)లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ‘అగధ’ జీ5 (ZEE5)లో, ‘షేక్ ట్రస్ట్ నో వన్’, ‘యునాబాంబర్’ నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో, ‘హుంకార్: ది రోర్’, ‘టాయ్ స్టోరీ 5’ జియోహాట్‌స్టార్ (JioHotstar)లో, ‘దిస్ టెంప్టింగ్ మ్యాడ్‌నెస్’ లయన్స్‌గేట్ ప్లే (Lionsgate Play)లో అందుబాటులో ఉన్నాయి. భాషల విషయానికి వస్తే వీటిలో చాలా సినిమాలు తెలుగు ఆడియోతోనే వస్తుండటంతో ఈ వీకెండ్ ఓటీటీ ఆడియన్స్ కు మంచి ఆప్షన్స్‌గా ఉన్నట్టే.
Read Also: నోట్‌బుక్ నుంచి మనుషులు బయటకొస్తే… పుస్తకం చేతులు మారడంతో మొదలయ్యే గందరగోళం…