India Vs Pakistan War : భారత్, పాకిస్తాన్ యుద్ధం ముగిసింది. పెద్దన్న అమెరికా వల్లే ఇదంతా జరిగిందని ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది. కానీ ఈ యుద్ధం వెనక ఉన్నదెవరు? ఆపిందెవరు? అమెరికా వ్యూహం ఏంటి అనే కథనాలు తెరపైకి వస్తున్నాయి.
ట్రంప్ ఎంకరేజ్
ఇండియా పాక్ వార్‌ను అమెరికా మొదట ఎంకరేజ్ చేసింది. మోదీ తన ఫ్రెండ్ అని.. పాక్‌ను స్మాష్ చేస్తామని ట్రంప్ అన్నారు. పాక్ పై భారత్ తీసుకునే ఎలాంటి సైనిక చర్యనైనా తాము గౌరవిస్తామని అంది. భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట.. పాక్, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లోని తొమ్మిది ప్రాంతాల్లోని ఉగ్ర స్థావరాలపై కాల్పులు జరిపింది. పుల్వామా దాడుల సూత్రధారి మసూద్ అజర్ సోదరుడు రవూఫ్ సహా ఎందరో కుటుంబ సభ్యులు హతమయ్యారు. లష్కరే చీఫ్ హఫీజ్ కొడుకు తల్హా సయీద్ సైతం చనిపోయినట్టు వార్తలొచ్చాయి. పాక్ ఆర్మీకి తీవ్ర స్థాయిలో నష్టం జరిగింది.
పాక్‌కు సాయం.. ఇండియాతో వ్యాపారం
ఒకసారి గతంలోకి వెళ్తే.. అమెరికా పాక్ ద్వారా ఉగ్రవాదాన్ని ప్రేరేపించి.. తద్వారా భారత్ నుంచి ఆయుధాల కొనుగోలు చేయించాలన్న ఎత్తుగడ వేసిందన్న అభిప్రాయాలున్నాయి. పాక్ కి మిలియన్ల కొద్దీ డాలర్లు ఇస్తూ.. భారత్ వంటి దేశాల ద్వారా యూఎస్ బిలియన్ల కొద్దీ ఆయుధాల కొనుగోళ్లు చేయించే ప్లాన్ ఉందని అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు.
ఉక్రెయిన్‌తో అమెరికా గేమ్
ఉక్రెయిన్ విషయంలోనూ అమెరికా ఇలాగే వ్యవహరించింది. ఆ దేశ ఖనిజ వనరులపై కన్నేసిన యూఎస్.. సరిగ్గా టైం చూసి దెబ్బ కొట్టింది. మీ దేశ పునఃనిర్మాణానికి అవసరమైన నిధులు కావాలంటే మీ ఖనిజవనరుల తవ్వకాలకు మాకు అనుమతులు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసింది. అన్నంత పని చేసి చూపింది.
కాసులు కురిపించే వెపన్ బిజినెస్
భారత్ విషయంలోనూ అమెరికా వ్యూహం సరిగ్గా అలాంటిదేనంటారు. భారత్ ని వార్ ఎమర్జెన్సీలో పడేసి.. తద్వారా బిలియన్ డాలర్ల ఆయుధాల వ్యాపారానికి యత్నించింది. గతంలో భారత్ రష్యా మధ్య జరిగిన ఎస్ 400 కొనుగోళ్లలోనూ అభ్యంతరాలను వ్యక్తం చేసింది. అయినా సరే ఈ రెండు దేశాలు S400 డీల్ ని వదులుకోలేదు. రష్యా సరఫరా చేసిన ఎస్ 400ల ద్వారా ప్రస్తుత యుద్ధంలో భారత్.. పాక్ దాడిని తిప్పి కొట్టింది.
అమెరికా డబుల్ గేమ్?
ఇలాంటి ఎన్నో ఎత్తుగడలతో అమెరికా, భారత్‌ను యుద్ధ పరిస్థితిలో పడవేసి తద్వారా.. భారత్ నుంచి ఆయుధ వ్యాపారం చేయాల్నది అసలు ఎత్తుగడ అనే అనుమానం లేకపోలేదు. ఈ విషయం మోడీ ఎప్పుడో గుర్తించారు. అందుకే తన యంత్రాంగం సాయంతో సిక్స్ డైమన్షనల్ ఫార్ములా అప్లై చేశారు. ఇప్పటి వరకూ తమ అమ్మల పొదలిలో ఉన్న.. అస్త్రాలను మాత్రమే వాడుకుని అద్భుత ఫలితాలను రాబట్టారు.
యూఎస్ డిఫెన్స్‌లో పడిందా?
ఇంత చేస్తే భారత్ తమ వ్యూహంలో చిక్కక పోవడంతో యూఎస్ వెంటనే స్టాండ్ మార్చేసింది. పాక్ వాడిన అమెరికాకు చెందిన F 16 ఫైటర్ జెట్స్ కుప్పకూలడం.. రష్యన్ మేడ్ S400 వీరంగం వేయడంతో.. యూఎస్ సత్తా కాస్త పలుచ బారింది. వెంటనే యుద్ధాన్ని ఆపే దిశగా అమెరికా పావులు కదిపింది. భారత్ పాక్ లతో చర్చలు సాగించి.. ఈ కాల్పులను విరమించిన పేరైనా సాధించాలని భావించి ఉంటుందని అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు.
Also Read : యుద్ధంతో పాక్‌కు భారత్ నేర్పిన గుణపాఠం ఇదే..