BigTV English

Kaliyugam 2064 Review: ‘కలియుగమ్ 2064’ రివ్యూ … కాన్సెప్ట్ మంచిదే కానీ?

Kaliyugam 2064 Review: ‘కలియుగమ్ 2064’ రివ్యూ … కాన్సెప్ట్ మంచిదే కానీ?

Kaliyugam 2064 Review: టాలీవుడ్ శ్రద్దా శ్రీనాథ్ తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవసరం లేని పేరు. కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. ‘జెర్సీ’ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ ‘డాకు మహారాజ్’ వంటి హిట్లు ఈమె ఖాతాలో ఉన్నాయి. ఇక ఆమె ప్రధాన పాత్రలో రూపొందిన ‘కలియుగమ్ 2064’ ఈ మే 9న రిలీజ్ అయ్యింది. ట్రైలర్ తో ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను ఆకర్షించిన ఈ సినిమా.. ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉందో లేదో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి..


కథ..

మూడో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత 2064 లో కరువులు వస్తాయి. మనుషులు తినడానికి ఫుడ్ ఉండదు. నెలలు తరబడి తినడానికి తిండి లేక వాళ్ళ మైండ్ పనిచేయదు. దీంతో ఏవేవో ఘోరమైన వాటికి పాల్పడతారు. అయితే మరోపక్క డబ్బున్నోళ్లు రెసిడెంట్స్ గా ఒక నగరాన్ని నిర్మించుకుంటారు. అక్కడికి వెళ్లి సుఖంగా బ్రతకాలనేది ఈ కరువులో ఉన్న జనాల కోరిక. వీళ్ళ కోసం అండగా నిలబడతామని ఓ వర్గం లిబరేటర్స్ గా మారతారు. అందులో ఒకడు శక్తి(కిషోర్). ఇతని టీం అంతా రెసిడెన్స్ చేతిలో మరణిస్తారు. ఇతను మాత్రం తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఓ సేఫ్ హౌస్ గురించి తెలుస్తుంది. వెంటనే అక్కడికి వెళ్తాడు. అక్కడ థామస్ (ఇనియన్ సుబ్రమణి) ఇతనికి తిండి, నీరు ఇచ్చి చేరదీస్తాడు. బయట జనాలు తిండి లేక కొట్టుకుని చనిపోతుంటే.. ఇతనికి మాత్రం ఇన్ని సుఖాలు ఎలా దక్కాయి? అని భావించి థామస్ ను చంపి.. ఆ సేఫ్ హౌస్ ను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు శక్తి. అయితే ఇంతలో అతనికి భయంకరమైన షాక్ ఇస్తాడు థామస్. అదేంటి? మరోపక్క అదే ఇంట్లోకి భూమి (శ్రద్దా శ్రీనాథ్) ఎందుకు వచ్చింది? మధ్యలో కల్కి ఎవరు? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.


విశ్లేషణ..

‘కలియుగమ్ 2064’ టైటిల్ ను బట్టి, ట్రైలర్ ను బట్టి ఈ సినిమా కథాంశం ఎలా ఉండబోతుందో అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. క్యాప్షన్లో కూడా ‘విట్నెస్ ది వరస్ట్ ఆఫ్ హ్యుమానిటీ’ అని ఉంది. సో దర్శకుడు ప్రమోద్ సుందర్ ఏం చెప్పాలనుకున్నాడో.. ఏం  చూపించబోతున్నాడో ముందుగానే ఒక క్లారిటీ ఇచ్చేశాడు. దానికి తగ్గట్టు ప్రిపేర్ అయ్యి వెళితే.. ఆడియన్ ఎక్కడా డీవియేట్ అవ్వకూడదు. సినిమా స్టార్టింగ్లో వచ్చే సాయి కుమార్ వాయిస్ ఓవర్ సినిమా కంటెంట్ పై మరింత క్లారిటీ ఇస్తుంది. సముద్రం ఎండిపోవడం, ఫుడ్ ట్రక్ బ్లాస్ట్ అవ్వడం వంటి సీన్స్, వాటి విజువల్స్ చూడటానికి బాగుంటాయి. కానీ తర్వాత కథనం నెమ్మదించింది. అలాంటి టైంలో ఇంటర్వెల్ వద్ద ఓ ట్విస్ట్ ఇచ్చి సెకండాఫ్ పై ఆసక్తి పెరిగేలా చేశాడు దర్శకుడు. సెకండాఫ్ స్టార్టింగ్ 20 నిమిషాలు బాగానే ఉంటుంది. తర్వాత మళ్ళీ బోర్ కొడుతోంది. క్లైమాక్స్ లో మరో ట్విస్ట్ ఇచ్చాడు. మానవత్వం గురించి ఓ చక్కటి మెసేజ్ ఇచ్చాడు. సో థీమ్ పరంగా, విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా ‘కలియుగమ్ 2064’ పాస్ మార్కులు వేయించుకుంటుంది. కానీ ఎంత డీవియేట్ అవ్వాలనుకున్నా.. ‘కల్కి 2898 AD’ ఛాయలు ఇందులో ఎక్కువగానే కనిపించాయి. అలా అని దర్శకుడిని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2023 లోనే ఈ సినిమా ట్రైలర్ వచ్చింది. అంటే ‘కల్కి..’ కంటే ముందే. కానీ ‘కల్కి 2898 ad’ చూసిన కళ్ళతో ఈ సినిమాని పూర్తిగా యాక్సెప్ట్ చేయలేము. ఒకవేళ ‘కల్కి..’ కంటే ముందు వచ్చి ఉంటే.. కచ్చితంగా దీనిని ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకునే అవకాశం ఉండేదేమో.

నటీనటుల విషయానికి వస్తే.. శ్రద్దా శ్రీనాథ్ ఇందులో బాగా చేసింది. ఆమె లుక్, ఎక్స్ప్రెషన్స్ వంటివి కూడా మెప్పిస్తాయి. కానీ ఆమె కంటే ఎక్కువగా కిషోర్, అతనికంటే ఎక్కువగా ఇనియన్ సుబ్రమణి మంచి మార్కులు కొట్టేశారు అని చెప్పాలి. మిగతా నటీనటుల మొహాలు గుర్తుపట్టే విధంగా కూడా ఉండవు.

ప్లస్ పాయింట్స్..

కాన్సెప్ట్

సినిమాటోగ్రఫీ

ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ పాయింట్స్..

‘కల్కి 2898 ad’ ఛాయలు ఉండటం

కథనం వీక్ గా ఉండటం

ఎడిటింగ్ లోపాలు..

మొత్తంగా.. ‘కలియుగమ్ 2064’ ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ‘కల్కి 2898 ad’ కంటే ముందుగా వచ్చి ఉంటే.. కచ్చితంగా ఆడియన్స్ రిసీవింగ్ బెటర్ గా ఉండేదేమో. కథకి బ్లాక్ బస్టర్ పొటెన్షియాలిటీ ఉన్నప్పటికీ.. వీక్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే కారణంగా బోర్ కొట్టిస్తుంది. తర్వాత ఓటీటీలో చూస్తే ఇలాంటి నెగిటివ్స్ కనిపించకపోవచ్చు.

రేటింగ్ : 2.25/5

Related News

Bun Butter Jam Review : ‘బన్ బటర్ జామ్’ మూవీ రివ్యూ… జెన్ జెడ్ ఫీల్-గుడ్ ట్రీట్

Paradha Review: ‘పరదా’ రివ్యూ : గుడ్డినమ్మకం పనికిరా(లే)దు 

Tehran Movie Review : ‘టెహ్రాన్’ మూవీ రివ్యూ… యాక్షన్‌‌తో దుమ్మురేపే గ్లోబల్ స్పై థ్రిల్లర్

Coolie Movie Review : కూలీ మూవీ రివ్యూ… లోకి ‘లో’ మార్క్

WAR 2 Movie Review : వార్ 2 మూవీ రివ్యూ.. జస్ట్ వార్ – నో రోర్

Coolie Twitter Review : కూలీ సినిమా ట్విట్టర్ రివ్యూ

Big Stories

×