Gundeninda GudiGantalu Today episode march 25 th : నిన్నటి ఎపిసోడ్ లో.. గోల్డ్ చైన్ కనిపించకుండా పోవడానికి మీనాన్నే కారణమని ప్రభావతి మీనా ను తిడుతుంది. ఇప్పుడే బాలు లోపలికి వచ్చి ఏమైంది ఎందుకు తిడుతున్నావ్ ఏం చేసింది నా భార్య అంతగా అనేసి అడుగుతాడు. ఆ బంగారు చైను నా చేతికివ్వమని చెప్పాను కానీ ఈవిడ ఇవ్వకుండా ఈవిడ భర్త అన్ని చేస్తున్నారన్నట్టుగా గొప్పగా చెప్పుకోవాలని ఆ చైన్ ఆమె దగ్గర పెట్టుకొని పోగొట్టేసింది మొత్తానికి అది దొరికింది కాబట్టి సరిపోయింది లేకున్నా అంటే మన పరువు ఏం కావాలి అని మీన పై అరుస్తుంది. వెంటనే శ్రుతి ఎందుకంటే మీరు ఊరికే మీనా అని అర్థం చేసుకోకుండా అరుస్తారు అని ఆడుతుంది.. ఇదంతా చేసింది మీనా కాదు ఆ చంద్రకాంతం నేను కాసేపు బయటకు వెళ్లి వచ్చేలోగా ఇదంతా జరిగింది మీనా అని అందరూ తిట్టేశారు బయట నేను ఒక వీడియో తీస్తున్నప్పుడు ఆమెడా కార్లో పెట్టడం నేను చూశాను అందుకే లోపలికి వచ్చి చైన్ తెచ్చాను అంటుంది.
ఆ మాట వినగానే ఇంట్లోని వాళ్ళందరూ షాక్ అవుతారు. ఆమె ఇదంతా చేసి ఇన్ని మాటలు నిండా అని నోరెళ్ల పెట్టేస్తారు. ఇక మీనా శృతికి థాంక్స్ చెప్తుంది. నన్ను పెద్ద ప్రమాదం నుంచి కాపాడే వ శృతి చాలా థాంక్స్ అనేసి అంటుంది అలాగే రోహిణి కూడా నన్ను సపోర్ట్ చేసి మాట్లాడావు అని థాంక్స్ చెప్తుంది. బాలు వాళ్ళ నానమ్మ ఉగాదికి ఇంటికి రమ్మని ఫోన్ చేస్తుంది. బాలు మనోజ్ పై సెటైర్స్ వేస్తాడు. రోహిణికి ప్రభావతి షాకిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బాలు వాళ్ళ నాన్నమ్మ ఫోన్ చేసి అందర్నీ ఇంటికి రమ్మని పిలుస్తుంది ఉగాది అక్కడే జరుపుకోవాలని చెప్పడంతో బాలు అందరం అక్కడికి వెళ్తున్నామని అంటాడు కానీ మనోజ్ మాత్రం నాకు ఇంటర్వ్యూలు ఉన్నాయి నేను రాలేను అని చెప్తే రోహిణి సీరియస్ అవుతుంది. ప్రభావతి బాలుగడి నోరు మూయించాలంటే కచ్చితంగా మీ నాన్నకు అని మీ మావయ్య కానీ ఎవరో ఒక రావాల్సిందేనమ్మా అని కండిషన్ పెడుతుంది. దానికి రోహిణి షాక్ అవుతుంది ఈ నాటకానికి ఎలాగైనా తెరపడేలా చేయాలి లేకున్నా అంటే నేనే బుక్కై మొదటికే మోసం వచ్చేలా ఉంది అని అనుకుంటుంది.
తర్వాత రోజు ఉదయం విద్య దగ్గరికి రోహిణి వెళ్లి ఈ విషయాన్ని చెప్తుంది. రోహిణి ఈ గండం నుంచి ఎలాగైనా గట్టెక్కించాలి అని విద్యని రిక్వెస్ట్ చేస్తుంది. ఇక చేసేదేమీ లేక తన మామయ్యగా ఒకరిని నాటకం ఆడించాలని చెప్తుంది మొదట రోహిణి భయపడ్డా కూడా ఆ తర్వాత ఏదో ఒకటి చేసి ఈ గండం నుంచి బయట పడాలని అనడంతో రోహిణిని మటన్ కొట్టు మాణిక్యం దగ్గరికి తీసుకెళ్తుంది. అతని నటన చూసి రోహిణి షాక్ అవుతుంది అక్కడికి వెళ్లి రాజమౌళి మహేష్ బాబు సినిమాలో వేషం ఉంది ఫస్ట్ రిహార్సల్ చేయాల్సి వస్తుంది నువ్వు ముందు ఈ అమ్మాయికి మేనమామగా నటించాలని అంటుంది విద్య. మొదట అతను ఇదేదో తిరకసులాగా ఉంది అని అనుకున్న కూడా తర్వాత విద్యా తన మాటలతో మాయ చేసి మాణిక్యమును నటనకు ఒప్పిస్తుంది.
బాలు మీనా దగ్గరికి వచ్చి నాకు అప్పు కావాలని అడుగుతాడు. అప్పు ఎందుకండి మీరు కావాలంటే గల్లపెట్టే నుంచి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు అని మీనా అంటుంది. తాగడానికి అయితే మాత్రం నేను ఇవ్వనండి అనేసి నేను అనగానే తాగడానికే నాన్నకు పని నేనేమన్నా తాగుబోతు ప్రెసిడెంట్ అనుకుంటున్నావా నాకు ఒక చిన్న పని పడింది 800 డబ్బులు కావాలని తీసుకొని వెళ్తాడు. మీనా దగ్గరికి శివ వస్తాడు మీనా గాజులను విడిపించుకుని తీసుకొస్తే నువ్వు డబ్బులు వస్తే అమ్మకి ఇవ్వు నాకేం వద్దు మీ బావగారు డబ్బులు ఉన్నప్పుడే నాకు విడిపించి తీసుకొచ్చి ఇస్తాడు అని అంటుంది.
మామయ్య క్యారెక్టర్ అంటే నాకు కొంచెం భయమేస్తుంది ఈయన ఏదన్నా పెంట పెట్టేస్తే నా లైఫ్ మొత్తం రివర్స్ అవుతుంది అని రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది. నువ్వేం భయపడకు చాలా మంచివాడు మనమేం చెప్తే అది చేస్తాడు అని విద్య అంటుంది. తర్వాత మావయ్య వస్తే సరిపోదు కనీసం మనోజ్ కి బ్రేస్ లేట్ అన్న తీసుకురావాలి అని అంటే వామ్మో నువ్వు ఎంత పెద్ద లెక్కలేస్తున్నావో తెలుసా? ఇప్పుడు బ్రేజ్ లైటు పూలు పనులు అంటే దగ్గర దగ్గర లక్ష రూపాయలు పైనే అవుతుంది అని విద్య అంటుంది.
ఏదేమైనా కూడా డబ్బులు తీసుకొస్తేనే నాకు కొంచెం మర్యాద ఉంటుంది అని రోహిణి గుణ దగ్గరికి డబ్బుల కోసం వెళుతుంది. గుణ దగ్గర శివ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటాడు అయితే అప్పుడే రాజేష్ అక్కడికి వస్తాడు. శివ నువ్వేంటి ఇక్కడ అంటే నేను ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నానన్న అని అంటాడు. ఇక ఆ తర్వాత రోహిణి, విద్య అక్కడికొస్తే వాళ్ళని చూసే శివ లోపలికి వెళ్ళిపోతాడు. లక్ష రూపాయలు అప్పు కావాలని గుణ దగ్గర రోహిణి డబ్బులు తీసుకుంటుంది వీరిద్దరూ ఏదో చేస్తున్నారు ఏదో జరుగుతుంది లక్ష రూపాయలు అప్పు తీసుకోవడం ఏంటి ఆల్రెడీ ఇచ్చిన అప్డే ఇంకా తీర్చలేదు కదా అనేసి శివ అంటాడు.
మీనా కోసం బాలు సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చి మీనా చేతిలో పెడతాడు అది చూసి మీనా షాక్ అవుతుంది. మన ఊరు వెళ్తాం కదా అక్కడ నీకు కట్టుకోవడానికి మంచి చీర కూడా లేదు అని నేను కొత్త చీర కొన్నాను నా దగ్గర ఎక్స్ట్రా డబ్బులు వచ్చాయి ఇంకాస్త తక్కువ అయితే నీ దగ్గర తీసుకున్నాను మళ్ళీ అప్పుగానే ఇచ్చేస్తాలే అనేసి బాలు అంటాడు. బాలు ప్రేమను చూసి మీనా మురిసిపోతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో రోహిణి వాళ్ళ మామయ్య పై బాలుకు అనుమానం మొదలవుతుంది. మానిక్యం నాటకం బయటపడుతుందేమో చూడాలి..