Kerala Skeletal: లివింగ్ టు గెదర్ మానవ జీవితాలను నాశనం చేస్తున్నాయా? యువతీ యువకులు ఈ కాన్సెప్ట్‌కు ఎందుకు అడెక్ట్ అవుతున్నారు? కేవలం కేరళకు మాత్రమే పరిమితం కాలేదు. ఆ తరహా ఉదంతాలు దేశంలో చాలానే జరుగుతున్నాయి. కేరళ కేసులో ఆ యువకుడు తన బాధను పోలీసుల ముందు వెళ్లగక్కాడు. దీంతో అసలు విషయం బయటకువచ్చింది.
కేరళలోని త్రిస్సూర్‌లోని ఊహించని ఘటన వెలుగులోకి వచ్చింది. పుదుక్కాడ్ పోలీస్ స్టేషన్‌కు శనివారం రాత్రి ఇద్దరు శిశువుల అస్థిపంజరాలతో సంచిని తీసుకొచ్చాడు. తన వద్ద అవశేషాలు ఉన్నాయని పోలీసులకు చెప్పాడు. ఆ అస్థికలకు చెందిన చిన్నారులు వేర్వేరు ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారని చెప్పుకొచ్చాడు.
మద్యం మత్తులో ఆ యువకుడు నిజం చెబుతున్నాడా? ఏదైనా స్టోరీ చెబుతున్నాడా? అనేది చాలాసేపు తెలుసుకోలేకపోయారు పోలీసులు. వెంటనే అప్రమత్తమైన అధికారులు మత్తులో అతడు చెప్పిన వివరాలు నమోదు చేసుకుని, ఆ తర్వాత లోతుగా విచారణ చేపట్టారు.
సరిగ్గా ఐదేళ్ల కిందట అంటే 2020లో ఫేస్‌బుక్ ద్వారా ఆ యువకుడికి.. ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఫ్రెండ్‌షిప్‌గా మారింది. ఒకర్ని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితిలో సహజీవనం (లివింగ్ టు గెదర్)కు దారి తీసింది. వీరికి ప్రేమకు గుర్తుగా పిల్లలు పుట్టారు. నాలుగేళ్ల కిందట బిడ్డ పుట్టాడు.
ALSO READ: వాడ్ని నా చెప్పుతో కొట్టి ఉరి తీయాలి? స్వేచ్ఛ కూతురు కన్నీళ్లు
ప్రసవ సమయంలో ఆ బేబీ మరణించడంతో ఇంటి దగ్గర పూడ్చి కర్మకాండలు చేశాడు. అయితే అవశేషాలు దాచిపెట్టాడు. అదే సమయంలో వారిమధ్య మనస్పర్థలు బయటపడ్డాయి. ఈ జంటకు రెండేళ్ల కిందట పాప పుట్టింది. పాప చీటికి మాటికీ ఏడుస్తుండడంతో హత్య చేసింది ఆ సహజీవనంలో ఉన్న మహిళ. ఆ మృతదేహాన్ని యువకుడికి ఇచ్చింది.
చిన్నారుల అవశేషాలు శిశువులకు సంబంధించినవి ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వీరి మధ్య అంతర్గత విభేదాలు తలెత్తిన నేపథ్యంలో మహిళ ఫోన్‌లో మరో ఫోన్ నెంబర్ ఉన్నట్లు గుర్తించాడు ఆ యువకుడు. ఆమెకి వేరే వ్యక్తిని వివాహం చేసుకోనుందని భావించాడు. ఆ తర్వాత అనుమానం మొదలైంది.
చేసేదేమీ లేక మద్యం మత్తులో పోలీసుస్టేషన్‌కు వెళ్లి జరిగినదంతా పోలీసులకు చెప్పారు. ఆ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా పైవిషయాలను బయటపెట్టింది. ప్రసవాల విషయం మహిళ కుటుంబానికి తెలుసా? లేదా అనే దానిపై విచారణ చేస్తున్నారు పోలీసులు. రెండో పాపను హత్య కేసుగా పరిగణిస్తున్నామని తెలిపారు.
సొసైటీ బహిష్కరణకు భయపడి సహజీవనం సంబంధాన్ని సీక్రెట్‌గా ఉంచడానికి మృతదేహాలను రహస్యంగా పూడ్చిపెట్టినట్టు తెలుస్తోంది. దీనిపై ఇంకా లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ కేసులో ఇంకెన్ని ట్విస్టులు బయటపడతాయో చూడాలి.