E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

రీసార్ట్ లో రేవ్ పార్టీలు… అమ్మాయి మిస్సింగ్ తో అడ్డంగా బుక్కయ్యే ధనవంతులు

రీసార్ట్ లో రేవ్ పార్టీలు… అమ్మాయి మిస్సింగ్ తో అడ్డంగా బుక్కయ్యే ధనవంతులు
Advertisement

Crime Thriller Series: ధనవంతులకు స్వర్గధామం లాంటిది ఆ రిసార్ట్. కంటికి కనిపించని సెక్యూరిటీతో విచ్చలవిడిగా చేసుకునే పార్టీలలో ఓ అమ్మాయి మిస్ అవ్వడంతో కథ అడ్డం తిరుగుతుంది. ఆ తర్వాత స్టోరీలో ఊహించని మలుపులు చోటు చేసుకుంటాయి. ఇది 2026లో తెరపైకి వచ్చిన స్పానిష్ టీనేజ్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘ఒయాసిస్’ (Oasisi). నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ గా జూన్ 19న రిలీజ్ అయింది. తెలుగు, హిందీ, తమిళ, ఇంగ్లీష్, స్పానిష్ భాషలలో అందుబాటులో ఉంది. ఇందులో మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ఉన్నాయి.

కథలోకి వెళ్తే…

దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబాలు మాత్రమే వెళ్లగలిగే ఒక విలాసవంతమైన హాలిడే రిసార్ట్ చుట్టూ ఈ సిరీస్ స్టోరీ తిరుగుతుంది. ఆ రిసార్ట్ పేరు ఒయాసిస్ ఇన్ఫినిటీ. ప్రైవేట్ బీచ్ లు, విఐపి సౌకర్యాలు, అత్యంత కఠినంగా ఉండే సెక్యూరిటీతో ఈ రిసార్ట్ ధనికులకు ఒక స్వర్గం లాంటిదని చెప్పొచ్చు. ఇక్కడికి కొందరు ధనిక కుటుంబాలకు చెందిన యువతీ యువకులు తమ సమ్మర్ వెకేషన్ ను ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. మొదట్లో అంత సరదాగా, పార్టీలు, ప్రేమయణాలు, విలాసాలతో సాగుతుంది.

Advertisement

కానీ ఓ రోజు రాత్రి బీచ్ దగ్గర అందరూ కలిసి బోన్ ఫైర్ పార్టీ చేసుకుంటారు. ఆరోజు ఒక ఘోరమైన దాడి జరుగుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక టీనేజ్ అమ్మాయి అదృశ్యం అవుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు అకస్మాత్తుగా రీసార్ట్ పై దాడి చేసి, దానిని తమ ఆధీనంలోకి తీసుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది.

ఎంతటి ధనవంతులున్నా పోలీసులు కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆ రిసార్ట్ ను పూర్తిగా లాక్ చేస్తారు. లోపల ఉన్న గెస్ట్ లతోపాటు రీసార్ట్ స్టాప్ కూడా ఎవరూ బయటకు వెళ్ళకూడదని ఆంక్షలు విధిస్తారు. దీంతో అందులో ఉన్న ప్రతి ఒక్కరూ ఒకరిని మరొకరు అనుమానించుకోవడం మొదలు పెడతారు. ఈ నేపథ్యంలోనే అదృశ్యమైన తమ స్నేహితురాలిని వెతకడానికి డాని, హెలినా అనే ఇద్దరు యువతీ యువకులు సీక్రెట్ గా రంగంలోకి దిగుతారు.

Advertisement

అయితే హెలినాకు ఆ రాత్రి ఏం జరిగిందనే విషయాలు అసలు గుర్తుండవు. ఆ క్లూస్ కోసం ఆమె తన జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది. ఈలోగా రీసార్ట్ లోపల యువకుల మధ్య పాత గొడవలు, పాబ్లు అనే వ్యక్తి కోసం మాకా, సోఫియా అనే అమ్మాయిల మధ్య నడిచే శత్రుత్వం కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. పోలీసులు రీసార్ట్ లోపల ఉన్న అందరినీ అనుమానిస్తూ, విచారిస్తున్న కొద్ది అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక సీక్రెట్ ఉందనే అనే విషయం బయట పడుతుంది. కానీ ఆ తప్పులు బయట పడకుండా ఉండడానికి అబద్దాలు చెబుతూ పోలీసులను తప్పుదోవ పట్టిస్తారు. తన స్నేహితురాలిని వెతుకుతున్న క్రమంలో ఆమెను ఎవరో నీడలా వెంబడిస్తూ చంపాలని చూస్తారు. అసలు ఆ అమ్మాయి అదృశ్యం వెనక ఉన్న కారణం ఏంటి ? ఆ రిసార్ట్ వెనక ఉన్న డార్క్ సీక్రెట్స్ ఏంటి? ఇంతకీ నేరస్థుడు ఎవరు ? ఈ కేసును పోలీసులు ఎలా సాల్వ్ చేశారు ? అన్నదే ఈ సిరీస్ క్లైమాక్స్.

Read Also : 70 ఏళ్ల భవిష్యత్తులోకి తీసుకెళ్ళే గేమింగ్ హెడ్‌సెట్… సైన్స్ ఫిక్షన్ మూవీ లవర్స్‌కు పూనకాలే

Tags

Related News

తండ్రి ప్రియురాలు ఎంట్రీ… శవాన్ని పూడ్చే సమయంలో అన్నదమ్ములకు దిమాక్ ఖరాబ్ షాక్

దిష్టిబొమ్మ చేసే దిక్కుమాలిన పని… కొత్త ఊరంటేనే గుండె గుభేల్మనిపించే హర్రర్ మూవీ

అండర్‌వరల్డ్ డాన్‌గా మారే కబడ్డీ ఆటగాడు… ఈ సిరీస్ స్ట్రీమింగ్ తెలుగులోనే

వై-ఫై నెట్‌వర్క్‌లను హ్యాక్ చేసి దొంగతనాలు… మస్ట్ వాచ్ హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్

పాపులర్ ఆటగాడికి 10 ఏళ్ల జైలు శిక్ష… ఎఫ్‌బీఐ సీక్రెట్ ఆఫర్ తో ఊహించని మలుపు

లవర్స్ ను రిస్క్ లో పడేసే కరువు రక్కసి… కడుపుబ్బా నవ్వించే యోగి బాబు కొత్త సిరీస్

మత్తులో మర్మయిడ్ ను పట్టుకొచ్చే అడిక్ట్… ఈ కామెడీ హర్రర్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

తల్లీకూతుర్లకు నరకం చూపించే ఘోస్ట్‌ఫేస్ కిల్లర్… ఈ సైకోలు చేసిన పని చూస్తే బుర్రపాడు

Big Stories

×