E-Paper
Advertisement

జహీర్ ఖాన్ ను మధ్యలోనే గెంటేస్తారు…CSK జట్టుపై అబ్దుల్ రజాక్ సంచలనం ?

జహీర్ ఖాన్ ను మధ్యలోనే గెంటేస్తారు…CSK జట్టుపై అబ్దుల్ రజాక్ సంచలనం ?
Advertisement

Abdul Razzaq On CSK Coach Zaheer Khan:  చెన్నై సూపర్ కింగ్స్ జట్టు హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకోబోతున్న జహీర్ ఖాన్ పై విష ప్రచారం మొదలైంది. అతనిపై తాజాగా పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ అబ్దుల్ రజాక్ వివాదాస్పద స్టేట్మెంట్ ఇచ్చారు. 2027 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ మధ్యలోనే జహీర్ ఖాన్ ను చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం గెంటేస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. అలా జరగకపోతే, నన్ను దేనికైనా సిద్ధం అంటూ సవాల్ విసిరారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో జహీర్ ఖాన్ ఇమడ లేడని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో అబ్దుల్ రజాక్ చేసిన కామెంట్స్ పెను దుమారం రేపుతున్నాయి.

చెన్నై సూపర్ కింగ్స్ కొత్త హెడ్ కోచ్ గా జహీర్ ఖాన్

చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ గా జహీర్ ఖాన్ ను నియామకం చేస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. స్టీఫెన్ ఫ్లెమింగ్ తన పదవి నుంచి తప్పుకున్న నేపథ్యంలో… జహీర్ ఖాన్ ను తెరపైకి తీసుకువచ్చారు. ముంబై ఇండియన్స్ అలాగే లక్నో సూపర్ జెయింట్స్, టీమిండియా తరఫున ఆడిన అనుభవం జహీర్ ఖాన్ కు ఉంది. ఇలాంటి నేపథ్యంలోనే జహీర్ ఖాన్ కు ఈ పెద్ద బాధ్యతలు అప్పగించింది చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం. ఇలాంటి నేపథ్యంలో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. మహేంద్ర సింగ్ ధోని ఉండగా జహీర్ ఖాన్ కు ఎందుకు ఇచ్చారని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ధోనికి ఆ బాధ్యతలు ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. అయితే ధోని ఉండగా జహీర్ ఖాన్ ఉండడం కష్టమేనని మరికొంతమంది చెబుతున్నారు.

Advertisement

Ajit Agarkar opposed Jasprit Bumrah as India captain in 2023: అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు !

జహీర్ ఖాన్ ను మహేంద్ర సింగ్ ధోని తొక్కేస్తాడు

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు హెడ్ కోచ్ గా జహీర్ ఖాన్ ఎక్కువ రోజులు పని చేయలేదని బాంబు పేల్చాడు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ అబ్దుల్ రజాక్. 2027 ఐపీఎల్ టోర్నమెంట్ మధ్యలోనే అతడిని వెళ్లగొడతారని… లేదా అతడే రాజీనామా చేస్తాడని ఆరోపణలు చేశారు. మహేంద్ర సింగ్ ధోని ఉండగా ఆ స్థాయి ఆటగాళ్లు… చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో మెదలడం కష్టమేనన్నారు. గౌతమ్ గంభీర్ ను తొక్కినట్లుగా జహీర్ ఖాన్ ను మహేంద్ర సింగ్ ధోని తొక్కేస్తాడని కూడా షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు.. ఈ విషయంలో చెన్నై సూపర్ కింగ్స్ ముందే ఆలోచించి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. జహీర్ ఖాన్ (CSK Zaheer Khan) కాకుండా మహేంద్రసింగ్ ధోనీనే కోచ్ గా తీసుకుంటే.. ఇలాంటి వివాదం ఉండకపోయేదని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో అబ్దుల్ రజాక్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

Advertisement

Japan Kusuda-Nairn targets Vaibhav Sooryavanshi : రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు

 

Related News

నిద్రపోయిన అంపైర్.. సంజు సిక్సర్ కొడితే, 4 ఇచ్చాడు

అంపైర్‌ను బెదిరించి, కుట్రలు చేశారు..లెక్క ప్రకారం టీమిండియాపై జపాన్‌దే విజయం

చివరి ఓవర్‌లో వైడ్‌పై వివాదం..అంపైర్‌తో గొడవకు దిగిన అక్షర్, శ్రేయాస్ అయ్యర్

అభిషేక్ శర్మ డకౌట్…అల్లాడించిన పసికూన జపాన్‌, అతి కష్టమీద గెలిచిన టీమిండియా

శభాష్ అమ్మాయిలు…శ్రీలంక ఘోర ఓటమి, టీమిండియాకు గోల్డ్ మెడల్

సౌర‌వ్ గంగూలీ కెప్టెన్సీలో తాను ఆడింటే, నా త‌ల‌రాత మారేంది

క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టుకుని టీమిండియా ఆడుతుంది..అందుకే ఈ సారి ఓడిస్తాం

Big Stories

Advertisement
×